OnePlus Nord CE 3 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 21 Sep 2024 11:32:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord CE 3 5G పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-gets-discount-rs-9000-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-gets-discount-rs-9000-know-full-details/#respond Sat, 21 Sep 2024 11:32:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13667 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది లాంచ్ చేసిన Nord CE 3 5G ధరను ప్రస్తుతం తగ్గించింది. రూ.9,000 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభించనుంది. అంతే కాదు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. OnePlus Nord CE 3 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు […]

The post OnePlus Nord CE 3 5G పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord CE 3 5G పై డిస్కౌంట్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది లాంచ్ చేసిన Nord CE 3 5G ధరను ప్రస్తుతం తగ్గించింది. రూ.9,000 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్‌ని సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభించనుంది. అంతే కాదు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. OnePlus Nord CE 3 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord CE 3 5G ధర, ఆఫర్లు

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.9,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ని కేవలం రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకి మీకు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.26,999 గా ఉంది.

అంతేకాదు, ఫుల్ పేమెంట్ చేసి ఫోన్ కొనేవారికి అదనంగా రూ.1,250 డిస్కౌంట్‌ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.16,749 లేదా రూ.16,499 కి తగ్గనుంది. అయితే, మీరు ఎంచుకునే పేమెంట్ విధానాన్ని బట్టి ఈ ధర మారుతుంది.

పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.17,050 వరకు బోనస్ పొందవచ్చు. అయితే మీ ఫోన్ కండీషన్ పై ఈ విలువ మొత్తం నిర్ణయించబడుతుంది.

కలర్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

అమెజాన్ ఆఫర్ లింక్

OnePlus Nord CE 3 5G ని కొనవచ్చా?

OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ డివైజ్. ఈ ఫోన్ డిఫరెంట్ డిజైన్, మంచి పెర్ఫామెన్స్, కెమెరా సిస్టమ్ ను ఆఫర్ చేస్తుంది. గతేడాది జులై నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. రూ.17,000 లోపు ధరలో లభిస్తోన్న ఈ ఫోన్‌ని కచ్చితంగా మీరు కన్సిడర్ చేయవచ్చు.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post OnePlus Nord CE 3 5G పై రూ.9,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-gets-discount-rs-9000-know-full-details/feed/ 0
Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-nord-ce-3-nord-ce-3-lite-offers-amazon-great-indian-festival-sale-2023/ Mon, 09 Oct 2023 14:47:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=8312 ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. వివిధ రకాల ఉత్పత్తులపై సేల్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొబైల్ శ్రేణిలోని పలు డివైజెస్ పై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం వన్‌ప్లస్ సంస్థ తన నార్డ్ ఫోన్లపై అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus […]

The post Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • వన్‌ప్లస్ నార్డ్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
  • అక్టోబర్ 15 వరకు పలు ఉత్పత్తులపై ఆఫర్స్

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. వివిధ రకాల ఉత్పత్తులపై సేల్ లో ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొబైల్ శ్రేణిలోని పలు డివైజెస్ పై ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం వన్‌ప్లస్ సంస్థ తన నార్డ్ ఫోన్లపై అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై చక్కటి డిస్కౌంట్ లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 3 ఆఫర్స్

OnePlus Nord 3 డివైజ్ ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంతేకాదు, ఇంకా రూ.2,000 స్పెషల్ కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇకపోతే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ ని కొంటే 10 శాతం (రూ.1,000 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Nord CE 3 ఆఫర్స్

OnePlus Nord CE 3 డివైజ్ ని కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, రూ.2,000 స్పెషల్ ప్రైస్ కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దీంతో రూ.26,998 ధర ఉన్న Nord CE 3 8జిబి+128జిబి వేరియంట్ ని రూ.22,748 కే సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE 3 Lite ఆఫర్స్

OnePlus Nord CE 3 Lite ఫోన్ కొనుగోలు పై రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ఫోన్ కొంటే గనుక రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో రూ.21,998 ధర ఉన్న OnePlus Nord CE 3 Lite 8జిబి+256జిబి మోడల్ ని రూ.19,748 కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్బీఐ డెబిట్ కార్డ్ నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా OnePlus Nord CE 3 Lite ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది.

The post Amazon Great Indian Festival Sale: OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
16GB ర్యామ్, 50MP కెమెరా, 80W చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-oneplus-nord-ce-3-5g-launched-india-price-specs-availability/ Wed, 05 Jul 2023 16:29:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7086 OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్లు బుధవారం నాడు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ నార్డ్ ఫోన్ల రాకతో వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా OnePlus Nord 3 5G మార్కెట్ లోకి వచ్చింది. నార్డ్ సీఈ 3 లైట్ కి అప్‌గ్రేడ్ గా OnePlus Nord […]

The post 16GB ర్యామ్, 50MP కెమెరా, 80W చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord 3 5G, Nord CE 3 5G ప్రారంభ ధర రూ.26,999
  • డైమెన్సిటీ 9000 చిప్, 120Hz సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన నార్డ్ 3
  • స్నాప్ డ్రాగన్ 782జి చిప్, 80 వాట్ చార్జింగ్ తో వచ్చిన నార్డ్ సీఈ 3

OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్లు బుధవారం నాడు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ నార్డ్ ఫోన్ల రాకతో వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా OnePlus Nord 3 5G మార్కెట్ లోకి వచ్చింది. నార్డ్ సీఈ 3 లైట్ కి అప్‌గ్రేడ్ గా OnePlus Nord CE 3 5G ఎంట్రీ ఇచ్చింది. రెండు ఫోన్లు కూడా త్వరలోనే భారత్ లో సేల్ కి రానున్నాయి. సరే, ఓసారి OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G డివైజెస్ ధరలు, లభ్యత, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

భారత్ లో OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G ధరలు

  • భారత్ లో OnePlus Nord 3 5G 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.33,999 తో మొదలవుతుంది.
  • 16జిబి ర్యామ్ తో వస్తోన్న మొదటి నార్డ్-బ్రాండెడ్ ఫోన్ OnePlus Nord 3 5G. ఈ ఫోన్ 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999.
  • జులై 15 నుంచి OnePlus Nord 3 5G సేల్ మొదలవుతుంది. ఓపెన్ సేల్ లో భాగంగా రూ.2,799 విలువగల OnePlus Nord Buds ని సొంతం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎంపిక చేయబడిన క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కి కూడా వర్తిస్తుంది. అదనంగా రూ.4500 విలువగల జియో ఆఫర్ లభిస్తుంది. ఇంకా 6 నెలల కాలపరిమితితో యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్, 6 నెలల పాటు 100జిబి క్లౌండ్ స్టోరేజీ ప్రయోజనం లభిస్తుంది.
  • OnePlus Nord CE 3 డివైజ్ 8జిబి + 128జిబి స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. 12జిబి + 256జిబి స్టోరేజీ ధర రూ.28,999 గా ఉంది.
  • OnePlus Nord CE 3 సేల్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. కచ్చితమైన తేదీ ఇంకా తెలియాల్సి ఉంది.

OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1440 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, మాలి-జీ710 10-కోర్ జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord 3 5G లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus Nord 3 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ సోని ఐఎంఎక్స్355 సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.
  • కలర్స్: OnePlus Nord 3 5G డివైజ్ మిస్టీ గ్రీన్ మరియు టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 కలర్ గేముత్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • కలర్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post 16GB ర్యామ్, 50MP కెమెరా, 80W చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన OnePlus Nord 3 5G, OnePlus Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
50MP Sony IMX890 ప్రైమరీ కెమెరాతో వస్తోన్న OnePlus Nord CE 3 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-main-camera-50mp-sony-imx-890-lens/ Mon, 03 Jul 2023 13:25:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=7039 OnePlus జూలై 5న భారతదేశంలో OnePlus Nord 3 5G, Nord CE 3 5G, మరియు OnePlus Nord Buds 2r లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు, కంపెనీ ఈ రాబోయే ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని వివరాలను కన్ఫర్మ్ చేసింది. ఇటీవలే, రాబోయే OnePlus Nord 3 5G 50MP సోనీ IMX890 కెమెరాను కలిగి ఉంటుందని బ్రాండ్ వెల్లడించింది. ఇప్పుడు, ఇటీవలి అభివృద్ధిలో, OnePlus Nord CE 3 […]

The post 50MP Sony IMX890 ప్రైమరీ కెమెరాతో వస్తోన్న OnePlus Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న OnePlus Nord CE 3 5G
  • కన్ఫర్మ్ అయిన మెయిన్ కెమెరా స్పెసిఫికేషన్స్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

OnePlus జూలై 5న భారతదేశంలో OnePlus Nord 3 5G, Nord CE 3 5G, మరియు OnePlus Nord Buds 2r లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు, కంపెనీ ఈ రాబోయే ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని వివరాలను కన్ఫర్మ్ చేసింది. ఇటీవలే, రాబోయే OnePlus Nord 3 5G 50MP సోనీ IMX890 కెమెరాను కలిగి ఉంటుందని బ్రాండ్ వెల్లడించింది. ఇప్పుడు, ఇటీవలి అభివృద్ధిలో, OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రాధమిక కెమెరా వివరాలను OnePlus ధృవీకరించింది.

ఖరారైన OnePlus Nord CE 3 5G ప్రైమరీ కెమెరా వివరాలు

కొత్తగా వెల్లడించిన టీజర్ రాబోయే OnePlus Nord CE 3 5G 50MP సోనీ IMX890 కెమెరాను కలిగి ఉంటుందని తెలిసింది. డివైజ్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. OnePlus Nord 3 5G కూడా పైన పేర్కొన్న విధంగా అదే 50MP సోనీ IMX890 సెన్సార్‌ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. OnePlus తన ఫ్లాగ్‌షిప్ OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే సెన్సర్ ని ఉపయోగించింది.

ఇటీవల, OnePlus Nord CE 3 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కూడా వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 782G ప్రాసెసర్‌తో వస్తుందని ధృవీకరించబడింది. ఇంకా, హ్యాండ్‌సెట్‌లో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. డివైజ్ ఆక్వా సర్జ్ (బ్లూ) కలర్ ఆప్షన్‌లో కూడా లభించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

హ్యాండ్‌సెట్ 8GB/12GB RAM కాన్ఫిగరేషన్‌తో పాటు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో లాంచ్ అవుతుందని గత లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌లో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు వెనుక వైపు 2MP మాక్రో సెన్సార్ ఉండవచ్చు. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తోంది.

సంబంధిత వార్తలలో, మునుపటి లీక్ రాబోయే OnePlus స్మార్ట్‌ఫోన్‌ల ధర పరిధిని వెల్లడించింది. OnePlus Nord CE 3 ధర రూ. 25,000 నుండి రూ. 28,000 వరకు ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. అయితే OnePlus Nord 3 5G ధర రూ. 32,000 నుండి రూ. 37,000 మధ్య అందుబాటులో ఉంటుందని సమాచారం.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Nord CE 3 5G లో 6.72-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Nord CE 3 5G లో స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: OnePlus Nord CE 3 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G లో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord CE 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Nord CE 3 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్లు ఉంటాయి.

The post 50MP Sony IMX890 ప్రైమరీ కెమెరాతో వస్తోన్న OnePlus Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 5 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Nord 3 5G, Nord CE 3 5G https://www.91mobiles.com/telugu/oneplus-nord-3-5g-nord-ce-3-5g-launch-date-july-5-key-details/ Mon, 26 Jun 2023 15:34:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=6934 టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న OnePlus తాజాగా భారతీయ అభిమానులకు శుభవార్త చెప్పింది. కంపెనీ అధికారికంగా, Nord 3 5G, Nord CE 3 5G ఫోన్ల లాంచ్ ప్రకటన చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు జులై 5 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లతో పాటు, Nord Buds 2R టీడబ్ల్యూఎస్ కూడా లాంచ్ కానుంది. OnePlus Nord లాంచ్ ఈవెంట్ జులై 5 […]

The post జులై 5 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Nord 3 5G, Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నార్డ్ సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనున్న OnePlus
  • జులై 5 న లాంచ్ కానున్న Nord 3 5G, Nord CE 3 5G
  • ఎంట్రీ ఇవ్వనున్న Nord Buds 2R టీడబ్ల్యూఎస్

టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న OnePlus తాజాగా భారతీయ అభిమానులకు శుభవార్త చెప్పింది. కంపెనీ అధికారికంగా, Nord 3 5G, Nord CE 3 5G ఫోన్ల లాంచ్ ప్రకటన చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు జులై 5 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లతో పాటు, Nord Buds 2R టీడబ్ల్యూఎస్ కూడా లాంచ్ కానుంది.

OnePlus Nord లాంచ్ ఈవెంట్

జులై 5 వ తేదీన వన్‌ప్లస్ కంపెనీ ఒక పెద్ద గ్లోబల్ ఈవెంట్ ని నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్ పేరుని OnePlus Nord Summer Launch గా నిర్ణయించారు. గ్లోబల్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు భారత్ లో ప్రారంభమవుతుంది. కంపెనీ అధికార వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై గ్లోబల్ ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇదే ఈవెంట్ లో OnePlus Nord Buds 2R కూడా లాంచ్ కానున్నాయి.

భారత్ లో OnePlus Nord 3 ధర (లీక్)

లేటెస్ట్ లీక్ ప్రకారం, OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంటుందని సమాచారం. ఇకపోతే 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్లు ఇతర స్కీమ్స్ తో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

చిప్సెట్, ఓఎస్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంటుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

వేరియంట్స్: OnePlus Nord 3 5G డివైజ్ లో రెండు ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్ మోడల్స్ ఉంటాయి. 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.

బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 ప్రాసెసర్ వాడనున్నారని లీక్స్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 16జిబి వరకు ర్యామ్-వీటా, (వర్చువల్ ర్యామ్), హైపర్ టచ్, హైపర్ బూస్ట్ ఉంటాయి.
  • డిస్ప్లే: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 950 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
  • కెమెరా: OnePlus Nord CE 3 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 చిప్సెట్ ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, ఎన్ఎఫ్‌సీ, అలర్ట్ స్లైడర్ ఉంటాయి.
  • ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
  • కలర్ ఆప్షన్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post జులై 5 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OnePlus Nord 3 5G, Nord CE 3 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-specs-leaked-before-launch-3/ Wed, 21 Jun 2023 10:14:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=6875 OnePlus భారతదేశంలో Nord 3 5G లాంచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ డివైజ్ భారతదేశంలోని నార్డ్ సిరీస్‌లో కంపెనీ యొక్క అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అవుతుంది. OnePlus ఈ ఏడాది చివర్లో Nord సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త లీక్ ప్రకారం, OnePlus సంస్థ Nord CE 3 5G ఇండియా లాంచ్ దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. OnePlus తన కొత్త కోర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి వివరాలను […]

The post లీకైన OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 5G
  • తాజాగా లీకైన OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్

OnePlus భారతదేశంలో Nord 3 5G లాంచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ డివైజ్ భారతదేశంలోని నార్డ్ సిరీస్‌లో కంపెనీ యొక్క అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అవుతుంది. OnePlus ఈ ఏడాది చివర్లో Nord సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త లీక్ ప్రకారం, OnePlus సంస్థ Nord CE 3 5G ఇండియా లాంచ్ దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. OnePlus తన కొత్త కోర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి వివరాలను ధృవీకరించలేదు. అయితే, టిప్‌స్టర్ ముకుల్ శర్మ (స్టఫ్‌లిస్టింగ్స్), నార్డ్ CE 3 యొక్క స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు.

Nord CE 3 5Gకి Ziti అనే కోడ్ నేమ్ పెట్టబడిందని శర్మ పేర్కొన్నారు. ఫ్లాగ్‌షిప్ OnePlus 11 5Gలో కనిపించే అదే ప్రైమరీ కెమెరాను ఫోన్‌లో కలిగి ఉంటుందని టిప్‌స్టర్ వెల్లడించారు. OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఇతర వివరాలను చూద్దాం.

OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 ప్రాసెసర్ వాడనున్నారని లీక్స్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 3 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 16జిబి వరకు ర్యామ్-వీటా, (వర్చువల్ ర్యామ్), హైపర్ టచ్, హైపర్ బూస్ట్ ఉంటాయి.
  • డిస్ప్లే: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 950 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
  • కెమెరా: OnePlus Nord CE 3 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 చిప్సెట్ ఉంటుంది. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.
  • కనెక్టివిటీ: OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, ఎన్ఎఫ్‌సీ, అలర్ట్ స్లైడర్ ఉంటాయి.
  • ఓఎస్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
  • కలర్ ఆప్షన్స్: OnePlus Nord CE 3 5G డివైజ్ ఆక్వా సర్జ్ మరియు గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post లీకైన OnePlus Nord CE 3 5G స్పెసిఫికేషన్స్; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ (అంచనా) https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-timeline-specs-leaked-before-launch/ Fri, 03 Mar 2023 07:47:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=5204 OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ ని MySmartPrice వెబ్ సైట్, లీక్‌స్టర్ OnLeaks సౌజన్యంతో షేర్ చేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో OnePlus Nord CE 3 హ్యాండ్సెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆసక్తికరంగా, గతంలో లీకైన OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ గా లీకైన స్పెసిఫికేషన్స్ కి భిన్నంగా ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 80 […]

The post లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord CE 3 డివైజ్ జులై మాసంలో లాంచ్ అవుతుందని అంచనా
  • గతేడాది వచ్చిన OnePlus Nord CE 2 కి సక్సెసర్ గా వచ్చిన OnePlus Nord CE 3
  • FHD+ AMOLED డిస్ప్లే, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ OnePlus Nord CE 3 లో ఉంటాయని అంచనా

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్ ని MySmartPrice వెబ్ సైట్, లీక్‌స్టర్ OnLeaks సౌజన్యంతో షేర్ చేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో OnePlus Nord CE 3 హ్యాండ్సెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆసక్తికరంగా, గతంలో లీకైన OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ గా లీకైన స్పెసిఫికేషన్స్ కి భిన్నంగా ఉన్నాయి.

రిపోర్ట్ ప్రకారం, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. ఒకసారి చదవండి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ జులై లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. Nord 3 కూడా ఇదే సమయంలో లాంచ్ అవుతోంది. OnePlus Nord CE 3 హ్యాండ్సెట్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. గతేడాది మార్కెట్ లోకి వచ్చిన OnePlus Nord CE 2 కి సక్సెసర్ గా OnePlus Nord CE 3 వస్తోంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400 x 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. ఇది గతంలో వచ్చిన ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ కి భిన్నంగా ఉంది. ఏదేమైనా ఇదొక మంచి విషయమనే చెప్పాలి. సరే, చిప్సెట్ విషయానికి వస్తే, OnePlus Nord CE 3 లో స్నాప్ డ్రాగన్ 782జి ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.

OnePlus Nord CE 3 కెమెరా విభాగం స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం. OnePlus Nord CE 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని అంచనా. ఇంకా 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్స్ (అంచనా) https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-5g-specs-leaked-before-launch-2/ Wed, 18 Jan 2023 13:49:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=4543 OnePlus సంస్థ ఈ ఏడాది తన ఖాతాను తెరిచింది. చైనాలో OnePlus 11 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అవుతుంది. ఫ్లాగ్షిప్స్ తో పాటు ఈ బ్రాండ్ కొన్ని మిడ్-రేంజ్ ఫోన్లపై కూడా పని చేస్తోంది. OnePlus Nord CE 3 ఇందులో ఒకటి. ఇటీవలి కాలంలో ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా హై-క్వాలిటీ రెండర్స్ ని పబ్లిష్ చేసింది. ఇప్పుడు OnePlus Nord […]

The post లాంచ్ కి ముందు లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OnePlus Nord CE 3
  • 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, 108ఎంపి ప్రైమరీ కెమెరాతో రానున్న OnePlus Nord CE 3

OnePlus సంస్థ ఈ ఏడాది తన ఖాతాను తెరిచింది. చైనాలో OnePlus 11 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అవుతుంది. ఫ్లాగ్షిప్స్ తో పాటు ఈ బ్రాండ్ కొన్ని మిడ్-రేంజ్ ఫోన్లపై కూడా పని చేస్తోంది. OnePlus Nord CE 3 ఇందులో ఒకటి. ఇటీవలి కాలంలో ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా హై-క్వాలిటీ రెండర్స్ ని పబ్లిష్ చేసింది. ఇప్పుడు OnePlus Nord CE 3 ఫోన్ స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్ స్టర్ నుంచి మేం సేకరించాం. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ గతంలో కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు లీకైన వివరాలు వాటితో సరిపోలుతున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 108ఎంపి ప్రైమరీ కెమెరా తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

  • 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 108ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10, హెచ్ఎల్‌జీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5జీ, 4జీ వొల్టీ, డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

గతంలో లీకైన వార్తలను బట్టి, OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని తెలిసింది. అయితే ఈ ఫోన్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోన్న విషయాన్ని గమనించాలి. లాంచ్ తర్వాత యూజర్లు ఈ ఫోన్ ని ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్పెసిఫికేషన్స్ (అంచనా) first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OnePlus Nord CE 3 లైవ్ ఇమేజ్: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-live-image-design-specs/ Thu, 12 Jan 2023 10:48:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=4450 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OnePlus Nord CE 3 తాజాగా లీకైన OnePlus Nord CE 3 లైవ్ ఇమేజెస్; గ్లాసీ బ్లాక్ కలర్ ఆప్షన్ తో లాంచ్ కానున్న డివైజ్ Nord సిరీస్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ సంస్థ సిద్ధమవుతోంది. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా నార్డ్ 3 […]

The post లీకైన OnePlus Nord CE 3 లైవ్ ఇమేజ్: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న OnePlus Nord CE 3
  • తాజాగా లీకైన OnePlus Nord CE 3 లైవ్ ఇమేజెస్; గ్లాసీ బ్లాక్ కలర్ ఆప్షన్ తో లాంచ్ కానున్న డివైజ్

Nord సిరీస్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ సంస్థ సిద్ధమవుతోంది. నార్డ్ 2టీ కి సక్సెసర్ గా నార్డ్ 3 ని తీసుకురానున్నట్లు కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే వన్‌ప్లస్ కంపెనీ OnePlus Nord CE 3 ని కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ సంస్థ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి వివరాలను ఇప్పటివరకు రివీల్ చేయలేదు.

తాజాగా OnePlus Nord CE 3 కి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. కొత్త లీక్ ద్వారా OnePlus Nord CE 3 యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. సరే, ఓసారి OnePlus Nord CE 3 5జీ డివైజ్ స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

లీకైన OnePlus Nord CE 3 డిజైన్

OnePlus Nord CE 3 భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో మిడ్-రేంజ్ ఫోన్ గా లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ లైవ్ ఇమేజ్ ఆన్ లైన్ లో లీకైంది. నార్డ్ సీఈ3 ఫోన్‌ యొక్క ఇమేజ్ గా చెప్పబడుతోన్న ఆ లైవ్ ఇమేజ్ లో రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ రియర్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. RMUpdate షేర్ చేసిన లైవ్ ఇమేజెస్ ని బట్టి, పైన కటౌట్ లో ఒక సెన్సర్, క్రింది కటౌట్ లో రెండు సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉంది.

OnePlus Nord CE 3 ఫ్లాట్ ఫ్రేమ్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక రియర్ ప్యానెల్ చూస్తే కాస్త కర్వ్డ్ గా ఉంది. లైవ్ ఇమేజ్ లో బ్లాక్ కలర్ వేరియంట్ ని మనం చూడవచ్చు. ఇక బ్యాక్ ప్యానెల్ గ్లాసీ టెక్షర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో అల్ట్రావైడ్ సెన్సర్ ఉండబోదు. లీకైన వివరాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.

OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. OnePlus Nord CE 3 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ కూడా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OnePlus Nord CE 3 లైవ్ ఇమేజ్: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Video: 108MP కెమెరా, 12GB ర్యామ్ తో వస్తోన్న OnePlus Nord CE 3 https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-3-design-specs-108-mp-camera-12gb-ram/ Wed, 30 Nov 2022 06:18:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=3760 హైలైట్స్ ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, ఫ్లాట్ సైడ్స్ తో వస్తోన్న OnePlus Nord CE 3 6.7-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా 2023 ప్రథమార్థంలో OnePlus Nord CE 3 లాంచ్ అవుతుందని వినిపిస్తోన్న రూమర్లు OnePlus సంస్థ తన నెక్ట్స్ నార్డ్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దాని పేరు: OnePlus Nord […]

The post Video: 108MP కెమెరా, 12GB ర్యామ్ తో వస్తోన్న OnePlus Nord CE 3 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, ఫ్లాట్ సైడ్స్ తో వస్తోన్న OnePlus Nord CE 3
  • 6.7-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా
  • 2023 ప్రథమార్థంలో OnePlus Nord CE 3 లాంచ్ అవుతుందని వినిపిస్తోన్న రూమర్లు

OnePlus సంస్థ తన నెక్ట్స్ నార్డ్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దాని పేరు: OnePlus Nord CE 3. ఇదివరకు వచ్చిన నార్డ్ సీఈ 2 మోడల్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. డిజైన్ మరియు హార్డ్‌వేర్ పరంగా OnePlus Nord CE 3 పలు మార్పులతో వస్తున్నట్లు తెలుస్తోంది. 91మొబైల్స్ మీకోసం ఎక్స్‌క్లూజివ్ గా OnePlus Nord CE 3 యొక్క హై-క్వాలిటీ రెండర్స్ ని తీసుకొచ్చింది. అందుకు మాకు టిప్‌స్టర్ OnLeaks సహకారం అందించారు. ఫోన్ డిజైన్ OnePlus X, రీసెంట్ iPhones ని ఇన్‌స్పైర్ అయి తీసుకొచ్చినట్లుంది.

OnePlus Nord CE 3 రెండర్స్ ప్రోటోటైప్ యూనిట్ కి సంబందించినవని గమనించాలి. ఈ రెండర్స్ దాదాపు ఫైనల్ ప్రోడక్ట్ మాదిరే ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ గ్లాసీ బ్లాక్ కలర్ తో కనిపిస్తోంది.

OnePlus Nord CE 3 డిజైన్

 

పైన రెండర్స్ లో కనిపిస్తున్నట్లుగా, OnePlus Nord CE 3 కర్వ్డ్ కాకుండా ఫ్లాట్ సైడ్స్ తో వస్తోంది. దీంతో అప్పుడెప్పుడో వచ్చిన వన్‌ప్లస్ ఎక్స్ డివైజ్, ప్రస్తుత ఐఫోన్ మోడల్స్ మాదిరి లుక్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, సెంటర్ పంచ్-హోల్ కటౌట్, సెల్ఫీ కెమెరా మరియు స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. ఇక బాటమ్ లో గమనించదగ్గ చిన్ ఉంది. ఫోన్ కి ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక కుడివైపున ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్ ఉన్నాయి.

ఫోన్ కి వెనకాల రెండు భారీ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. పైన మాడ్యూల్ లో ఒక కెమెరా ఉండగా, క్రింద మాడ్యూల్ లో రెండు లెన్సెస్ ఉన్నాయి. వీటికి తోడు పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇక మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది. ఫోన్ కి పై భాగాన మైక్రోఫోన్, క్రింద భాగాన స్పీకర్ గ్రిల్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్ ఉన్నాయి.

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ ని టిప్‌స్టర్ OnLeaks విడుదల చేసింది. దాని ప్రకారం, OnePlus Nord CE 3 లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి.

OnePlus Nord CE 3 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరాన, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

OnePlus Nord CE 3 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Nord CE 3 లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే 2023 ఆరంభంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Video: 108MP కెమెరా, 12GB ర్యామ్ తో వస్తోన్న OnePlus Nord CE 3 first appeared on 91Mobiles Telugu.

]]>