OPPO A78 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Feb 2024 16:52:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-a79-5g-oppo-a78-5g-price-drop-know-the-full-details/ Mon, 12 Feb 2024 16:52:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10218 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ […]

The post OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెండు ఒప్పో 5జీ ఫోన్ల ధర తగ్గింపు
  • OPPO A79 5G, A78 5G పై డిస్కౌంట్
  • రూ.1,000 మేర తగ్గిన ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A79 5G, OPPO A78 5G ధర తగ్గింపు

  • OPPO A79 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పాత ధర రూ.19,999 గా ఉంది. రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ.18,999 కి చేరింది.
  • OPPO A78 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పాత ధర రూ.18,999 గా ఉంది. రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ.17,999 కి చేరింది.

OPPO A79 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A79 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సన్‌లైట్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఐ ఐ కంఫర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A79 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. హైపర్ఇంజిన్ 3.0 లైట్ గేమింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
  • మెమొరీ: OPPO A79 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. అలాగే 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OPPO A79 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO A79 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A79 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు.
  • కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • కెమెరా: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి కెమెరా, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో భారత్‌లో లాంచైన OPPO A78 5G https://www.91mobiles.com/telugu/oppo-a78-5g-launched-india-price-specs-availability/ Mon, 16 Jan 2023 09:10:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4469 హైలైట్స్ రూ.18,999 ధరతో భారత్ లో లాంచైన OPPO A78 5G జనవరి 18 నుంచి మొదలుకానున్న OPPO A78 5G సేల్స్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన OPPO A78 5G భారత్ లో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ హ్యాండ్సెట్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సర్క్యులర్ కెమెరా […]

The post 50ఎంపి కెమెరా, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో భారత్‌లో లాంచైన OPPO A78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రూ.18,999 ధరతో భారత్ లో లాంచైన OPPO A78 5G
  • జనవరి 18 నుంచి మొదలుకానున్న OPPO A78 5G సేల్స్
  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన OPPO A78 5G

భారత్ లో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ హ్యాండ్సెట్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సర్క్యులర్ కెమెరా కటౌట్స్, ఎల్ఈడీ ఫ్లాష్, బాక్సీ డిజైన్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఫ్లెక్స్‌డ్రాప్, త్రీ-ఫింగర్ ట్రాన్స్‌లేట్, గూగుల్ లెన్స్, యాంటీ పీపింగ్, ఫోటో ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 50ఎంపి కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్ లో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ధర, సేల్ తేదీ

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.18,999 ధరకి లభిస్తుంది. ఇది 8జిబి + 128జిబి వేరియంట్ ధర. జనవరి 18 నుంచి రిటైల్ ఔట్‌లెట్స్, ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనేవారికి 10 పర్సెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ, వన్ కార్డ్, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి కెమెరా, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో భారత్‌లో లాంచైన OPPO A78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO A78 5G ఇండియా లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a78-5g-india-launch-date-specifications-price/ Thu, 12 Jan 2023 12:48:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=4456 హైలైట్స్ రీసెంట్ గా మలేషియాలో లాంచైన OPPO A78 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన ఫోన్ భారత్ లో OPPO A78 5G ధర రూ.18,999 గా ఉండే అవకాశం ఒప్పో సంస్థ రీసెంట్ గా OPPO A78 5G అనే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని మలేషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ని భారత్ లో […]

The post లీకైన OPPO A78 5G ఇండియా లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రీసెంట్ గా మలేషియాలో లాంచైన OPPO A78 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన ఫోన్
  • భారత్ లో OPPO A78 5G ధర రూ.18,999 గా ఉండే అవకాశం

ఒప్పో సంస్థ రీసెంట్ గా OPPO A78 5G అనే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని మలేషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు ఒప్పో సిద్ధమవుతోంది. అయితే ఒప్పో ఇంకా దీనికి సంబంధించి అధికార ప్రకటన చేయాల్సి ఉంది. ఈలోపు, 91Mobiles Hindi వెబ్‌సైట్ OPPO A78 5G యొక్క లాంచ్ వివరాలను రివీల్ చేసింది. జనవరి 16 న భారత్ లో ఈ డివైజ్ లాంచ్ కానుందని సమాచారం. గ్లోయింగ్ బ్లూ, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

ఆ రిపోర్ట్ ప్రకారం OPPO A78 5G సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఓసారి OPPO A78 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో ఒప్పో ఏ78 5జీ ధర (లీక్డ్)

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ జనవరి 16 న భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో వస్తోన్న ఈ ఫోన్ 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే 8జిబి ర్యామ్ కి తోడు, 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో మొత్తం ర్యామ్ 16జిబి వరకు యూజర్ కి లభిస్తుంది.

రిపోర్ట్స్ ని బట్టి OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.18,999 గా ఉంటుందని తెలుస్తోంది. గ్లోయింగ్ బ్లూ, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. జనవరి 18 నుంచి ఈ డివైజ్ సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో ఏ78 5జీ స్పెసిఫికేషన్స్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ 6.54-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ధరకు హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగిన డిస్ప్లేని ఇవ్వడం బాగాలేదు. ఈ ధరల శ్రేణిలో లభిస్తోన్న ఫోన్లు ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంటే.. OPPO A78 5G మాత్రం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ డిస్ప్లే తో వస్తుండటం విచిత్రంగా ఉంది.

OPPO A78 5G ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉంటాయి. వీటిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. OPPO A78 5G ఫోన్ 7.99 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO A78 5G ఇండియా లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
8జిబి ర్యామ్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో లాంచైన OPPO A78 5G https://www.91mobiles.com/telugu/oppo-a78-5g-launched-malaysia-price-specs/ Mon, 09 Jan 2023 11:09:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=4391 హైలైట్స్ మలేషియాలో లాంచైన OPPO A78 5G స్మార్ట్ ఫోన్, భారత్ లో జనవరి 14 న లాంచ్ అయ్యే అవకాశం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చిన OPPO A78 5G డివైజ్ ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టంట్ రేటింగ్ ని కలిగి ఉన్న OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ఒప్పో కంపెనీ కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని వచ్చే వారం భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఆ ఫోన్ పేరు […]

The post 8జిబి ర్యామ్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో లాంచైన OPPO A78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మలేషియాలో లాంచైన OPPO A78 5G స్మార్ట్ ఫోన్, భారత్ లో జనవరి 14 న లాంచ్ అయ్యే అవకాశం
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చిన OPPO A78 5G డివైజ్
  • ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టంట్ రేటింగ్ ని కలిగి ఉన్న OPPO A78 5G స్మార్ట్ ఫోన్

ఒప్పో కంపెనీ కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని వచ్చే వారం భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఆ ఫోన్ పేరు OPPO A78 5G. ఈ ఫోన్ తాజాగా మలేషియా మార్కెట్ లో లాంచైంది. కొన్ని నెలల క్రితం చైనాలో లాంచైన ఒప్పో ఏ58 5జీ కి OPPO A78 5G రీబ్రాండెడ్ వర్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో OPPO A78 5G లాంచైంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. పవర్ బ్యాక్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. సరే, ఓసారి OPPO A78 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

OPPO A78 5G ధర, లభ్యత

OPPO A78 5G యొక్క ధరను ఒప్పో కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మలేషియాలో లాంచ్ అయ్యింది. జనవరి 14 న భారత్ లో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.54-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ నాచ్, పండా గ్లాస్ ఉన్నాయి.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. ఇక భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ డివైజ్ స్టీరియో స్పీకర్, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వచ్చింది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ పర్పుల్. ఈ స్మార్ట్ ఫోన్ 163.8 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.99 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 8జిబి ర్యామ్, 33వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి కెమెరాతో లాంచైన OPPO A78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 14 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OPPO A78 5G https://www.91mobiles.com/telugu/oppo-a78-5g-india-launch-date-price-specs-leaked/ Sat, 07 Jan 2023 11:07:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4374 హైలైట్స్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO A78 5G స్మార్ట్ ఫోన్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO A78 5G ధర, స్పెసిఫికేషన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తోన్న OPPO A78 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో భారత్ లో ఒక ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ కంపెనీ నుంచి ఏ-సిరీస్ లో వివిధ బడ్జెట్ రేంజెస్ లో ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఇక […]

The post జనవరి 14 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OPPO A78 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO A78 5G స్మార్ట్ ఫోన్
  • తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO A78 5G ధర, స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తోన్న OPPO A78 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో భారత్ లో ఒక ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ కంపెనీ నుంచి ఏ-సిరీస్ లో వివిధ బడ్జెట్ రేంజెస్ లో ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఇక త్వరలో లాంచ్ కాబోయే OPPO A78 5G స్మార్ట్ ఫోన్ OPPO A77 మరియు OPPO A77s కి సక్సెసర్ గా వస్తోంది.

అయితే OPPO A78 5G లాంచ్ కి సబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా కంపెనీ నుంచి రావాల్సి ఉంది. Appauls నుంచి వచ్చిన కొత్త లీక్ ని బట్టి, OPPO A78 5G భారత్ లో జనవరిలో లాంచ్ అవుతోంది. ఈ రిపోర్ట్ ద్వారా ఫోన్ యొక్క లాంచ్ తేదీ, ధర వివరాలు కూడా తెలిసాయి.

OPPO A78 5G ఇండియా లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్, ధర

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ ధరను ఒప్పో రూ.20,000 లోపు పెట్టే అవకాశం ఉంది. అపాల్స్ రిపోర్ట్ ప్రకారం, OPPO A78 5G బేస్ వేరియంట్ ధర భారత్ లో రూ.19,000 గా ఉండనుందని సమాచారం. రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ CPH2495 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లోని అబౌట్ సెక్షన్ స్క్రీన్ షాట్ గా పరిగణించబడుతోన్న పిక్ ద్వారా ఈ ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఇకపోతే ఈ ఫోన్ 4జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

ప్రముఖ టిప్ స్టర్ సుదాన్శు చెబుతున్నదాన్ని బట్టి, OPPO A78 5G ఫోన్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇది 7ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ 5జీ చిప్సెట్ గా దీన్ని చాలా ఫోన్లలో వాడుతున్నారు. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ57 జీపీయూ వాడారు.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో జనవరి 14 న లాంచ్ అవుతోందని సమాచారం. అందుబాటులోకి వచ్చాక, మీకు మరింత సమాచారం అందిస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 14 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OPPO A78 5G first appeared on 91Mobiles Telugu.

]]>