Sony Liv - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 13 Aug 2023 17:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) https://www.91mobiles.com/telugu/best-telugu-films-on-ott-2023/ Sun, 13 Aug 2023 17:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7525 ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ […]

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు అంత ఈజీగా కొనడం లేదు. అంతేకదా, సినిమాలో దమ్ము లేకపోతే ఓటీటీల్లో అయినా ఏ ప్రేక్షకుడు చూస్తాడు చెప్పండి?

సరే, విషయంలోకి వద్దాం. 2023 లో విడుదలై ప్రస్తుతం ఓటీటీల్లో బాగా అలరిస్తోన్న తెలుగు సినిమాలేవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాబితాలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, నాని నటించిన దసరా, నాగ శౌర్య ‘రంగబలి’ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. సరే, పదండి మరి ఆ జాబితాపై ఓ లుక్ వేద్దాం.

Best Telugu Films On Netflix (2023)

రంగబలి

రంగబలి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నాగశౌర్య, యుక్తి తరేజా ప్రధాన పాత్రలు పోషించారు.

  • సినిమా పేరు: రంగబలి
  • ఐఎండీబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాగశౌర్య, యుక్తి తరేజా
  • విడుదల తేదీ – 7 జులై 2023

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జనవరి 12 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
  • ఐఎండిబి రేటింగ్– 6.2/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – చిరంజీవి, రవితేజ, శృతిహాసన్
  • విడుదల తేదీ – 12 జనవరి 2023

దసరా

దసరా చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 2023 మార్చి 30 న థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: దసరా
  • ఐఎండిబి రేటింగ్ – 6.7/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాని, కీర్తి సురేశ్
  • విడుదల తేదీ – 30 మార్చి 2023

Best Telugu Films On Amazon Prime (2023)

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ గాథను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2023 జూన్ 16 న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: ఆదిపురుష్
  • ఐఎండీబి రేటింగ్ – 3.2/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – ప్రభాస్, కృతీసనన్
  • విడుదల తేదీ – 16 జూన్ 2023

రుద్రాంగి

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రాంగి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాన్ని చూడాలనుకుంటే రుద్రాంగి ని చూసేయండి.

  • సినిమా పేరు: రుద్రాంగి
  • ఐఎమ్‌డిబి రేటింగ్ – 7.3/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – జగపతి బాబు, మమతా మోహన్ దాస్
  • విడుదల తేదీ – 7 July 2023

స్పై

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై సినిమా 2023 జూన్ 29 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: స్పై
  • ఐఎండిబి రేటింగ్ – 5.4/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్
  • విడుదల తేదీ – 29 జూన్ 2023

రావణాసుర

రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన రావణాసుర చిత్రం 2023 ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రావణాసుర
  • ఐఎండిబి రేటింగ్र – 5.7/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్
  • నటీనటులు – రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా
  • విడుదల తేదీ – 7 ఏప్రిల్ 2023

Best Telugu Films on Disney+ Hotstar (2023)

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 జనవరి 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వీర సింహారెడ్డి
  • ఐఎండిబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్
  • విడుదల తేదీ – 11 జనవరి 2023

బిచ్చగాడు 2

బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్యా తాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: బిచ్చగాడు 2
  • ఐఎండిబి రేటింగ్ – 5.6/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – విజయ్ ఆంటోని, కావ్యా తాపర్
  • విడుదల తేదీ – 19 మే 2023

Best Telugu Films on Sony Liv (2023)

పరేషాన్

పరేషాన్ చిత్రంలో తిరువీర్, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోని లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: పరేషాన్
  • ఐఎండిబి రేటింగ్ – 6.1/10
  • ఎక్కడ చూడాలి – సోని లివ్
  • నటీనటులు – తిరువీర్, పావని కరణం
  • విడుదల తేదీ – 2 June 2023

Best Telugu Films On Zee5 (2023)

రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రైటర్ పద్మభూషణ్
  • ఐఎండిబి రేటింగ్ – 7.7/10
  • ఎక్కడ చూడాలి – జీ5
  • నటీనటులు – సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ
  • విడుదల తేదీ – 3 ఫిబ్రవరి 2023

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel రూ.839 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/airtel-rs-839-prepaid-plan-benefits-disney-plus-hotstar-xtream-sonyliv/ Tue, 10 Jan 2023 12:31:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4415 హైలైట్స్ ఎన్నో వాల్యూ ఫర్ మనీ కాంబో ప్లాన్స్ ని అందిస్తోన్న దిగ్గజ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ తో లభిస్తోన్న బోలెడన్ని ప్రయోజనాలు ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటాతో పాటు అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు […]

The post Airtel రూ.839 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ కాంబో ప్లాన్స్ ని అందిస్తోన్న దిగ్గజ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్
  • రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ తో లభిస్తోన్న బోలెడన్ని ప్రయోజనాలు
  • ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటాతో పాటు అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ కంపెనీలకు కూడా త్వరలో మంచి రోజులు రావాలని ఆశిద్దాం.

ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన యూజర్లను ఇట్టే ఆకర్షిస్తోంది ఎయిర్టెల్. ఇప్పటికే మార్కెట్ లో బలంగా పాతుకుపోయిన ఎయిర్టెల్, తన యూజర్ల కోసం విభిన్నమైన ప్లాన్స్ ని అందిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ తో పాటు 84 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ అందిస్తోంది. సరే రూ.839 ప్లాన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఇంకా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతేకాదండోయ్, ఈ ప్లాన్ తో అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

  • 84 రోజుల వ్యాలిడిటీ
  • ఉచిత కాల్స్
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • డెయిలీ 2జిబి డేటా
  • డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
  • ఎక్స్‌ట్రిమ్ యాప్ యాక్సెస్
  • అపోలో 24/7 సర్కిల్
  • ఫ్రీ హలో ట్యూన్స్
  • ఫ్రీ వింక్ మ్యూజిక్

Airtel రూ.839 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • Disney+ Hotstar బెనిఫిట్స్

ఎయిర్టెల్ రూ.839 ప్లాన్ ద్వారా డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో పాటు ఇతర బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.

  • Xstream App బెనిఫిట్స్

యూజర్లకు ఎక్స్‌ట్రిమ్ యాప్ లోని ఏదైనా ఒక చానల్ కి 84 రోజుల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. సోనిలివ్, లయన్స్‌గేట్, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమామ్యాక్స్, చౌపాల్, కాంచా లంకా.. చానల్స్ లో ఒకదానికి ఉచిత యాక్సెస్ ని పొందవచ్చు. ఈ యాక్సెస్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

ఇంకా రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్, 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ ఉచిత సేవలు లభిస్తాయి. అలాగే ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉన్నాయండి. ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కి ఫ్రీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel రూ.839 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే https://www.91mobiles.com/telugu/four-telugu-films-streaming-on-ott-today/ Fri, 09 Dec 2022 09:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3903 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా […]

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు
  • ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు
  • సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా

శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా పెరిగింది. దీంతో థియేటర్లలో సినిమాలను మిస్ అయ్యే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.

1.మాచర్ల నియోజకవర్గం
2.యశోద
3.ఊర్వశివో రాక్షసివో
4.లైక్-షేర్ & సబ్‌స్క్రైబ్

1.మాచర్ల నియోజకవర్గం

నితిన్, కృతిశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా కనిపించారు. పొలిటికల్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

2.యశోద

సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ, తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయింది. దీంతో త్వరగానే థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సమంతా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

3.ఊర్వశివో రాక్షసివో

ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి నుంచి ఆహా ఓటీటీ తో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. వివాహం గొప్పదా లేక లివ్-ఇన్ రిలేషన్షిప్ బెటరా? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు.

4.లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్

ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాము తూము ఎడిటింగ్ చేశాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

మరింకేంటి, ఈ 4 తెలుగు సినిమాలని చూసేసి ఈ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/ramarao-on-duty-ott-premiere-update-streaming-on-sony-liv/ Mon, 29 Aug 2022 12:36:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=1973 హైలైట్స్: ఓటీటీ లో ప్రసారం కానున్న రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం చిత్ర హక్కులను కొనుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్, సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాది భాషల్లో ప్రసారం చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన మాస్ మహారాజా రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి రామారావు ఆన్ డ్యూటీ: మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం 2022 జులై 29 న థియేటర్లలో విడుదలైంది. శరత్ […]

The post రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఓటీటీ లో ప్రసారం కానున్న రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం
  • చిత్ర హక్కులను కొనుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్, సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాది భాషల్లో ప్రసారం
  • చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన మాస్ మహారాజా రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి

రామారావు ఆన్ డ్యూటీ: మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం 2022 జులై 29 న థియేటర్లలో విడుదలైంది. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి రీ-ఎంట్రీ ఇచ్చారు. కాగా, ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సైట్ సోని లివ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15 నుంచి అన్ని దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది.

చిత్రకథ

1995 నేపథ్యంలో సినిమా సాగుతుంది. రామారావు (రవితేజ) ఒక రెవెన్యూ అధికారి. ఆయనకు అవినీతి అంటే అస్సలు గిట్టదు. తన మాజీ ప్రేయసి మాలిని (రజీశ విజయన్) ఓసారి రామారావు ని కలిసి తన భర్త మిస్ అయ్యాడని, సాయం చేయమని కోరుతుంది. దర్యాప్తు మొదలుపెట్టిన రామారావు, తన గ్రామంలో చాలా మంది ఎర్రచందనం అక్రమ రవాణాలో కనబడకుండా పోయారని తెలుసుకుంటాడు. మరి ఇది జరగడానికి కారణం ఎవరు? రామారావు ఎలా ఈ కేస్ ని చేదిస్తాడన్నది మిగతా కథ.

చిత్ర విశేషాలు

రవితేజ నటన చిత్రానికి ప్రధాన బలం. రెవెన్యూ అధికారి పాత్రలో మాస్ మహారాజా బాగా చేశాడు. ద్వితీయార్థంలో రవితేజ నటన చాలా బాగుంది. ఇన్విస్టిగేషన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. నాజర్ తన పాత్రలో ఒదిగిపోయారు. తనికెళ్ళ భరణి తన పాత్రకి న్యాయం చేశారు. ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. తన పాత్ర నెగటివ్ అయినప్పటికీ, ఎందిరా స్వామి అనే డైలాగ్ తో అందరి హృదయాలను గెలుచుకుంటాడు. అయితే వేణు తొట్టెంపూడి పాత్రను ఇంకా బాగా రాసుకోవాల్సి ఉంది.

నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. కెమెరా పనితనం 1990 ల కాలాన్ని చూపించే ప్రయత్నం చేసింది. డైలాగ్స్ పర్వాలేదు. సామ్ సీఎస్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక దర్శకుడు శరత్ మండవ విషయానికి వస్తే, తన తొలి సినిమాతో ఆయన పెద్దగా ప్రభావం చూపలేదు. సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా చేశాడు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా చేశాడు.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోని లివ్ దక్కించుకుంది. కాగా, సెప్టెంబర్ 15 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రామారావు ఆన్ డ్యూటీ ప్రసారం కానుందని సోని లివ్ ప్రకటించింది.

లేటెస్ట్ ఓటీటీ, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్స్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>