Realme GT Neo 5 SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 25 Mar 2024 17:38:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, 100 వాట్ చార్జింగ్ తో లాంచైన Realme GT Neo 5 SE https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-launched-china-price-specs-availability/ Mon, 03 Apr 2023 12:33:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=5716 Realme GT Neo 5 SE చైనాలో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ Realme GT Neo 5 SE. ఈ కొత్త రియల్మీ ఫోన్ పంచ్-హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా, భారీ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ ఫ్లాషీ డిజైన్, గ్రేడియంట్ షేడ్ […]

The post స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, 100 వాట్ చార్జింగ్ తో లాంచైన Realme GT Neo 5 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచ్ అయిన Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Realme GT Neo 5 SE
  • Realme GT Neo 5 SE ప్రారంభ ధర ఆర్ఎంబి 1,999

Realme GT Neo 5 SE చైనాలో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ Realme GT Neo 5 SE. ఈ కొత్త రియల్మీ ఫోన్ పంచ్-హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా, భారీ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ ఫ్లాషీ డిజైన్, గ్రేడియంట్ షేడ్ తో వచ్చింది. Realme GT Neo 5 SE 6.74-ఇంచ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 1టిబి స్టోరేజీ తో వచ్చింది.

Realme GT Neo 5 SE ధర

Realme GT Neo 5 SE డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర ఆర్ఎంబి 1,999 (సుమారు 23,900) గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర ఆర్ఎంబి 2199 (సుమారు రూ.26,300) గా ఉంది. 12జిబి + 512జిబి యూనిట్ ధర ఆర్ఎంబి 2299 (సుమారు రూ.27,500) గా ఉంది. 16జిబి + 1టిబి యూనిట్ ధర ఆర్ఎంబి 2799 (సుమారు రూ.33,500) గా ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్
  • 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Realme GT Neo 5 SE లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 5 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి జీసీ02ఎం మైక్రోస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్, 100 వాట్ చార్జింగ్ తో లాంచైన Realme GT Neo 5 SE first appeared on 91Mobiles Telugu.

]]>
అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన Realme GT Neo 5 SE లాంచ్; లీకైన స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-launch-official-poster-via-social-media/ Wed, 15 Mar 2023 08:44:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=5507 Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లీక్స్, ఇన్ఫర్మేషన్ గత కొన్నాళ్ళుగా వస్తూనే ఉన్నాయి. అలాగే వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Realme GT Neo 5 SE డివైజ్ కనిపించింది. వీటిలో గీక్‌బెంచ్ కూడా ఉంది. ఇప్పుడు స్వయంగా రియల్మీ సంస్థ Realme GT Neo 5 SE డివైజ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా Realme GT Neo 5 SE స్మార్ట్ […]

The post అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన Realme GT Neo 5 SE లాంచ్; లీకైన స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT Neo 5 SE లాంచ్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన రియల్మీ సంస్థ
  • ఏప్రిల్ చివరికల్లా Realme GT Neo 5 SE చైనాలో లాంచ్ కానుందని అంచనా
  • Realme GT Neo 5 SE లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉండే అవకాశం

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన లీక్స్, ఇన్ఫర్మేషన్ గత కొన్నాళ్ళుగా వస్తూనే ఉన్నాయి. అలాగే వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Realme GT Neo 5 SE డివైజ్ కనిపించింది. వీటిలో గీక్‌బెంచ్ కూడా ఉంది. ఇప్పుడు స్వయంగా రియల్మీ సంస్థ Realme GT Neo 5 SE డివైజ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ రాకను రియల్మీ ఖరారు చేసింది. కానీ, లాంచ్ తేదీ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఫోన్ లాంచ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు.

అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన Realme GT Neo 5 SE లాంచ్

ప్రమోషనల్ పోస్టర్ ద్వారా Realme GT Neo 5 SE లాంచ్ ఖరారు అయ్యింది. రియల్మీ సంస్థ చైనీస్ సోషల్ మీడియా మాధ్యమం వీబో పై పోస్టర్ ని షేర్ చేయడంతో సమాచారం బయటకు వచ్చింది. ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత ఎట్టకేలకు రియల్మీ సంస్థ ఫోన్ పేరుని అనౌన్స్ చేసింది. అయితే, పోస్టర్ ద్వారా మరే ఇతర సమాచారం మనకు లభించలేదు. అలాగే Realme GT Neo 5 SE డివైజ్ ఫీచర్లు, డిజైన్ రివీల్ కాలేదు.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Realme GT Neo 5 SE డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. బ్యాటరీ విభాగం వైపు చూస్తే, ఈ డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉండనుంది.

Realme GT Neo 5 SE లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Realme GT Neo 5 SE లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుందని సమాచారం. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ అంచనా మాత్రమే. రియల్మీ నుంచి అధికారికంగా స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన Realme GT Neo 5 SE లాంచ్; లీకైన స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT Neo 5 SE ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-key-specs-digital-chat-station-weibo-twitter/ Sun, 05 Mar 2023 14:44:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=5219 Realme GT Neo 5 SE ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచైంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు రియల్మీ సంస్థ కొత్త వేరియంట్ Realme GT Neo 5 SE ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, వీబో పై Realme GT Neo 5 SE కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. మరోవైపు ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ […]

The post లీకైన Realme GT Neo 5 SE ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజా లీక్ ద్వారా వెలుగులోకి వచ్చిన Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
  • 5,500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Realme GT Neo 5 SE

Realme GT Neo 5 SE ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచైంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు రియల్మీ సంస్థ కొత్త వేరియంట్ Realme GT Neo 5 SE ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, వీబో పై Realme GT Neo 5 SE కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. మరోవైపు ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా వివరాలను పంచుకున్నారు.

ఇప్పుడు, చైనీస్ ఎలక్ట్రానిక్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా Realme GT Neo 5 SE డివైజ్ ఏయే స్పెసిఫికేషన్స్ తో రానుందో తెలిసింది. సరే, పదండి ఓసారి Realme GT Neo 5 SE యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటి వరకు Realme GT Neo 5 SE గురించి తెలిసినవి

Realme GT Neo 5 SE పై వచ్చిన పోస్ట్స్ ప్రకారం, ఈ డివైజ్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీడబ్ల్యూఎం డిస్ప్లే డిమ్మింగ్ ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. Realme GT Neo 5 లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడటం జరిగింది. దీంతో Realme GT Neo 5 SE లో స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ ని కంపెనీ ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.

ఇప్పుడు Realme GT Neo 5 SE యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి Omnivision ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి అడిషనల్ కెమెరా యూనిట్స్ ఉంటాయి.

Realme GT Neo 5 SE లో పవర్ బ్యాకప్ కోసం 5,500 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Realme GT Neo 5 డివైజ్ 150 వాట్, 240 వాట్ వేరియంట్స్ లో వచ్చింది. దీంతో పోల్చితే Realme GT Neo 5 SE ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ తక్కువే. ప్రస్తుతానికి Realme GT Neo 5 SE కి సంబంధించిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి. Realme GT Neo 5 SE కి సంబంధించిన ఒక అధికార ప్రకటన రియల్మీ నుంచి వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Realme GT Neo 5 SE ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
100W ఫాస్ట్ చార్జింగ్, 64MP కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 SE https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-3c-certification-specs-snapdragon-7-gen-1-chipset/ Thu, 02 Mar 2023 06:29:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=5179 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme రీసెంట్ గా MWC 2023 ఈవెంట్ లో Realme GT 3 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అందించారు. ఇదిలా ఉంటే, మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు Realme సిద్ధమవుతోంది. RMX3700 అనే మోడల్ నంబర్ కలిగిన డివైజ్ ఒకటి 3C […]

The post 100W ఫాస్ట్ చార్జింగ్, 64MP కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
  • 64ఎంపి మెయిన్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme GT Neo 5 SE
  • Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme రీసెంట్ గా MWC 2023 ఈవెంట్ లో Realme GT 3 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అందించారు. ఇదిలా ఉంటే, మరొక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు Realme సిద్ధమవుతోంది. RMX3700 అనే మోడల్ నంబర్ కలిగిన డివైజ్ ఒకటి 3C సర్టిఫికేషన్ పై కనిపించింది. ఇది Realme GT Neo 5 SE లేదా Realme GT Neo 5 Lite అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.

3C సర్టిఫికేషన్ పొందిన Realme GT Neo 5 SE

Realme GT Neo 5 SE డివైజ్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ RMX3700 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీతో వస్తోంది. 5జీ సపోర్ట్, ఫాస్ట్ చార్జింగ్ సమాచారం తప్పితే Realme GT Neo 5 SE కి సంబంధించిన మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.

డిజిటల్ చాట్ స్టేషన్ కొన్ని రోజుల క్రితం Realme GT Neo 5 SE డివైజ్ స్పెసిఫికేషన్స్ షేర్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం, రియల్మీ Realme GT Neo 5 SE ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్సెట్ 50ఎంపి సోని ఐఎంఎక్స్ 890 సెన్సర్, ఆర్బీజీ నోటిఫికేషన్ లైట్ తో వస్తోంది. రీసెంట్ లీక్ ప్రకారం, ఈ ఫోన్ 64ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT 3 స్పెసిఫికేషన్స్

Realme GT 3 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ పై తయారైన చిప్సెట్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు. ఈ ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి, 16జిబి+512జిబి మరియు 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది.

Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఫ్లాట్ బెజెల్స్, 93.69 పర్సెంట్ కాంట్రాస్ట్ రేషియో, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Realme GT 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Realme GT 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Realme GT 3 స్మార్ట్ ఫోన్ 163.85 మిల్లీ మీటర్ల పొడవు, 75.75 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 100W ఫాస్ట్ చార్జింగ్, 64MP కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 SE first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-specifications-leaked-launch-imminent/ Thu, 23 Feb 2023 08:19:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=5066 Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా లాంచైంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కి లైట్ వర్షన్ Realme GT Neo 5 SE త్వరలో లాంచ్ కానుందని సమాచారం. Realme GT Neo 5 SE ని రియల్మీ లాంచ్ చేయనుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజెస్ తాజాగా టిప్‌స్టర్ డిజిటల్ […]

The post లీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
  • 1.5కే డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి కెమెరాతో రానున్న Realme GT Neo 5 SE
  • స్టాండర్డ్ వర్షన్ కి లైట్ వేరియంట్ గా వస్తోన్న Realme GT Neo 5 SE

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా లాంచైంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కి లైట్ వర్షన్ Realme GT Neo 5 SE త్వరలో లాంచ్ కానుందని సమాచారం. Realme GT Neo 5 SE ని రియల్మీ లాంచ్ చేయనుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజెస్ తాజాగా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది.

Realme GT Neo 5 SE ఏప్రిల్ లో చైనాలో లాంచ్ అవుతుందని సమాచారం. దీనికి సంబంధించి అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మార్చిలో చైనాలో లాంచ్ కానున్న Redmi Note Turbo పోటీగా Realme GT Neo 5 SE మార్కెట్ లోకి వస్తోంది.

Realme GT Neo 5 SE డిజైన్ (లీక్డ్)

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ రెండర్ ద్వారా రియర్ డిజైన్ రివీల్ అయ్యింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. బ్యాక్ ప్యానెల్ పై కుడివైపున సీ-షేప్డ్ యూనిట్ లో ఆర్జీబీ లైటింగ్ లేదా ట్రాన్స్‌పరెంట్ కవర్ ఉండవని టిప్‌స్టర్ చెబుతోంది. ఫోన్ వైట్ కలర్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై Matrix porf 1.79f/efl 25mm అనే టెక్స్ట్ రాసి ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Realme GT Neo 5 SE లో స్పెసిఫికేషన్స్ దాదాపుగా Realme GT Neo 5 ని పోలి ఉంటాయి. Realme GT Neo 5 SE లో 1.5 కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో Qualcomm SM7475 చిప్ ఉండనుంది. ఇది Snapdragon 7+ Gen 1 చిప్ అయ్యుండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

Realme GT Neo 5 SE లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్ కి బదులుగా, 64ఎంపి OV64M ప్రైమరీ కెమెరా సెన్సర్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. Realme GT Neo 5 SE హ్యాండ్సెట్ కి సంబంధించిన అధికార ప్రకటన, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 7+ Gen 1 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-to-launch-with-snapdragon-7-plus-gen-1-processor/ Tue, 14 Feb 2023 09:14:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=4911 Realme కంపెనీ రీసెంట్ గా చైనాలో Realme GT Neo 5 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ గా GT 3 5G అనే పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ కోసం GT 3 5G ని రియల్మీ కంపెనీ […]

The post Snapdragon 7+ Gen 1 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • AnTuTu సర్టిఫికేషన్ డేటాబేస్ పై కనిపించిన Realme GT Neo 5 SE
  • GT సిరీస్ లో వస్తోన్న తొలి SE ఫోన్ Realme GT Neo 5 SE
  • ఇంకా వెల్లడికాని Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ

Realme కంపెనీ రీసెంట్ గా చైనాలో Realme GT Neo 5 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ గా GT 3 5G అనే పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ కోసం GT 3 5G ని రియల్మీ కంపెనీ టీజ్ చేసింది. ఇదిలా ఉండగా, Realme GT Neo సిరీస్ లో మరొక ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. కొన్ని వారాల్లో లేదా నెలల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

తాజా లీక్ ప్రకారం, రియల్మీ సంస్థ కొత్త SE వేరియంట్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఫోన్ క్వాల్కమ్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ని ఇంకా గ్లోబల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. సరే, ఓసారి Realme GT Neo 5 SE యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ 240 వాట్ మోడల్ కంటే క్రింది స్థాయి మోడల్ గా మార్కెట్ లోకి వస్తోంది. ఇంకా లాంచ్ తేదీ కన్ఫర్మ్ కాలేదు. Realme GT Neo 5 SE డివైజ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 కి అప్‌గ్రేడ్ వర్షన్.

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ AnTuTu వెబ్ సైట్ పై కనిపించింది. ఇక స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ భారీ స్థాయిలో 1,029,731 పాయింట్లు నమోదు చేసింది. డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఈ విషయంలో 8,62,000 పాయింట్లు మాత్రమే నమోదు చేయగలిగింది.

అయితే ఇప్పటి వరకు క్వాల్కమ్ సంస్థ తన రాబోవు చిప్సెట్ Snapdragon 7+ Gen 1 కి సంబంధించి ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. అయితే రూమర్ రాయుళ్ళు మాత్రం వివరాలను రాబట్టగలిగారు. కానీ, త్వరలోనే ఈ కొత్త చిప్సెట్ Snapdragon 7+ Gen 1 కి సంబంధించిన వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది.

Realme GT Neo 5 240W స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 16జిబి ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ యూహెచ్‌ఎఫ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5000000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. కొత్త తరం ఫ్లాగ్షిప్ లుమినిసెంట్ మెటీరియల్ ని ఈ ఫోన్ లో వాడారు.

Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియల్మీ హైపర్‌షాట్ 2.0, టర్బో ‘రా’ లాస్ లెస్ ఇమేజ్ ఆల్గారిథమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme GT Neo 5 240W వేరియంట్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ఫోన్ లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బి అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా ఆర్జీబీ బ్రీథింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 7+ Gen 1 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE first appeared on 91Mobiles Telugu.

]]>