Realme Narzo 70 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 03:40:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/#respond Fri, 26 Jul 2024 18:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12715 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.20,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Realme Narzo 70 Pro

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 42 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 24 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

యూట్యూబ్ లో 30 నిమిషాలు వీడియోలు చూస్తే, కేవలం 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఇక ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా పెట్టారు. 8జిబి/256జిబి మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme P1

Realme P1 స్మార్ట్‌ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 20 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

ఇప్పుడు టెస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూస్తే, 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి.

Realme P1 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.

OnePlus Nord CE 4 Lite

OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ డివైజ్ 11 గంల 30 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

ఇప్పుడు టెస్ట్ వివరాలు చూద్దాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

OnePlus Nord CE 4 Lite యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Tecno POVA 6 Pro

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 15 గంటల 56 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme Narzo 70

Realme Narzo 70 స్మార్ట్‌ఫోన్‌ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. బ్యాటరీ 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 14 గంటల 49 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. Realme Narzo 70 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Realme Narzo 70 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/feed/ 0
Realme Narzo 70 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు https://www.91mobiles.com/telugu/realme-narzo-70-pro-5g-top-5-features/ Tue, 19 Mar 2024 15:28:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=10722 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ సోని ఐఎంఎక్స్890 కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు. Realme Narzo […]

The post Realme Narzo 70 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు లాంచైన Realme Narzo 70 Pro 5G
  • డివైజ్ ప్రారంభ ధర రూ.19,999
  • కలర్స్: గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ సోని ఐఎంఎక్స్890 కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు.

Realme Narzo 70 Pro 5G డివైజ్ బేస్ మోడల్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.1,000, టాప్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో ఉన్న టాప్ – 5 ఫీచర్లు ఏవో ఓసారి తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G టాప్-5 ఫీచర్లు

  1. సెన్సర్: Realme Narzo 70 Pro 5G లో Sony IMX890 OIS మెయిన్ కెమెరా సెన్సర్ అందించారు. ఇది హైలైట్ ఫీచర్ గా చెప్పవచ్చు. కెమెరా లవర్స్ కి అందుబాటు ధరలో ఈ ఫోన్ మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
  2. ఎయిర్ జెశ్చర్: Realme Narzo 70 Pro 5G డివైజ్ ద్వారా ఎయిర్ జెశ్చర్ ఫీచర్ ని పరిచయం చేశారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ తెరను తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు.
  3. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్: Realme Narzo 70 Pro 5G లో రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ని కూడా అందించారు. దీని ద్వారా ఫోన్ డిస్ప్లే తడిగా ఉన్నప్పటికీ టచ్ పని చేస్తుంది. అంటే ఫోన్ ని చక్కగా ఆపరేట్ చేయవచ్చు.
  4. డిస్ప్లే: Realme Narzo 70 Pro 5G లో అమోలెడ్ డిస్ప్లేని ఆఫర్ చేశారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది.
  5. చార్జింగ్: Realme Narzo 70 Pro 5G డివైజ్ 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

Realme Narzo 70 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo 70 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100% పీ3 కలర్ గేముత్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo 70 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ సాయంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

బ్యాటరీ: Realme Narzo 70 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Realme Narzo 70 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Realme Narzo 70 Pro 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి వస్తాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo 70 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.

The post Realme Narzo 70 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G https://www.91mobiles.com/telugu/realme-narzo-70-pro-5g-launched-india-air-gesture-feature/ Tue, 19 Mar 2024 07:55:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=10709 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లుక్ మరియు డిజైన్ ఇదివరకే సోషల్ మీడియా ద్వారా రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ ధర రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. Realme Narzo 70 Pro 5G ఫోన్ ఎయిర్ జెశ్చర్ అనే కొత్త ఫీచర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 […]

The post Realme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Narzo 70 Pro 5G లాంచ్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 2000 నిట్స్ బ్రైట్నెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లుక్ మరియు డిజైన్ ఇదివరకే సోషల్ మీడియా ద్వారా రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ ధర రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. Realme Narzo 70 Pro 5G ఫోన్ ఎయిర్ జెశ్చర్ అనే కొత్త ఫీచర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 70 Pro 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% పీ3 కలర్ గేముత్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 70 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Pro 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో కస్టమర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: Realme Narzo 70 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme Narzo 70 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
  • ఎయిర్ జెశ్చర్: Realme Narzo 70 Pro 5G లో ఎయిర్ జెశ్చర్ అనే కొత్త ఫీచర్ ని అందించారు. దీని ద్వారా ఫోన్ స్క్రీన్‌ని తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు.
  • కనెక్టివిటీ: Realme Narzo 70 Pro 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Realme Narzo 70 Pro 5G ధర

Realme Narzo 70 Pro 5G రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు.

Realme Narzo 70 Pro 5G డివైజ్ బేస్ మోడల్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.1,000, టాప్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో యూజర్లకు 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 కే లభిస్తుంది. 256జిబి స్టోరేజీ మోడల్ రూ.19,999 కి లభిస్తుంది.

ఎర్లీబర్డ్ సేల్ నేడు సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,299 విలువగల Realme Buds T300 ఇయర్ బడ్స్ ని రియల్మీ ఉచితంగా అందిస్తోంది.

The post Realme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: లాంచ్‌కి ముందు లీకైన Narzo 70 Pro ధర శ్రేణి https://www.91mobiles.com/telugu/realme-narzo-70-pro-5g-price-range-leaked-before-launch/ Thu, 14 Mar 2024 14:25:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10688 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త నార్జో-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. మార్చి 19న భారతీయ మార్కెట్ లో Realme Narzo 70 Pro లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ ధర నెట్టింట్లో లీక్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం […]

The post Realme: లాంచ్‌కి ముందు లీకైన Narzo 70 Pro ధర శ్రేణి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme Narzo 70 Pro లాంచ్
  • మార్చి 19న భారత్ లో ఎంట్రీ
  • ధర రూ.20 వేల లోపు ఉండే ఛాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త నార్జో-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. మార్చి 19న భారతీయ మార్కెట్ లో Realme Narzo 70 Pro లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ ధర నెట్టింట్లో లీక్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. సరే, ఓసారి అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro ధర శ్రేణి (లీక్)

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ ధర శ్రేణి వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ షేర్ చేశారు. ఈ ఫోన్‌ని రియల్మీ సంస్థ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో పరిచయం చేయనుందని సమాచారం. రూ.20,000 లోపు ఈ ఫోన్ ధర ఉండవచ్చని భావిస్తున్నారు. iQOO Z9 5G తో Realme Narzo 70 Pro పోటీ పడనుంది. ఐకూ జీ9 5జీ రూ.19,999 ప్రారంభ ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.

Realme Narzo 70 Pro ఇండియా లాంచ్ వివరాలు

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ భారత్ లో మార్చి 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ తో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై లాంచ్ కార్యక్రమాన్ని చూడవచ్చు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై Realme Narzo 70 Pro ప్రొడక్ట్ పేజీ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీన్ని బట్టి, ఈ డివైజ్ అమెజాన్ ద్వారా విక్రయానికి రానుందని తెలుస్తోంది.

Realme Narzo 70 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme Narzo 70 Pro లో పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • కెమెరా: Realme Narzo 70 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70 Pro లో ఉండే బ్యాటరీ వివరాలు ఇంకా తెలియదు. అయితే 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం.
  • ఎయిర్ జెశ్చర్: Realme Narzo 70 Pro ఫోన్ లో ఎయిర్ జెశ్చర్ ఫీచర్ ని రియల్మీ పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమ ఫోన్ స్క్రీన్, యాప్స్‌ని తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు.

The post Realme: లాంచ్‌కి ముందు లీకైన Narzo 70 Pro ధర శ్రేణి first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: మార్చి 19న భారత్‌లో లాంచ్ కానున్న Narzo 70 Pro 5G https://www.91mobiles.com/telugu/realme-narzo-70-pro-5g-india-launch-date-march-19-official/ Mon, 11 Mar 2024 10:19:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=10622 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. మార్చి 19న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. రియల్మీ సంస్థ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో వస్తుండటం విశేషం. సరే, […]

The post Realme: మార్చి 19న భారత్‌లో లాంచ్ కానున్న Narzo 70 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు
  • ప్రత్యేకంగా నిలవనున్న ‘ఎయిర్ జెశ్చర్ ఫీచర్’
  • ఐఎంఎక్స్890 సెన్సర్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. మార్చి 19న ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. రియల్మీ సంస్థ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ వివరాలు

Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 19న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. మార్చి 19న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ తో పాటు అధికార సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఈవెంట్‌ను ప్రత్యక్షప్రసారం ద్వారా చూడవచ్చు.

హైలైట్ గా నిలవనున్న Air Gestures

రియల్మీ సంస్థ Narzo 70 Pro 5G లో ఎయిర్ జెశ్చర్ ఫీచర్ ని పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ స్క్రీన్ మరియు యాప్స్‌ని తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు. మీ చేతులు తడిగా లేదా మురికిగా ఉన్నప్పుడు, కేవలం వేలు మరియు అరచేతితో కమాండ్స్ ఇవ్వడం ద్వారా ఫోన్‌ని ఆపరేట్ చేయవచ్చు.

ఫోన్ పై యాప్స్‌ని క్లోజ్ చేయడం, స్క్రీన్ స్క్రోలింగ్, స్క్రీన్‌షాట్స్, హోమ్ పేజీ యాక్సెస్ వంటి వాటిని జెశ్చర్స్ ద్వారా చేయవచ్చు.

Realme Narzo 60 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 1260 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్, 9500 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి. ప్రాసెసర్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.
  • కెమెరా: Realme Narzo 60 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme Narzo 60 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 47 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది.
  • ఓఎస్: Realme Narzo 60 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo 60 Pro 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post Realme: మార్చి 19న భారత్‌లో లాంచ్ కానున్న Narzo 70 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-narzo-70-pro-5g-india-launch-confirmed/ Fri, 23 Feb 2024 11:43:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10392 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Narzo సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Narzo 70 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారైంది. మార్చి నెలలో Realme Narzo 70 Pro 5G భారత్ లో లాంచ్ అవుతోందని ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా ఖరారైంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ […]

The post Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చిలో భారత్‌లో Realme Narzo 70 Pro 5G లాంచ్
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్890 తో వస్తోన్న డివైజ్
  • అమెజాన్ పై కనిపిస్తోన్న డివైజ్ మైక్రోసైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Narzo సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Narzo 70 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారైంది. మార్చి నెలలో Realme Narzo 70 Pro 5G భారత్ లో లాంచ్ అవుతోందని ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా ఖరారైంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి డివైజ్ లాంచ్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు

  • Realme Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికార వెబ్‌సైట్ మరియు అమెజాన్ పై లిస్ట్ అయ్యింది.
  • Realme Narzo 70 Pro 5G డివైజ్ లో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ మరియు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • Realme Narzo 70 Pro 5G డివైజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తున్నట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
  • Realme Narzo 70 Pro 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా ఉంటుందని ఖరారైంది.
  • రియల్మీ వెబ్‌సైట్ ద్వారా రివీలైన సమాచారాన్ని బట్టి, రియల్మీ బ్రాండ్ ఈ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్, ఫోటోగ్రఫీ మరియు ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ని అందించనున్నట్లు తెలుస్తోంది.
  • గత మోడల్ Realme Narzo 60 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

Realme Narzo 60 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme Narzo 60 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి-జీ68 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 60 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీంతో యూజర్ కి అదనపు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Realme Narzo 60 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 100ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme Narzo 60 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo 60 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Realme Narzo 70 Pro 5G ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>