OnePlus Ace Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Jul 2022 08:21:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-pro-first-look-revealed/ Tue, 26 Jul 2022 08:21:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=1244 హైలైట్స్: ఆగస్టు 3 న చైనాలో లాంచ్ అవుతోన్న వన్ ప్లస్ ఏస్ ప్రో భారత్ లో వన్ ప్లస్ 10టీ 5జీ గా లాంచ్ అవుతోన్న అదే ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న తొలి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏస్ ప్రో/10టీ 5జీ త్వరలో ఏస్ సిరీస్ ఫోన్ రాబోతున్నట్లు వన్ ప్లస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇది వరకే ఏస్ ప్రో/10టీ కి సంబంధించిన […]

The post OnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 3 న చైనాలో లాంచ్ అవుతోన్న వన్ ప్లస్ ఏస్ ప్రో
  • భారత్ లో వన్ ప్లస్ 10టీ 5జీ గా లాంచ్ అవుతోన్న అదే ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న తొలి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏస్ ప్రో/10టీ 5జీ

త్వరలో ఏస్ సిరీస్ ఫోన్ రాబోతున్నట్లు వన్ ప్లస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇది వరకే ఏస్ ప్రో/10టీ కి సంబంధించిన పలు రూమర్లు, లీక్స్ బయటకు వచ్చాయి. ఇక వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్ ని రీబ్రాండ్ చేసి వన్ ప్లస్ ఏస్ ప్రో గా చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఏస్ ప్రో చైనాలో ఆగస్టు 3 న లాంచ్ అవుతోంది. ఇక గ్లోబల్ బయ్యర్లు ఈ ఫోన్ కోసం వేచి చూడాల్సి అవసరం లేదు. ఎందుకంటే అదే రోజున వన్ ప్లస్ 10టీ 5జీ కూడా లాంచ్ అవుతోంది. ఇటీవలె వన్ ప్లస్ ఏస్ ప్రో ఫోన్ ఫస్ట్ లుక్ ని కంపెనీ బయటకు వదిలింది. దీంతో వన్ ప్లస్ ఏస్ ప్రో యొక్క పలు కీలక ఫీచర్లు కన్ఫర్మ్ అయ్యాయి.

OnePlus Ace Pro ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ

 

పైన పిక్స్ లో చూస్తున్న విధంగా వన్ ప్లస్ ఏస్ ప్రో ఉండనుంది. వన్ ప్లస్ 10 ప్రో డిజైన్ లాగానే ఈ డివైజ్ కూడా కనిపిస్తోంది. ఫోన్ వెనకాల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. ఈసారి హాజెల్ బ్లడ్ అని మెన్షన్ చేయలేదు. నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. పవర్ బటన్ డివైజ్ కి కుడివైపున ఉంది. ఇక వాల్యూమ్ రాకర్స్ ఎడమ వైపున ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, వన్ ప్లస్ ఏస్ ప్రో లో ఐకానిక్ అలర్ట్ స్లైడర్ లేదు.

ద వర్జ్ కథనం ప్రకారం, హై వాటేజ్ ఛార్జింగ్ కొరకు భారీ బ్యాటరీని సర్దుబాటు చేయడం, మెరుగైన యాంటినా సిగ్నల్ అందించేందుకు గాను అలర్ట్ స్లైడర్ ను వన్ ప్లస్ తొలగించినట్లు సమాచారం. అలాగే అలర్ట్ స్లైడర్ ను ఉంచడం వల్లన, ఫోన్ బరువు, వెడల్పు కూడా పెరిగే అవకాశముందని ద వర్జ్ పేర్కొంది. అన్ని యాంగిల్స్ లోనూ ఉత్తమమైన సిగ్నల్ ను అందించేందుకు గాను, వన్ ప్లస్ ఏస్ ప్రో లో మొత్తం 15 సెపరేట్ యాంటినాలను అమర్చడం విశేషం. అందుబాటు ధరలో పెర్ఫామెన్స్ బేస్డ్ ఫోన్ అందించాలనే ఉద్దేశ్యంతో హాజెల్ బ్లడ్ బ్రాండింగ్ కూడా ఇవ్వడం లేదని, వన్ ప్లస్ చీఫ్ డిజైనర్ హోప్ లియూ చెప్పారు. ఇక వన్ ప్లస్ 10టీ (ఏస్ ప్రో) యొక్క కెమెరా వివరాలను కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది.

ఇక ఫోన్ ముందు వైపు చూస్తే, వన్ ప్లస్ ఏస్ ప్రో లో ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ పంచ్ హోల్ ఉంది. మరో విషయం ఏంటంటే, వన్ ప్లస్ ఏస్ ప్రో లో 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ని కూడా తొలగించారు.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

వన్ ప్లస్ ఏస్ ప్రో లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro https://www.91mobiles.com/telugu/oneplus-ace-pro-launch-tipped-specs-out/ Fri, 22 Jul 2022 12:40:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=1175 హైలైట్స్: వన్ ప్లస్ 10టీ కి వన్ ప్లస్ ఏస్ ప్రో ట్వీక్డ్ వర్షన్ అని అంచనా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు వన్ ప్లస్ 10టీ లాంచ్ కానున్న సమయానికే వన్ ప్లస్ ఏస్ ప్రో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వరుసబెట్టి స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న వన్ ప్లస్ కంపెనీ, ఈ ఏడాది బిజీగా మారిపోయింది. […]

The post త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • వన్ ప్లస్ 10టీ కి వన్ ప్లస్ ఏస్ ప్రో ట్వీక్డ్ వర్షన్ అని అంచనా
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • వన్ ప్లస్ 10టీ లాంచ్ కానున్న సమయానికే వన్ ప్లస్ ఏస్ ప్రో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్

వరుసబెట్టి స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న వన్ ప్లస్ కంపెనీ, ఈ ఏడాది బిజీగా మారిపోయింది. వన్ ప్లస్ లాంచ్ చేసిన ఫోన్స్ లో మిడ్-రేంజ్, ఫ్లాగ్ షిప్స్, నార్డ్ సిరీస్ ఫోన్స్ ఉన్నాయి. ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న వన్ ప్లస్ తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే, ఈ ఫ్లాగ్ షిప్ కేవలం ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్స్ కే పరిమితం కానుందని సమాచారం. చైనాలో మాత్రం వన్ ప్లస్ ఏస్ ప్రో అనే పేరుతో ట్వీక్డ్ వర్షన్ లాంచ్ అవుతుందని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది.

టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల గురించి తెలిపింది. వన్ ప్లస్ ఏస్ మోడల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16జిబి ర్యామ్ ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఇవి తప్ప మరే ఇతర స్పెసిఫికేషన్స్ ను డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించలేదు.

OnePlus Ace Pro ధర (అంచనా)

వన్ ప్లస్ ఏస్ ప్రో ధర ఆర్ఎంబి 3,000 (దాదాపు రూ.35,500) నుంచి ఆర్ఎంబి 4000 (దాదాపు రూ.47,500) మధ్య ఉంటుందని సమాచారం.

OnePlus Ace Pro స్పెసిఫికేషన్స్

  • 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1
  • 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో 2.0 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, ఆర్జీబీ, డిస్ప్లే పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 2*2 ఎంఐఎంఐ, వై-ఫై 802.11ఏ/బి/జి/ఎన్/ఏసి/ఏఎక్స్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఎస్బీసీ & ఏపీటీ హెచ్డీ & ఎల్డీఏసీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లున్నాయి.

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా ఉండే అవకాశముంది. గ్లోబల్ వేరియంట్స్ లో కెమెరా స్పెసిఫికేషన్స్ మారే అవకాశముంది.

The post త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro first appeared on 91Mobiles Telugu.

]]>