Redmi A1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 14 Oct 2022 12:15:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio A22 చిప్, 5,000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Redmi A1+ https://www.91mobiles.com/telugu/redmi-a1-plus-launched-india-price-specs-availability/ Fri, 14 Oct 2022 12:15:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=2904 హైలైట్స్ భారత్ లో లాంచ్ అయిన Redmi A1+ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ఏ22 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచ్ అయిన హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫ్లిప్ కార్ట్, షావోమీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా లభించనున్న Redmi A1+ రెడ్మీ ఏ1 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన కొన్ని వారాలకు రెడ్మీ సంస్థ Redmi […]

The post MediaTek Helio A22 చిప్, 5,000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Redmi A1+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన Redmi A1+ స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ ఏ22 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచ్ అయిన హ్యాండ్సెట్
  • బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫ్లిప్ కార్ట్, షావోమీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా లభించనున్న Redmi A1+

రెడ్మీ ఏ1 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన కొన్ని వారాలకు రెడ్మీ సంస్థ Redmi A1+ స్మార్ట్ ఫోన్ ని నేడు భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. డిజైన్ పరంగా ఏ1, ఏ1+ ఒకే విధంగా కనిపిస్తున్నాయి. అయితే Redmi A1+ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ యాడ్ అయ్యింది. మరి Redmi A1+ యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Redmi A1+ ధర, దీపావళి ఆఫర్లు

Redmi A1+ రెండు వేరియంట్లలో లభించనుంది. 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.7,499 గా ఉంది. ఇక 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా నిర్ణయించారు. బ్లాక్, లైట్ గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 17, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తుంది.

అక్టోబర్ 31 నుంచి దీపావళి ఆఫర్ మొదలవుతుంది. ఈ ఆఫర్ సమయంలో Redmi A1+ పై డిస్కౌంట్ లభించనుంది. సేల్ సందర్భంగా Redmi A1+ 2జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ రూ.6,999 కి లభిస్తుంది. మరోవైపు 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ యూనిట్ రూ.7,999 కి లభించనుంది.

Redmi A1+ స్పెసిఫికేషన్స్

Redmi A1+ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Redmi A1+ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్ ని అమర్చారు. ఈ ఫోన్ లో 3జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32 జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు.

Redmi A1+ స్మార్ట్ ఫోన్ 6.52-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తోంది. ఇది 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ని ఈ ఫోన్ లో అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi A1+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపు 5 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.

3.5 ఎంఎం ఆడియో జాక్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వోల్టీ కాలింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు Redmi A1+ లో ఉన్నాయి. Redmi A1+ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ రెండు రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Helio A22 చిప్, 5,000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Redmi A1+ first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/redmi-a1-plus-launch-timeline-specs-price-leaked/ Tue, 11 Oct 2022 12:11:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=2855 హైలైట్స్ మరో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న Redmi అక్టోబర్ 14 న లాంచ్ అవుతోన్న Redmi A1+ స్మార్ట్ ఫోన్ భారత్ లో Redmi A1+ ధర రూ.8,000 ఉంటుందని అంచనా షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ రీసెంట్ గా Redmi A1 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi A1 ధర రూ.6,499. తాజాగా రెడ్మీ బ్రాండ్ Redmi A1+ స్మార్ట్ ఫోన్ […]

The post అక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మరో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న Redmi
  • అక్టోబర్ 14 న లాంచ్ అవుతోన్న Redmi A1+ స్మార్ట్ ఫోన్
  • భారత్ లో Redmi A1+ ధర రూ.8,000 ఉంటుందని అంచనా

షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మీ రీసెంట్ గా Redmi A1 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అయిన Redmi A1 ధర రూ.6,499. తాజాగా రెడ్మీ బ్రాండ్ Redmi A1+ స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 14 న భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. Redmi A1+ కూడా తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్.

అక్టోబర్ 14 న భారత మార్కెట్ లో Redmi A1+ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు Redmi India ప్రకటించింది. తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ప్రొడక్ట్ పేజీ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. ఇకపోతే Redmi A1+ ధర భారత్ లో రూ.8,000 గా ఉండనుందని సమాచారం. అయితే, అసలు ధర, పూర్తి వివరాల కోసం అక్టోబర్ 14 వరకు వేచి చూడక తప్పదు.

Redmi A1+ స్పెసిఫికేషన్స్

  • 6.2-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్
  • 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్
  • 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ
  • 8ఎంపి మెయిన్ కెమెరా + ఏఐ లెన్స్
  • 5ఎంపి ఫ్రంట్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్

లీకైన సమాచారాన్ని బట్టి, Redmi A1+ స్మార్ట్ ఫోన్ 6.2-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో తో వస్తోంది. ఈ ప్యానెల్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ ని కలిగి ఉంది. Redmi A1+ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ తో వస్తోంది. అలాగే ఈ ఫోన్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ని కలిగి ఉంది.

ఇప్పుడు Redmi A1+ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi A1+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Redmi A1+ లో ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. Redmi A1+ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. భారత మార్కెట్ లో Redmi A1+ స్మార్ట్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో వస్తున్న Redmi A1+ https://www.91mobiles.com/telugu/redmi-a1-plus-renders-specs-leaked-before-launch/ Mon, 26 Sep 2022 05:34:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=2556 హైలైట్స్: లీకైన Redmi A1+ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ ఏ-సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయబోతున్న Redmi కంపెనీ ఇప్పటికే FCC, Google Play Console పై కనిపించిన Redmi A1+ ఈ నెల మొదట్లో షావోమీ కంపెనీ రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఏ-సిరీస్ లో Redmi A1+ అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని సదరు కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే Redmi […]

The post Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో వస్తున్న Redmi A1+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన Redmi A1+ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్
  • ఏ-సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయబోతున్న Redmi కంపెనీ
  • ఇప్పటికే FCC, Google Play Console పై కనిపించిన Redmi A1+

ఈ నెల మొదట్లో షావోమీ కంపెనీ రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఏ-సిరీస్ లో Redmi A1+ అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని సదరు కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే Redmi A1+ ఫోన్ FCC, Google Play Console వెబ్ సైట్స్ పై కనిపించింది. Redmi A1 మాదిరి స్పెసిఫికేషన్స్ నే Redmi A1+ కలిగి ఉంటుందని కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనంగా జత చేరుతోందని ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, తాజాగా Redmi A1+ యొక్క రెండర్స్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Appuals, సుదాన్శు అంబోరే ల సౌజన్యంతో ఇవి బయటకు వచ్చాయి. లీకైన Redmi A1+ రెండర్స్ ని బట్టి, ఈ ఫోన్ డిజైన్ Redmi A1 మాదిరే ఉండనుందని స్పష్టమైంది. Redmi A1+ లో వచ్చిన ఏకైక మార్పు ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై మౌంట్ చేయబడిన ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఓసారి Redmi A1+ రెండర్స్, కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Redmi A1+: రెండర్స్, కలర్ ఆప్షన్స్

 

లీకైన రెండర్స్ ద్వారా Redmi A1+ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. అవి: పేస్టెల్ బ్లూ, పేస్టెల్ గ్రీన్, బ్లాక్. మూడు ఫోన్లు కూడా లెదర్ టెక్షర్ తో కూడిన బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉన్నాయి. Redmi A1 లో కూడా ఇదే విధమైన బ్యాక్ ప్యానెల్ డిజైన్ ని మనం గమనించవచ్చు.

ఇక అప్పీరియన్స్ విషయానికి వస్తే, Redmi A1+ అచ్చంగా Redmi A1 మాదిరే కనిపిస్తోంది. అయితే ఒకే ఒక్క తేడా ఏంటంటే, Redmi A1+ లో రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.

Redmi A1+ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

త్వరలో లాంచ్ కానున్న రెడ్మీ స్మార్ట్ ఫోన్ Redmi A1+ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఫోన్లో 6.52-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, స్క్రాచ్ రెస్టిస్టెన్స్ గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్లో మీడియాటెక్ కంపెనీ తయారు చేసిన హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. 2జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఈ ఫోన్లో ఉంది. ఇంకా Redmi A1+ ఆండ్రాయిడ్ 12 గో-ఎడిషన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Redmi A1+ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రధాన కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరాను వాటర్ డ్రాప్ నాచ్ లో అమర్చారు. Redmi A1+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ని నిక్షిప్తం చేశారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Redmi A1+ లో భద్రత కోసం రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇక ఈ ఫోన్లో మైక్రో-యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Helio A22 చిప్, 5000mAh బ్యాటరీతో వస్తున్న Redmi A1+ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 https://www.91mobiles.com/telugu/redmi-11-prime-5g-redmi-11-prime-redmi-a1-launched-price-specs-availability/ Tue, 06 Sep 2022 11:39:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=2132 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్స్ స్పెషల్ దీవాళి విత్ ఎంఐ సేల్ లో భాగంగా వస్తోన్న రెడ్మీ మేడ్ ఇన్ ఇండియా డివైజెస్ సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్, షావోమీ వెబ్ సైట్ ద్వారా డివైజెస్ ని కొనుగోలు చేసే అవకాశం రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్లను నేడు షావోమీ […]

The post భారత్ లో లాంచ్ అయిన Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్స్
  • స్పెషల్ దీవాళి విత్ ఎంఐ సేల్ లో భాగంగా వస్తోన్న రెడ్మీ మేడ్ ఇన్ ఇండియా డివైజెస్
  • సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్, షావోమీ వెబ్ సైట్ ద్వారా డివైజెస్ ని కొనుగోలు చేసే అవకాశం

రెడ్మీ 11 ప్రైమ్, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్లను నేడు షావోమీ కంపెనీ భారత్ లో లాంచ్ చేసింది. స్పెషిల్ దీవాళి విత్ ఎంఐ సేల్ లో భాగంగా ఈ మేడ్ ఇన్ ఇండియా డివైజెస్ భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ రెడ్మీ ఫోన్ల వరుసలో రెడ్మీ ఏ1 డివైజ్ అత్యంత చౌకైనది. ఏ1 ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇక రెడ్మీ 11 ప్రైమ్, పోకో ఎమ్ 5 కి రీబ్రాండెడ్ వర్షన్. ఎమ్5 ఫోన్ నిన్నే భారత్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ 22.5 వాట్ చార్జర్ తో వస్తోంది. అయితే ఇది కేవలం 18 వాట్ చార్జింగ్ స్పీడ్ ని మాత్రమే కలిగి ఉంది. మరి ఈ రెడ్మీ ఫోన్ల యొక్క ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 ఫోన్ల ధరలు, లభ్యత

రెడ్మీ 11 ప్రైమ్ 4జిబి + 64జిబి వర్షన్ ధర రూ.12,999 గా ఉంది. 6జిబి + 128జిబి వర్షన్ ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. అవి: ఫ్లాషీ బ్లాక్, ప్లేఫుల్ గ్రీన్, పెప్పీ పర్పుల్. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ 4జిబి + 64జిబి మోడల్ ధర రూ.13,999 గా ఉంది. ఇక 6జిబి + 128జిబి ధర రూ.15,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: మీడో గ్రీన్, క్రోమ్ సిల్వర్, థండర్ బ్లాక్. రెడ్మీ ఏ1 రూ.6,499 ధరతో ఓ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆసక్తిగల వారు అమెజాన్, షావోమీ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ 11 ప్రైమ్, 11 ప్రైమ్ 5జీ ఫోన్ల సేల్ సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. రెడ్మీ ఏ1 సేల్ సెప్టెంబర్ 9 సాయంత్రం 4 నుంచి మొదలవుతుంది.

Redmi 11 Prime 5G స్పెసిఫికేషన్స్

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 6జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఫోన్ 22.5 వాట్ చార్జర్ తో వస్తోంది.

రెడ్మీ 11 ప్రైమ్ 5జీ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 2ఎంపి డెప్త్ సెన్సర్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 8ఎంపి కెమెరా అందించారు. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ ని కలిగి ఉంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Redmi 11 Prime స్పెసిఫికేషన్స్

రెడ్మీ 11 ప్రైమ్ లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లున్నాయి. ఇక రెడ్మీ ఫోన్ బాక్స్ లో 22.5 చార్జర్ తో వస్తోంది. 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 1టీబీ వరకు ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ సౌకర్యం కూడా ఇందులో ఉంది.

Redmi A1 స్పెసిఫికేషన్స్

రెడ్మీ ఏ1 లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ22 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉంది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో ఫోన్ లభించనుంది. ఇందులో 1టీబీ వరకు ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశముంది.

రెడ్మీ ఏ1 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఫోన్ ముందువైపున వాటర్ డ్రాప్ నాచ్ లో 5ఎంపి కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

The post భారత్ లో లాంచ్ అయిన Redmi 11 Prime, Redmi 11 Prime 5G, Redmi A1 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Redmi A1 స్పెసిఫికేషన్స్, డిజైన్ https://www.91mobiles.com/telugu/redmi-a1-launch-date-specs-design-other-details/ Mon, 05 Sep 2022 14:55:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=2113 హైలైట్స్: సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi A1 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ బయ్యర్లను టార్గెట్ చేస్తూ Redmi A1 6.53 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు షావోమీ కంపెనీ సెప్టెంబర్ 6 న భారత్ లో రెడ్మీ డివైసెస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వీటిలో రెడ్మీ ఏ1 ఫోన్ ఒకటి. ఇది బడ్జెట్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Redmi A1 స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi A1 స్మార్ట్ ఫోన్
  • బడ్జెట్ సెగ్మెంట్ బయ్యర్లను టార్గెట్ చేస్తూ Redmi A1
  • 6.53 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

షావోమీ కంపెనీ సెప్టెంబర్ 6 న భారత్ లో రెడ్మీ డివైసెస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వీటిలో రెడ్మీ ఏ1 ఫోన్ ఒకటి. ఇది బడ్జెట్ ఫోన్. కంపెనీ ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేయాల్సి ఉంది. కానీ 91మొబైల్స్ హిందీ ఓ అడుగు ముందుకేసి రెడ్మీ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన విశేషాలను వెలుగులోకి తెచ్చింది. మనకు అందిన సమాచారాన్ని బట్టి, Redmi A1 ఫోన్ మీడియాటెక్ హీలియో జీ22 ప్రాసెసర్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే 8ఎంపి ప్రైమరీ కెమెరా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. Redmi A1 ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Redmi A1 డిజైన్

91మొబైల్స్ హిందీ కథనం ప్రకారం, రెడ్మీ ఏ1 ఫోన్లో ఫ్లాట్ ఎడ్జెస్ ఉండనున్నాయి. రియర్ ప్యానెల్ స్క్వేర్ కెమెరా మాడ్యూల్, రెడ్మీ బ్రాండింగ్ ని కలిగి ఉండనుంది. ఫోన్ ముందు వైపు చూస్తే, వాటర్ డ్రాప్ నాచ్, బాటమ్ లో చిన్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఇక ఈ హ్యాండ్సెట్ 164.9 మిల్లీ మీటర్ల పొడవు, 76.75 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.09 మిల్లీ మీటర్ల మందం, 191 గ్రాముల బరువు కలిగి ఉంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. అవి: బ్లాక్, గ్రీన్, బ్లూ.

Redmi A1 స్పెసిఫికేషన్స్

ఇప్పుడు రెడ్మీ ఏ1 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Redmi A1 స్మార్ట్ ఫోన్ లో 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్, 2జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. 3జిబి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Redmi A1 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఒకటి 8ఎంపి ప్రైమరీ సెన్సర్, మరొక ఆగ్జిలరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరాను అందించారు. Redmi A1 కెమెరా ఫీచర్లను చూస్తే, ఇందులో పొట్రెయిట్ మోడ్, టైమ్-ల్యాప్స్, షార్ట్ వీడియో తదితర ఆప్షన్స్ ఉన్నాయి. Redmi A1 లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదన్న విషయం గమనించాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Redmi A1 స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>