OnePlus 11R - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 May 2024 17:38:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-11r-nord-ce-4-discount-offers-know-full-details/ Wed, 01 May 2024 17:38:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=11304 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఉత్పత్తులకు భారత్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా వన్‌ప్లస్ లవర్స్‌కి శుభవార్త వచ్చేసింది. OnePlus 11R, OnePlus Nord CE 4 ఫోన్లపై ఆకట్టుకునే డీల్స్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్ లభించనుంది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus 11R, Nord CE 4 ఆఫర్లు OnePlus 11R డివైజ్ 2023 లో […]

The post OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై డిస్కౌంట్
  • మే 2 నుంచి సేల్ ప్రారంభం
  • OnePlus 11R, Nord CE 4 లపై డీల్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఉత్పత్తులకు భారత్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా వన్‌ప్లస్ లవర్స్‌కి శుభవార్త వచ్చేసింది. OnePlus 11R, OnePlus Nord CE 4 ఫోన్లపై ఆకట్టుకునే డీల్స్‌ని వన్‌ప్లస్ తీసుకొచ్చింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ఈ ఫోన్లపై డిస్కౌంట్ లభించనుంది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 11R, Nord CE 4 ఆఫర్లు

OnePlus 11R డివైజ్ 2023 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ రూ.39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం విక్రయ ధర రూ.35,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ రూ.29,999 కే లభించనుంది. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.5,000 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 4 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లాంచ్ ధర రూ.24,999 గా ఉంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని, ఈ ఫోన్‌ని రూ.22,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, 6 నెలల కాలపరిమితి మరియు నెలకు రూ.3,833 కనీస చెల్లింపుతో నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

OnePlus Nord CE 4 స్పెసిఫికేషన్స్

OnePlus Nord CE 4 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఆక్సిజన్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ ఉన్నాయి.

OnePlus Nord CE 4 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆక్వాటచ్ టెక్నాలజీ ఉన్నాయి.

The post OnePlus 11R, Nord CE 4 లపై డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో మొదలైన OnePlus 11R తయారీ (లీకైన సమాచారం) https://www.91mobiles.com/telugu/oneplus-11r-production-began-india-leaked-specs/ Mon, 16 Jan 2023 05:30:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=4463 హైలైట్స్ ఏప్రిల్ లేదా మే నెలలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11R భారత్ లో ప్రారంభమైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి ఇప్పటికే లీకైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ లేదా మే నెలలో లాంచ్ కానుంది. ఇప్పటికే దేశంలో ఈ ఫోన్ యొక్క తయారీ మొదలైంది. ఈ విషయం ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా 91మొబైల్స్ […]

The post భారత్‌లో మొదలైన OnePlus 11R తయారీ (లీకైన సమాచారం) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఏప్రిల్ లేదా మే నెలలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus 11R
  • భారత్ లో ప్రారంభమైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి
  • ఇప్పటికే లీకైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్

OnePlus 11R స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ లేదా మే నెలలో లాంచ్ కానుంది. ఇప్పటికే దేశంలో ఈ ఫోన్ యొక్క తయారీ మొదలైంది. ఈ విషయం ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా 91మొబైల్స్ తెలుసుకుంది. ఫిబ్రవరి లో గ్లోబల్ గా లాంచ్ కాబోయే OnePlus 11 తర్వాత వస్తోన్న రెండో ఫోన్ గా OnePlus 11R మార్కెట్ లోకి రానుంది. OnePlus 10R మాదిరిగా OnePlus 11R కూడా కాస్త డౌన్‌గ్రేడ్ స్పెసిఫికేషన్స్ తో రానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో OnePlus 11R యొక్క పేరుని మేం గుర్తించాం. దీంతో భారత్ లో OnePlus 11R లాంచ్ పై స్పష్టత వచ్చినట్లైంది.

OnePlus 11R ఇండియా లాంచ్ టైమ్‌లైన్

భారత్ లో OnePlus 11R తయారీ మొదలైంది. టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, వన్ ప్లస్ సంస్థ ఏప్రిల్ లేదా మే నెలలో OnePlus 11R ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. కొన్ని వారాల్లో OnePlus 11R యొక్క లాంచ్ పై పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ ఫోకస్ OnePlus 11 ఫోన్ ని భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేయడంపై ఉంది.

OnePlus కంపెనీ అధికార వెబ్ సైట్ పై కనిపించిన OnePlus 11R పేరు

వన్‌ప్లస్ ఇండియా అధికార వెబ్‌సైట్ లో OnePlus 11R పేరు కనిపించింది. దీంతో భారత్ లో ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని స్పష్టమైంది. ఈ పేరు తప్పితే మరే ఇతర విషయం కూడా బయటకు రాలేదు. అయితే ఇప్పటికే OnePlus 11R యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. దీంతో ఇంకా ఊహించడానికి ఏమీ మిగలలేదు. సరే, ఓసారి OnePlus 11R యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OnePlus 11R స్పెసిఫికేషన్స్ (రూమర్డ్)

కొన్ని వారాల క్రితం, Pricebaba వెబ్‌సైట్ OnePlus 11R యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఫోన్ లోని అబౌట్ సెక్షన్ ఇమేజెస్ ఆధారంగా ఈ వివరాలను ప్రైస్ బాబా బయటపెట్టింది. OnePlus 11R ఫోన్ సీపీహెచ్2487 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 అండర్‌క్లాక్డ్ వర్షన్ (3.2గిగాహెర్ట్జ్ బదులుగా 3గిగాహెర్ట్జ్) తో రానుంది.

OnePlus 11R స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని కలిగి ఉంటుంది. 8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

ఇప్పుడు OnePlus 11R యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో OnePlus 11R వస్తున్నట్లు తెలుస్తోంది.

OnePlus 11R యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో అలర్ట్ స్లైడర్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. లీకైన లైవ్ ఇమేజెస్ ని బట్టి, ఫోన్ లో అలర్ట్ స్లైడర్, సెంటర్డ్ పంచ్ హోల్ డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయని స్పష్టమైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో మొదలైన OnePlus 11R తయారీ (లీకైన సమాచారం) first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-2-aka-oneplus-11r-specs-leaked/ Mon, 09 Jan 2023 14:57:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4400 హైలైట్స్ CMMIIT సర్టిఫికేషన్ పొందిన OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ భారత్ లో OnePlus 11R గా లాంచ్ కానున్న OnePlus Ace 2 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా వన్‌ప్లస్ 11 ఫోన్ చైనాలో లాంచైంది. ఫిబ్రవరి 7 న ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఇకపోతే కంపెనీ నుంచి త్వరలోనే OnePlus Ace 2 లాంచ్ కి సంబంధించిన […]

The post లీకైన OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • CMMIIT సర్టిఫికేషన్ పొందిన OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్
  • భారత్ లో OnePlus 11R గా లాంచ్ కానున్న OnePlus Ace 2
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus Ace 2 స్మార్ట్ ఫోన్

రీసెంట్ గా వన్‌ప్లస్ 11 ఫోన్ చైనాలో లాంచైంది. ఫిబ్రవరి 7 న ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. ఇకపోతే కంపెనీ నుంచి త్వరలోనే OnePlus Ace 2 లాంచ్ కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Ace 2, OnePlus 11R పేరుతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అలాగే వన్ ప్లస్ 11ఆర్ తో పాటు వన్ ప్లస్ యొక్క తొలి ట్యాబ్లెట్ OnePlus Pad కూడా లాంచ్ కానుందని సమాచారం.

తాజాగా OnePlus Ace 2 (OnePlus 11R) యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇటీవలె ఈ ఫోన్ చైనీస్ CMIIT సర్టిఫికేషన్ ని పొందింది. OnePlus Ace 2 (OnePlus 11R) యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్

సీఎంఐఐటీ సర్టిఫికేషన్ రిపోర్ట్ ప్రకారం, OnePlus Ace 2 (OnePlus 11R) డివైజ్ PHK110 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ త్వరలోనే చైనాలో లాంచ్ కానుంది. రిపోర్ట్ ని బట్టి, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. గత మోడల్ అయిన వన్‌ప్లస్ ఏస్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. అంటే కొత్త మోడల్ ఫాస్ట్ చార్జింగ్ విషయంలో డౌన్‌గ్రేడ్ అయ్యిందని చెప్పాలి.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ ఫోన్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ వచ్చింది.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇండియన్ వేరియంట్ ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2772*1240 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

OnePlus Ace 2 (OnePlus 11R) స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సోని ఐఎంఎక్స్890 లేదా సోని ఐఎంఎక్స్766 సెన్సర్స్ ని ఇందులో వాడే అవకాశం ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OnePlus Ace 2 (OnePlus 11R) ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్, స్టీరియో స్పీకర్స్, బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Ace 2 (OnePlus 11R) స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OnePlus 11R ఫస్ట్ లుక్ https://www.91mobiles.com/telugu/oneplus-11r-first-look-leaked-before-launch/ Fri, 30 Dec 2022 14:42:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4264 హైలైట్స్ నెట్టింట్లో ప్రత్యక్షమైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ లైవ్ ఇమేజెస్ OPPO Reno 9 Pro+ ని పోలి ఉన్న OnePlus 11R స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus 11R 2023 మొదటి త్రైమాసికంలో OnePlus 11R లాంచ్ అయ్యే అవకాశం OnePlus 11R యొక్క రీసెంట్ లీక్స్ ద్వారా ఈ ఫోన్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు స్పష్టమైంది. […]

The post లాంచ్ కి ముందు లీకైన OnePlus 11R ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన OnePlus 11R స్మార్ట్ ఫోన్ లైవ్ ఇమేజెస్
  • OPPO Reno 9 Pro+ ని పోలి ఉన్న OnePlus 11R స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న OnePlus 11R
  • 2023 మొదటి త్రైమాసికంలో OnePlus 11R లాంచ్ అయ్యే అవకాశం

OnePlus 11R యొక్క రీసెంట్ లీక్స్ ద్వారా ఈ ఫోన్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఫోన్ వన్ ప్లస్ 10టీ కి సక్సెసర్ గా వస్తుందని చెబుతున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సౌజన్యంతో GadgetGang తాజాగా OnePlus 11R యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది. చూస్తుంటే OnePlus 11R ఫోన్ ఒప్పో రెనో 9 ప్రో+ ని పోలి ఉన్నట్లు అనిపిస్తోంది. రియర్ కెమెరా లే ఔట్ చూస్తే అచ్చంగా రెనో 9 ప్రో+ మాదిరి ఉంది.

OnePlus 11R కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్నట్లు సమాచారం. ఆర్-లైనప్ లో కర్వ్డ్ డిస్ప్లే అంటే ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

OnePlus 11R డిజైన్ (లీక్డ్)

OnePlus 11R స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. న్యారో బెజెల్స్ అన్ని కార్నర్స్ లో ఉన్నాయి. ఫోన్ వెనకాల చూస్తే, స్క్వేర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే వన్ ప్లస్ లోగో ని కూడా మనం బ్యాక్ ప్యానెల్ పై గమనించవచ్చు.

OnePlus 11R లో ఐఆర్ బ్లాస్టర్, మైక్రోఫోన్ తో వస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ ట్రే సెక్షన్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి. పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. ఇక వాల్యూమ్ రాకర్ ఎడమ వైపున ఉంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OnePlus 11R లో 1.5 కే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, హై-పీడబ్ల్యూఎం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

OnePlus 11R యొక్క కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లేదా డెప్త్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ కూడా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన OnePlus 11R ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్, 100W చార్జింగ్ తో వస్తున్న OnePlus 11R https://www.91mobiles.com/telugu/oneplus-11r-specs-leaked-before-launch/ Thu, 29 Sep 2022 17:02:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2662 హైలైట్స్: 2023 లో OnePlus 11 తో పాటు లాంచ్ కానున్న OnePlus 11R స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తున్న OnePlus 11, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న OnePlus 11R 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి రియర్ కెమెరా OnePlus 11R ప్రధాన ఫీచర్లు వన్ ప్లస్ 11 సిరీస్ లో పలు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని ఇదివరకే 91మొబైల్స్ చెప్పడం జరిగింది. తాజాగా […]

The post Snapdragon 8+ Gen 1 చిప్, 100W చార్జింగ్ తో వస్తున్న OnePlus 11R first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2023 లో OnePlus 11 తో పాటు లాంచ్ కానున్న OnePlus 11R
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తున్న OnePlus 11, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న OnePlus 11R
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి రియర్ కెమెరా OnePlus 11R ప్రధాన ఫీచర్లు

వన్ ప్లస్ 11 సిరీస్ లో పలు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయని ఇదివరకే 91మొబైల్స్ చెప్పడం జరిగింది. తాజాగా మైస్మార్ట్‌ప్రైస్, టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ తో సౌజన్యంతో OnePlus 11 సిరీస్ లైనప్ ను బయటపెట్టింది. ఈ లైనప్ లో OnePlus 11, OnePlus 11 Pro తో పాటు OnePlus 11R కూడా లాంచ్ అవుతుందని రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

రిపోర్ట్ ప్రకారం, OnePlus 11R క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఆర్-సిరీస్ విషయానికి వస్తే, మిగతా మోడల్స్ తో పోల్చితే, ఇది కాస్త తక్కువ ధరను కలిగి ఉంటుంది. అలాగే ఫ్లాగ్షిప్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇకపోతే OnePlus 11 ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ అయిన 8 జెన్ 2 ని క్వాల్కమ్ కంపెనీ ఈ ఏడాది నవంబర్ నెలలో జరిగే ఈవెంట్ లో లాంచ్ చేయనుంది.

OnePlus 11R ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని చూస్తే, ఈ ఫోన్ 8జిబి , 16జిబి ర్యామ్, 128జిబి, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానుందని సమాచారం. ఇప్పుడు డిస్ప్లే గురించి తెలుసుకుందాం. OnePlus 11R లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ డిస్ప్లే ఉండనుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ప్రీమియమ్ ఫోన్లలో కూడా ఇటువంటి డిస్ప్లే ఫీచర్లనే ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం.

ఇప్పుడు OnePlus 11R కెమెరా విభాగం ఎలా ఉంటుందో చూద్దాం. OnePlus 11R లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అందించనున్నారు. ఇక పవర్ విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ప్రస్తుతానికి OnePlus 11R కి సంబంధించిన లాంచ్ తేదీ, ధర ఏమీ తెలియదు. మార్కెట్ లో ఇప్పటికే లాంచ్ అయిన OnePlus 10R ధర రూ.32,999 గా ఉంది. మరి OnePlus 11R ధర కూడా ఇదే స్థాయిలో ఉంటుందో లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందో చూడాలి.

OPPO తో కలిసాక OnePlus ఫోన్ల కెమెరా స్పెసిఫికేషన్స్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఏళ్ళు గడుస్తున్నా ఇంకా 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలను ఈ కంపెనీ వదలడం లేదు. మరోవైపు ఫోన్ల ధరలేమో రూ.30 వేలు, రూ.40 వేలకు పైన ఉంటున్నా, ఈ 8ఎంపి వైడ్ యాంగిల్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ లు మాత్రం మారడం లేదు. వాటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు. వీటి స్థానంలో 12ఎంపి/13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో లెన్స్ ఇస్తే బాగుంటుంది.

లేదంటే, మోటోరోలా/ఐకూ మాదిరిగా వైడ్ యాంగిల్ కెమెరాలోనే మ్యాక్రో ఆప్షన్ ఇస్తే బెటర్. దాని వల్లన ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతేగానీ, పనికిరాని కెమెరాలను ఎన్ని ఇచ్చి ఏం లాభం? ఉపయోగపడే కెమెరాలు రెండుంటే చాలదా? ఫోన్లకు డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నప్పుడు, మూడు మంచి రెజుల్యూషన్, ఓఐఎస్ కలిగిన కెమెరాలను ఇవ్వవచ్చు. కానీ లాభాలు ఎక్కువ ఆర్జించాలనే లక్ష్యంతో వాల్యూ ఫర్ మనీ ఫోన్లను కంపెనీలు తీసుకు రావడం లేదు. యూజర్ల నుంచి గట్టి వ్యతిరేకత వస్తే గానీ, కంపెనీల తీరు మారదని అర్థమవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 8+ Gen 1 చిప్, 100W చార్జింగ్ తో వస్తున్న OnePlus 11R first appeared on 91Mobiles Telugu.

]]>