OPPO F23 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 15 May 2023 13:06:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 32ఎంపి సెల్ఫీ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO F23 5G https://www.91mobiles.com/telugu/oppo-f23-5g-launched-india-price-specs-availability/ Mon, 15 May 2023 12:19:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=6305 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా భారత్ లో OPPO F23 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఒప్పో ఫోన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మరియు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. అలాగే స్టైలిష్ లుక్ కూడా ఈ హ్యాండ్సెట్ సొంతం. OPPO F23 5G 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. సరే, ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర […]

The post 32ఎంపి సెల్ఫీ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO F23 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్‌తో వచ్చిన OPPO F23 5G
  • 8జిబి ఇంటర్నల్ + 8జిబి వర్చువల్ ర్యామ్ కలిగిన డివైజ్
  • 18 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం చార్జ్ కానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా భారత్ లో OPPO F23 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఒప్పో ఫోన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మరియు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. అలాగే స్టైలిష్ లుక్ కూడా ఈ హ్యాండ్సెట్ సొంతం. OPPO F23 5G 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. సరే, ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO F23 5G ధర

భారత్ లో OPPO F23 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఫోన్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు. మే 18 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

OPPO F23 5G ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

  • OPPO F23 5G డివైజ్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. జియో, ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్స్ ఈ బ్యాండ్స్ పై రన్ అవుతాయి.
  • ఈ ఫోన్ కేవలం 5 నిమిషాలు చార్జింగ్ చేయడం ద్వారా 6 గంటల కాలింగ్ టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
  • స్మార్ట్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా ఈ డివైజ్ 16జిబి ర్యామ్ ని పొందగలదు.
  • మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
  • ఈ ఫోన్ 40ఎక్స్ మైక్రోలెన్స్ ని కలిగి ఉంది. దీని ద్వారా క్లోజ్ షాట్స్ ని తీయవచ్చు.
  • OPPO F23 5G డివైజ్ ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది.

OPPO F23 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.72-పుల్ హెచ్డీ+ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఇంకా 680 నిట్స్ బ్రైట్నెస్, 391 పీపీఐ, ప్యాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్

  • 8జిబి ఎక్స్‌స్టెండెడ్ ర్యామ్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. అలాగే గ్రాఫిక్స్ కోసం ఇందులో అడ్రెనో 619 జీపీయూ వాడారు.

కెమెరా విభాగం

  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 64ఎంపి రియర్ కెమెరా

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్, 2ఎంపి మైక్రో సెన్సర్ ఉన్నాయి. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

OPPO F23 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు కేవలం 18 నిమిషాల సమయం పడుతుందని, అలాగే 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.

కనెక్టివిటీ

  • 5జీ, 4జీ వొల్టీ

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post 32ఎంపి సెల్ఫీ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO F23 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G ధర; మే 15 న భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/oppo-f23-5g-price-leak-before-launch/ Thu, 11 May 2023 17:18:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=6268 OPPO F23 5G స్మార్ట్ ఫోన్ మే 15 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని కంపెనీ చాలా రోజుల నుంచి టీజ్ చేస్తూ వస్తోంది. అలాగే ఒప్పో ఇండియా వెబ్ సైట్ లో కూడా ఈ డివైజ్ కనిపిస్తోంది. అయితే OPPO F23 5G లాంచ్ కి ముందే ధర లీక్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. సరే, OPPO […]

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G ధర; మే 15 న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F23 5G ధర రూ.23,999
  • భారత్ లో మే 15 న లాంచ్ కానున్న డివైజ్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న ఫోన్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ మే 15 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని కంపెనీ చాలా రోజుల నుంచి టీజ్ చేస్తూ వస్తోంది. అలాగే ఒప్పో ఇండియా వెబ్ సైట్ లో కూడా ఈ డివైజ్ కనిపిస్తోంది. అయితే OPPO F23 5G లాంచ్ కి ముందే ధర లీక్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. సరే, OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లీకైన ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్‌లో ఏ ధరకు OPPO F23 5G లాంచ్ అవ్వనుంది?

లీక్ ద్వారా రివీల్ అయిన వివరాల ప్రకారం, OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.23,999 గా ఉంది. మే 15 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇకపోతే లీక్ ప్రకారం, OPPO F23 5G డివైజ్ సేల్ మే 18 నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ తో పాటు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా OPPO F23 5G ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

OPPO F23 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.72-ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఈ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ర్యామ్, చిప్సెట్, స్టోరేజీ

  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • స్నాప్ డ్రాగన్ 695

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ ఉన్నాయి. అంటే వర్చువల్ ర్యామ్ తో కలుపుకుని యూజర్ కి 16జిబి ర్యామ్ లభిస్తుంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ సూపర్‌వూక్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G ధర; మే 15 న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
మే 15 న లాంచ్ అవుతోన్న OPPO F23 5G; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-f23-5g-launch-date-may-10th-expected-specs/ Tue, 09 May 2023 12:08:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=6231 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో భారత్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. అదే OPPO F23 5G. ఈ స్మార్ట్ ఫోన్ గత మోడల్ OPPO F21s Pro కి సక్సెసర్ గా వస్తోంది. మే 15 న జరిగే లాంచ్ ఈవెంట్ లో OPPO F23 5G లాంచ్ కానుంది. ఈ సందర్భంగా కంపెనీ OPPO F23 5G డివైజ్ యొక్క డిజైన్ ని రివీల్ చేసింది. OPPO F23 […]

The post మే 15 న లాంచ్ అవుతోన్న OPPO F23 5G; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F21s Pro సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న OPPO F23 5G
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్న డివైజ్
  • మే 15 న భారత్ లో లాంచ్ అవుతోన్న OPPO F23 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో భారత్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. అదే OPPO F23 5G. ఈ స్మార్ట్ ఫోన్ గత మోడల్ OPPO F21s Pro కి సక్సెసర్ గా వస్తోంది. మే 15 న జరిగే లాంచ్ ఈవెంట్ లో OPPO F23 5G లాంచ్ కానుంది. ఈ సందర్భంగా కంపెనీ OPPO F23 5G డివైజ్ యొక్క డిజైన్ ని రివీల్ చేసింది.

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి OPPO F23 5G హ్యాండ్సెట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO F23 5G ఇండియా లాంచ్ వివరాలు

  • మే 10 వ తేదీ

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మే 15 న లాంచ్ కానుంది. ఒప్పో సంస్థ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో రానున్నట్లు తెలిపింది. ఫోన్ వెనకాల పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. OPPO F23 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా మాడ్యూల్ పై భాగంలో ఒక సెన్సర్ ఉండగా, క్రింద భాగంలో రెండు సెన్సర్లు మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

OPPO F23 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.72-ఇంచ్ డిస్ప్లే
  • ఐపీఎస్ ఎల్సీడీ

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇది ఎల్సీడీ ప్యానెల్ పై తయారైంది. సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. దీనికి తోడు నాలుగేళ్ళ పాటు ల్యాగ్-ఫ్రీ అనుభూతి లభించనుందని ఈవెంట్ మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000ఎంఏహెచ్
  • 67 వాట్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి
  • 40ఎక్స్ మైక్రోలెన్స్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ కెమెరా మాడ్యూల్ 40 ఎక్స్ మైక్రో లెన్స్ జూమ్ కెపాసిటీతో రానుందని సమాచారం. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా తో పాటు, మరో రెండు 2ఎంపి సెన్సర్స్ ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఒప్పో నుంచి వచ్చే చాన్స్ ఉంది.

The post మే 15 న లాంచ్ అవుతోన్న OPPO F23 5G; రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G స్పెసిఫికేషన్స్, ధర, రెండర్స్ https://www.91mobiles.com/telugu/oppo-f23-5g-renders-price-specs-leaked-before-launch/ Mon, 08 May 2023 06:12:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=6209 OPPO F23 5G స్మార్ట్ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. గత మోడల్ OPPO F21 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. అతి త్వరలో OPPO F23 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO F23 5G కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, రెండర్స్, ధర వివరాలను షేర్ చేశారు. ట్విట్టర్ ద్వారా ముకుల్ శర్మ దాదాపు అన్ని […]

The post భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G స్పెసిఫికేషన్స్, ధర, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO F21 సిరీస్ సక్సెసర్ గా వస్తోన్న OPPO F23 5G
  • రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తోన్న OPPO F23 5G
  • స్నాప్ డ్రాగన్ 6 సిరీస్ చిప్సెట్ తో వస్తోందని అంచనా

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. గత మోడల్ OPPO F21 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. అతి త్వరలో OPPO F23 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO F23 5G కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, రెండర్స్, ధర వివరాలను షేర్ చేశారు. ట్విట్టర్ ద్వారా ముకుల్ శర్మ దాదాపు అన్ని డీటెయిల్స్ ని పంచుకున్నారు.

లీకైన వివరాల ప్రకారం, OPPO F23 5G ధర రూ.30,000 గా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్, 256జిబి వరకు స్టోరేజీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, మైక్రోలెన్స్ కెమెరా సెటప్ తో వస్తోంది. దీనికి తోడు, మరొక టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ కూడా ఇమేజెస్ ని షేర్ చేశారు. సరే, ఓసారి OPPO F23 5G హ్యాండ్సెట్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO F23 5G స్పెసిఫికేషన్స్, ధర (లీక్)

  • అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

  • ర్యామ్, స్టోరేజీ

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయని సమాచారం. ఇతర ర్యామ్ ఆప్షన్స్ లో కూడా ఫోన్ లభించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5జిబి వర్చువల్ ర్యామ్ ఉంది.

  • చిప్సెట్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇది 5జీ చిప్సెట్.

  • కెమెరా విభాగం

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్, 2ఎంపి మైక్రోలెన్స్ ఉంటాయి. ఈ మైక్రోలెన్స్ కి 40ఎక్స్ జూమ్ సామర్థ్యం ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

  • బ్యాటరీ, చార్జింగ్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

  • ఓఎస్, వెయిట్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.
ఈ డివైజ్ 192 గ్రాముల బరువు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

  • కనెక్టివిటీ

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.

  • ధర (అంచనా)

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.28,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది బాక్స్ ధర. బాక్స్ ధర కంటే అసలు ధర కాస్త తక్కువగానే ఉండనుంది.

  • కలర్ ఆప్షన్స్

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

The post భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO F23 5G స్పెసిఫికేషన్స్, ధర, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO F23 5G https://www.91mobiles.com/telugu/oppo-f23-5g-launch-soon-india-key-details-tipped/ Fri, 05 May 2023 12:05:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=6193 భారత్ లో ఒప్పో ఎఫ్-సిరీస్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఎఫ్-సిరీస్ పోర్ట్‌ఫోలియో లో ఇప్పటి వరకు చాలా ఫోన్లు వచ్చాయి. త్వరలో రాబోవు స్మార్ట్ ఫోన్ల గురించి ఈ సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఒప్పో సంస్థ మే 15 న భారత్ లో OPPO F23 Pro 5G ని అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ […]

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO F23 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 15 న OPPO F23 Pro 5G భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం
  • త్వరలోనే స్టాండర్డ్ వేరియంట్ OPPO F23 5G కూడా ఎంట్రీ ఇచ్చే చాన్స్
  • టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా లీకైన OPPO F23 5G సమాచారం

భారత్ లో ఒప్పో ఎఫ్-సిరీస్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఎఫ్-సిరీస్ పోర్ట్‌ఫోలియో లో ఇప్పటి వరకు చాలా ఫోన్లు వచ్చాయి. త్వరలో రాబోవు స్మార్ట్ ఫోన్ల గురించి ఈ సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఒప్పో సంస్థ మే 15 న భారత్ లో OPPO F23 Pro 5G ని అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ తో పాటు స్టాండర్డ్ వేరియంట్ OPPO F23 5G కూడా లాంచ్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO F23 5G వేరియంట్ వివరాలను వెల్లడించారు. అయితే ఈ ఫోన్ లాంచ్ గురించి ఒప్పో నుంచి అధికార సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఇకపోతే టిప్‌స్టర్ ఈ డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు షేర్ చేశారు.

OPPO F23 5G లాంచ్ తేదీ

OPPO F23 5G డివైజ్ ప్రో మోడల్ తో పాటు మే నెలలోనే లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఒప్పో నుంచి రానున్న రోజుల్లో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. OPPO F23 Pro 5G మే 15 న భారత్ లో లాంచ్ అవుతుందని గతంలో 91మొబైల్స్ తో టిప్‌స్టర్ ముకుల్ శర్మ చెప్పారు. ప్రో వేరియంట్ తో పాటు అదే తేదీన OPPO F23 5G లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

OPPO F23 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా

OPPO F23 5G సిరీస్ డిజైన్ విషయంలో మేజర్ అప్‌గ్రేడ్ పొందనుంది. గత మోడల్స్ తో పోల్చితే కెమెరా ప్లేస్మెంట్ వేరుగా ఉండనుంది. ఈ సిరీస్ ఒప్పో రెనో 8టీ మాదిరి కెమెరా సెటప్ ని కలిగి ఉండనుంది. Oppo F23 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పో ఫోన్ 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించే చాన్స్ ఉంది.

OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని అంచనా. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని భావిస్తున్నారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఒక ఎల్ఈడీ ఫ్లాస్ ఉంటుంది. ఈ డివైజ్ ప్రైమరీ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

OPPO F23 Pro కూడా లాంచ్ అయ్యే అవకాశం

OPPO F23 Pro స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానుందని సమాచారం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, OPPO F23 Pro డివైజ్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చే చాన్స్ ఉంది. ఈ ఫోన్ కూడా మే 15 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. స్టాండర్డ్ వేరియంట్ మాదిరి డిజైన్ ని OPPO F23 Pro కలిగి ఉంటుందని అంచనా వేయవచ్చు.

The post త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO F23 5G first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G? https://www.91mobiles.com/telugu/oppo-reno-8t-5g-to-launch-as-f23-5g-india/ Mon, 09 Jan 2023 13:10:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4394 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ 4జీ మరియు 5జీ వేరియంట్స్ లో రానున్న OPPO Reno 8T 5G 5జీ వేరియంట్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఒప్పో కంపెనీ రీసెంట్ గా చైనాలో Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అయితే ఇవి భారత్ లో లాంచ్ కాలేదు. […]

The post OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
  • 4జీ మరియు 5జీ వేరియంట్స్ లో రానున్న OPPO Reno 8T 5G
  • 5జీ వేరియంట్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ అయ్యే అవకాశం

ఒప్పో కంపెనీ రీసెంట్ గా చైనాలో Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అయితే ఇవి భారత్ లో లాంచ్ కాలేదు. అలాగే కాబోవని తాజాగా ఓ రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఈలోపు OPPO Reno 8T డివైజ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఎంట్రీ ఇవ్వనుందని మరొక వార్త వచ్చింది. అయితే ఒప్పో నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉండగా, OPPO Reno 8T కి సంబంధించిన పలు వివరాలు రివీల్ అయ్యాయి.

ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని OPPO Reno 8T 5G ఫోన్ భారత్ లో F23 సిరీస్ రూపంలో లాంచ్ కానుందని చెప్పాడు. OPPO Reno 8T యొక్క 5G వర్షన్ భారత్ లో OPPO F23 5G పేరుతో లాంచ్ కానుంది. గుగ్లాని షేర్ చేసిన ఇమేజ్ ద్వారా ఒ్పపో ఎఫ్23 5జీ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ఇప్పటి వరకు OPPO Reno 8T 5G అలియాస్ OPPO F23 5G గురించి తెలసిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G

OPPO Reno 8T 5G యొక్క లాంచ్ డేట్ ఇంకా తెలియలేదు. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రానుంది. ఈలోపు ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. గుగ్లాని ప్రకారం, OPPO Reno 8T 5G ఫోన్ భారత్ లో F23 5G పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

గుగ్లాని ఫోన్ యొక్క డిజైన్ కి సంబంధించిన ఇమేజ్ ని పోస్ట్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ లుక్ బయటకు వచ్చింది. ఫోన్ ఫ్రంట్ నుంచి కర్వ్డ్ లుక్ తో ఉంది. ఇంకా హోల్-పంచ్ కటౌట్ టాప్ సెంటర్ లో ఉంది. ఇంకా బాటమ్ చిన్, టాప్ బెజెల్ సన్నగా ఉన్నాయి.

ఇకపోతే ఫోన్ ఎడమవైపున వాల్యూమ్ బటన్, కుడివైపున పవర్ బటన్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై గోల్డ్ కలర్ ఫినిషింగ్, పిల్-షేప్డ్ కటౌట్ కనిపిస్తున్నాయి. ఈ కటౌట్ లో రెండు సర్క్యులర్ కటౌట్స్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. టాప్ కటౌట్ లో సింగిల్ లెన్స్, బాటమ్ కటౌట్ లో సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

OPPO Reno 8T యొక్క 4జీ వేరియంట్ ఇటీవలె గీక్ బెంచ్ పై కనిపించింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది. ఇక ఈ ఫోన్ కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OPPO F23 5G గా భారత్‌లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G? first appeared on 91Mobiles Telugu.

]]>