Realme P1 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 12 Apr 2024 18:06:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P1 Pro 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/realme-p1-pro-5g-geekbench-details/ Fri, 12 Apr 2024 18:06:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=11068 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇది పీ-సిరీస్ అనే పేరుతో వస్తోంది. ఈ లైనప్ లో Realme P1 5G, Realme P1 Pro 5G అనే డివైజెస్ లాంచ్ కానున్నాయి. వీటిలో, Realme P1 Pro 5G తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Realme P1 Pro […]

The post Realme P1 Pro 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme P1 Pro
  • ఏప్రిల్ 15వ తేదీన లాంచ్
  • ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇది పీ-సిరీస్ అనే పేరుతో వస్తోంది. ఈ లైనప్ లో Realme P1 5G, Realme P1 Pro 5G అనే డివైజెస్ లాంచ్ కానున్నాయి. వీటిలో, Realme P1 Pro 5G తాజాగా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Realme P1 Pro 5G గీక్‌బెంచ్ వివరాలు

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 11న చైనీస్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

RMX3844 అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై Realme P1 Pro 5G లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ని క్రింద చూడండి.

  • ఆక్టా-కోర్ 4 నానోమీటర్ ప్రాసెసర్
  • 8జిబి ర్యామ్
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2680 పాయింట్లు స్కోర్ చేసింది.

Realme P1 Pro 5G ధర

Realme P1 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని రియల్మీ కంపెనీ తెలిపింది.

అయితే ఇది బేస్ మోడల్ ధరా? లేదా అన్ని వేరియంట్స్ కూడా ఈ ధర లోపే లాంచ్ అవుతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

Realme P1 Pro 5G డివైజ్ ఏప్రిల్ 15న లాంచ్ అవుతోంది. అప్పుడే ధర వివరాలపై స్పష్టత వస్తుంది.

Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: Realme P1 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

సేఫ్టీ: ఫోన్ వేడెక్కకుండా 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

డిస్ప్లే: Realme P1 Pro 5G లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ డిమ్మింగ్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro 5G 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

భద్రత: Realme P1 Pro 5G ఐపీ65 రేటింగ్ తో వస్తోంది.

The post Realme P1 Pro 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-april-2024/ Fri, 12 Apr 2024 14:14:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11062 గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి. Moto G64 5G iQOO Z9 Turbo Vivo T3x 5G Realme […]

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి.

  • Moto G64 5G
  • iQOO Z9 Turbo
  • Vivo T3x 5G
  • Realme P1 5G
  • Realme C65

Moto G64 5G

మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16న లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.

iQOO Z9 Turbo

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo T3x 5G

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

Realme P1 5G

రియల్మీ నుంచి కొత్తగా పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవి: Realme P1 5G మరియు Realme P1 Pro 5G. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 15వ తేదీన లాంచ్ కానున్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం ఈ పీ-సిరీస్ ని తీసుకొస్తున్నట్లు రియల్మీ తెలిపింది. Realme P1 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. Realme P1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది.

Realme C65

Realme C65 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. రియల్మీ సీ65 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: రివీలైన Realme P1, P1 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్, ఏప్రిల్ 15న లాంచ్! https://www.91mobiles.com/telugu/realme-p1-realme-p1-pro-design-color-options-confirmed/ Tue, 09 Apr 2024 16:16:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=11006 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ ఏప్రిల్ 15వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా రియల్మీ వెల్లడించింది. ఈ లైనప్ లో Realme P1, P1 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. నేడు ఈ ఫోన్ల యొక్క డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme P1 డిజైన్, కలర్ ఆప్షన్స్ […]

The post Realme: రివీలైన Realme P1, P1 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్, ఏప్రిల్ 15న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 15న రియల్మీ పీ1, పీ1 ప్రో లాంచ్
  • పీకాక్ గ్రీన్ కలర్ లో వస్తోన్న Realme P1
  • ప్యారట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్‌లో రానున్న P1 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ ఏప్రిల్ 15వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా రియల్మీ వెల్లడించింది. ఈ లైనప్ లో Realme P1, P1 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. నేడు ఈ ఫోన్ల యొక్క డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme P1 డిజైన్, కలర్ ఆప్షన్స్

Realme P1 స్మార్ట్‌ఫోన్ రియల్మీ వెబ్‌సైట్ పై పీకాక్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లిస్ట్ అయ్యింది.

డివైజ్ ఇమేజ్ ని గమనిస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ బ్యాక్ ప్యానెల్ ఉన్నట్లు తెలుస్తోంది. 50ఎంపి మెయిన్ కెమెరా Realme P1 లో ఉంటుందని సమాచారం

వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుందని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోన్న Realme P1 మైక్రోసైట్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, టాప్ లో మైక్రోఫోన్ కనిపిస్తున్నాయి. ఇంకా యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, మైక్రోఫోన్ బాటమ్ లో ఉన్నాయి.

Realme P1 Pro డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

టాప్ మోడల్ Realme P1 Pro ప్యారట్ బ్లూ మరియు ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఈ డివైజ్ ముందు, వెనుకాల కర్వ్డ్ కార్నర్స్ కలిగి ఉంది. బ్లూ కలర్ వేరియంట్ సిల్వర్ ఛాసిస్, రెడ్ కలర్ వేరియంట్ గోల్డెన్ కలర్ ఛాసిస్ కలిగి ఉన్నాయి.

ప్రో వేరియంట్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, మూడు కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Realme P1, Realme P1 Pro ధర శ్రేణి

ఏప్రిల్ 15వ తేదీన Realme P1 మరియు Realme P1 Pro డివైజెస్ యొక్క ధరలు రివీల్ అవుతాయి. కానీ, ఫ్లిప్‌కార్ట్ పై విడుదలైన టీజర్ ద్వారా Realme P1 ధర రూ.15,000 ఉంటుందని తెలుస్తోంది. Realme P1 Pro ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లు ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానున్నాయో చూడాలి.

Realme P1 స్పెసిఫికేషన్స్

Realme P1 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోందని ఖరారైంది. ఈ చిప్సెట్ అంటుటు పై 6 లక్షలకు పైగా స్కోర్ చేసింది.

Realme P1 ఫోన్ 7-లేయర్ వీసీ కూలింగ్ సిస్టమ్ (4356.62 మి.మీ వేపర్ చాంబర్) తో వస్తోంది.

Realme P1 డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 2000 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఇంకా Realme P1 లో ఐపీ54 రేటింగ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, రెయిన్‌వాటర్ టచ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

Realme P1 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు మైక్రోసైట్ ద్వారా ఖరారైంది.

ఈ డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ప్రో-ఎక్స్‌డీఆర్, 2000 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2.32ఎంఎం బాటమ్ బెజెల్ తో వస్తోంది.

Realme P1 Pro లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, టాక్టైల్ ఇంజిన్ ఉంటాయి.

Realme P1 Pro డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. ఈ ఫోన్ రెయిన్ వాటర్ టచ్, ఐపీ65 రేటింగ్ తో వస్తోంది.

The post Realme: రివీలైన Realme P1, P1 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్, ఏప్రిల్ 15న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: త్వరలో రియల్మీ నుంచి రానున్న ‘P’ సిరీస్ https://www.91mobiles.com/telugu/realme-p-series-to-launch-soon/ Mon, 08 Apr 2024 14:20:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10979 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో కొత్త లైనప్ రియల్మీ పీ-సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ X ఖాతా ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. రియల్మీ నుంచి రాబోయే P-Series ప్రత్యేకించి భారతీయ మార్కెట్ కోసం డిజైన్ చేయబడిందని చేస్ జూ తెలిపారు. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. త్వరలో వచ్చేస్తున్న Realme P సిరీస్ మిడ్-రేంజ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు సరికొత్త పీ-సిరీస్ ని […]

The post Realme: త్వరలో రియల్మీ నుంచి రానున్న ‘P’ సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రానున్న రియల్మీ పీ-సిరీస్
  • తాజాగా ప్రకటించిన రియల్మీ సంస్థ
  • లైనప్ లో వస్తోన్న Realme P1, P1 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో కొత్త లైనప్ రియల్మీ పీ-సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ చేస్ జూ X ఖాతా ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. రియల్మీ నుంచి రాబోయే P-Series ప్రత్యేకించి భారతీయ మార్కెట్ కోసం డిజైన్ చేయబడిందని చేస్ జూ తెలిపారు. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

త్వరలో వచ్చేస్తున్న Realme P సిరీస్

మిడ్-రేంజ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు సరికొత్త పీ-సిరీస్ ని పరిచయం చేయబోతున్నట్లు రియల్మీ వైస్-ప్రెసిడెంట్ జూ చేస్ తెలిపారు.

పీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్లు యువత కోసం తీసుకొస్తోన్న వాల్యూ డ్రైవెన్ డివైజెస్ అని తెలుస్తోంది.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Realme P సిరీస్ ఫోన్లు అమ్మకానికి వస్తాయని కంపెనీ తెలిపింది.

పీ-సిరీస్ లో భాగంగా రాబోయే ఫోన్లు 5జీ సపోర్ట్ తో రానున్నాయి. ఇదే విషయం కంపెనీ ప్రమోషనల్ బ్యానర్స్ లో కనిపిస్తోంది. పీ-సిరీస్ ద్వారా మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని రియల్మీ టార్గెట్ చేయనుంది. భారత్ లో 2023 వరకు రియల్మీ 100 మిలియన్ (10 కోట్లు) డివైజెస్ అమ్మినట్లు జూ చేస్ తెలిపారు.

ఇప్పటి వరకు రియల్మీ సంస్థ పీ-సిరీస్ గురించి తెలిపిన వివరాలు ఇంతే. అయితే టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Realme P1, Realme P1 Pro ఫోన్లు ఈ నెలలో భారత్ లో లాంచ్ అవుతాయని తెలిపారు.

Realme P1, Realme P1 Pro స్మార్ట్‌ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్స్ తో రానున్నట్లు సమాచారం.

POCO X-సిరీస్ కి పోటీగా రియల్మీ కంపెనీ పీ-సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పీ-సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

The post Realme: త్వరలో రియల్మీ నుంచి రానున్న ‘P’ సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>