Tecno Phantom X2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 06:16:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/#respond Mon, 30 Sep 2024 06:16:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=13834 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ […]

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్‌లో టెక్నో ఫోన్లపై డిస్కౌంట్స్
  • Phantom V Flip ధర రూ.28,649
  • Phantom X2 Pro ధర రూ.28,749

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ డీల్స్

Tecno Phantom V Flip – అసలే తక్కువ ధరకి లాంచైన ఈ ఫ్లిప్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మరింత చవకగా మారింది. సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.54,899 కి లభిస్తోంది. రూ.25,000 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.28,649 కే సొంతం చేసుకోవచ్చు.

Tecno Phantom X2 Pro – టెక్నో యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ ఫాంటమ్ ఎక్స్2 ప్రో. ఈ ఫోన్ రూ.28,749 ధరకి లభిస్తోంది. కూపన్ డిస్కౌంట్ రూ.5,000 మరియు రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ రేటుకి లభిస్తోంది.

Tecno POVA 6 Neo – టెక్నో నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోవా 6 నియో. ఈ ఫోన్‌ని రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు.

Tecno Pop 9 5G – రూ.8,499 ధరతో టెక్నో పాప్ 9 5జీ మార్కెట్ లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి నిలుస్తోంది.

సేల్‌లో లభిస్తోన్న టెక్నో స్మార్ట్‌ఫోన్ల జాబితా

స్మార్ట్‌ఫోన్ అసలు ధర సేల్ ధర
Tecno Pop 9 5G 4GB/64GB రూ.9499 రూ.8499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Pop 9 5G 4GB/128GB రూ.9,999 రూ.8,999 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno POVA 6 Neo 8GB/256GB రూ.13,999 రూ.12,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark Go 1 రూ.7,299 రూ.7,299
Tecno Camon 30 8GB/256GB రూ.22,999 19,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 12GB/512GB రూ.26,999 రూ.23,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 Premier రూ.39,999 రూ.36,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/128GB రూ.15,999 రూ.14,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/256GB రూ.16,999 రూ.15,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 Pro రూ.34,999 రూ.28,749 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom V Flip రూ.54,899 రూ.28,649 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 రూ.24,999 రూ.23,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 20 Premier రూ.15,999 రూ.14,499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/feed/ 0
45W ఫాస్ట్ చార్జింగ్, 8GB ర్యామ్, 6.8-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-launched-india-price-specs-availability/ Mon, 02 Jan 2023 12:58:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4287 హైలైట్స్ భారత్ లో లాంచైన Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చిన హ్యాండ్సెట్ భారత్ లో Tecno Phantom X2 ధర రూ.39,999 భారత్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లాంచైంది. 2022 డిసెంబర్ లో గ్లోబల్ గా ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది టెక్నో బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియమ్ ఫోన్. […]

The post 45W ఫాస్ట్ చార్జింగ్, 8GB ర్యామ్, 6.8-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చిన హ్యాండ్సెట్
  • భారత్ లో Tecno Phantom X2 ధర రూ.39,999

భారత్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లాంచైంది. 2022 డిసెంబర్ లో గ్లోబల్ గా ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది టెక్నో బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియమ్ ఫోన్. ఈ హ్యాండ్సెట్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Tecno Phantom X2 ఫోన్ వినూత్నమైన రియర్ ప్యానెల్ డిజైన్ ని కలిగి ఉంది. కాస్త మధ్యలో ఉన్న స్క్వేర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్ లు ఉన్నాయి. 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, డైమెన్సిటీ 9000 చిప్సెట్, స్టీరియో స్పీకర్స్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్.

భారత్ లో Tecno Phantom X2 ధర, సేల్

Tecno Phantom X2 ధరను భారత్ లో రూ.39,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. జనవరి 9 నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ ప్రారంభమవుతుంది.

Tecno Phantom X2 పై కంపెనీ 6-నెలల నో-కాస్ట్ ఈఎంఐ మరియు 12-నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అందిస్తోంది. అలాగే అమెజాన్ లో మొదటి 100 ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ పై మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా మొదటి 200 ఆర్డర్స్ పై Phantom X3 ఫోన్ ఉచితమని కంపెనీ ప్రకటించింది. భారత్ లో ఆ ఫోన్ లాంచ్ అయ్యాక సంబంధిత వ్యక్తులకు అందజేయబడుతుంది.

Tecno Phantom X2 స్పెసిఫికేషన్స్

Tecno Phantom X2 లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది F/2.45 అపర్చర్, 80.6 వ్యూయింగ్ యాంగిల్, అడ్జస్టబుల్ ఫ్లాష్ లైట్, 1/2.8″ ఇమేజ్ సెన్సర్ ని కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ చూస్తే, ఏఐ పొట్రెయిట్, సూపర్ నైట్ మోడ్, కలర్ ఎన్హాన్స్మెంట్, ఫిల్టర్స్, కస్టమ్ మేకప్, వైడ్ సెల్ఫీ, హెచ్డీఆర్, బర్‌స్ట్ షాట్, పర్సనలైజ్డ్ వాటర్‌మార్క్, ఏఐ సీన్ డిటెక్షన్, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, వీడియో బొకే, వీడియో బ్యూటీ, టైమ్ ల్యాప్స్, ఏఆర్ షాట్, ఫిల్మ్ మోడ్, క్వాడ్ ఫ్లాష్ లైట్ ఉన్నాయి.

Tecno Phantom X2 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ లెన్స్ F/1.65 అపర్చర్ కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు.

సూపర్ నైట్ మోడ్, సూపర్ నైట్ ఫిల్టర్స్, ట్రైపాడ్ మోడ్, డాక్యుమెంట్స్, హెచ్డీఆర్, స్కైషాప్, ఏఐ సీన్ డిటెక్షన్, ఫిల్టర్స్, వైడ్ యాంగిల్, 10X జూమ్, పర్సనలైజ్డ్ వాటర్ మార్క్స్, పనొరమా, గూగుల్ లెన్స్, బర్‌స్ట్ షాట్, 4కే వీడియో, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, డ్యూయల్ వీడియో, వీడియో బొకే, వీడియో బ్యూటీ, 4కే టైమ్-ల్యాప్స్, 960ఎఫ్‌పీఎస్ స్లో మోషన్, ఏఆర్ షాట్, నైట్ వీడియో, కస్టమ్ మేకప్, ఫిల్మ్ మోడల్ వంటి ఫీచర్లు రియర్ కెమెరాలో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, యూనిబాడీ డబుల్-కర్వడ్ డిజైన్, 3.5డి మూన్ క్రేటర్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సీఎన్‌సీ మెటల్ మిడిల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 45W ఫాస్ట్ చార్జింగ్, 8GB ర్యామ్, 6.8-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno Phantom X2 5G భారత మార్కెట్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-5g-india-price-leaked/ Sun, 25 Dec 2022 03:35:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=4160 హైలైట్స్ ప్రపంచపు చవకైన Dimensity 9000 ఫోన్ గా నిలవనున్న Tecno Phantom X2 5G భారత్ లో Tecno Phantom X2 5G ధర రూ.26,999 గా ఉంటుందని సమాచారం 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Phantom X2 5G వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందించే టెక్నో సంస్థ ఇటీవలె గ్లోబల్ గా Tecno Phantom X2 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో ఈ సంస్థ యొక్క సత్తా […]

The post Tecno Phantom X2 5G భారత మార్కెట్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రపంచపు చవకైన Dimensity 9000 ఫోన్ గా నిలవనున్న Tecno Phantom X2 5G
  • భారత్ లో Tecno Phantom X2 5G ధర రూ.26,999 గా ఉంటుందని సమాచారం
  • 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Phantom X2 5G

వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందించే టెక్నో సంస్థ ఇటీవలె గ్లోబల్ గా Tecno Phantom X2 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో ఈ సంస్థ యొక్క సత్తా ఏంటో అందరికీ తెలిసినట్లైంది. ఈ సిరీస్ లో Phantom X2 మరియు Phantom X2 Pro అనే రెండు మోడల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే భారత్ లో Tecno Phantom X2 5G డివైజ్ 2023 జనవరిలో లాంచ్ కానుంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ ద్వారా Tecno Phantom X2 5G యొక్ ధర ఎంతో తెలిసింది.

భారత్ లో Tecno Phantom X2 5G ధర

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గిగ్లాని తాజాగా Tecno Phantom X2 5G యొక్క ఇండియా ధరను వెల్లడించాడు. లీక్ ప్రకారం, Tecno Phantom X2 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.26,999 గా ఉంటుందని సమాచారం. ఇది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర. గ్లోబల్ వేరియంట్ ధరను బట్టి చూస్తే, ఇది కూడా లాంచ్ ప్రైస్ అని అనుకోవచ్చు. అంటే అన్ని ఆఫర్లతో కలుపుకుని ఈ ధరలో ఫోన్ లభించే అవకాశం ఉందన్నమాట. దీనర్థమేంటంటే, అసలు సేల్ ధర వేరే ఉంటుంది.

Tecno Phantom X2 5G స్పెసిఫికేషన్స్

Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది.

Tecno Phantom X2 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. ఇది 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. Tecno Phantom X2 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno Phantom X2 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, యూనిబాడీ డబుల్-కర్వడ్ డిజైన్, 3.5డి మూన్ క్రేటర్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సీఎన్‌సీ మెటల్ మిడిల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ లెన్స్ F/1.65 అపర్చర్ కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Tecno Phantom X2 5G భారత మార్కెట్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ ద్వారా ఖరారైన Tecno Phantom X2 5G ఇండియా లాంచ్: ప్రీ-బుకింగ్ తేదీ 2023 జనవరి 2 https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-5g-india-launch-and-pre-booking-conformation/ Mon, 19 Dec 2022 08:32:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=4053 హైలైట్స్ డిసెంబర్ 7 న దుబాయ్ లో లాంచైన Tecno Phantom X2 సిరీస్, భారత్ లో లాంచ్ అయ్యేందుకు రెడీ అయిన Tecno Phantom X2 5G ఫాంటమ్ ఎక్స్2 లైనప్ లో రానున్న Phantom X2, Phantom X2 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 64ఎంపి మెయిన్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న Tecno Phantom X2 5G డిసెంబర్ 7 న దుబాయ్ లో Phantom X2 సిరీస్ ని […]

The post అమెజాన్ ద్వారా ఖరారైన Tecno Phantom X2 5G ఇండియా లాంచ్: ప్రీ-బుకింగ్ తేదీ 2023 జనవరి 2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 7 న దుబాయ్ లో లాంచైన Tecno Phantom X2 సిరీస్, భారత్ లో లాంచ్ అయ్యేందుకు రెడీ అయిన Tecno Phantom X2 5G
  • ఫాంటమ్ ఎక్స్2 లైనప్ లో రానున్న Phantom X2, Phantom X2 Pro
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, 64ఎంపి మెయిన్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న Tecno Phantom X2 5G

డిసెంబర్ 7 న దుబాయ్ లో Phantom X2 సిరీస్ ని లాంచ్ చేసిన Tecno కంపెనీ, ఇప్పుడు Tecno Phantom X2 5G ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Tecno Phantom X2 లైనప్ లో రెండు మోడల్స్ ఉంటాయి. అవి: Tecno Phantom X2, Tecno Phantom X2 Pro. అమెజాన్ ద్వారా Tecno Phantom X2 సిరీస్ యొక్క లాంచ్ వివరాలను కంపెనీ వెల్లడించింది.

టెక్నో ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీ, ధర ను ఇంకా వెల్లడించలేదు. అయితే, అమెజాన్ మైక్రోసైట్ టీజర్ ద్వారా డివైజ్ ని రివీల్ చేసింది. ఇక ఈ ఫోన్ యొక్క ప్రీ-బుకింగ్స్ 2023 జనవరి 2 నుంచి మొదలవుతాయి. ఇక సేల్స్ జనవరి 9 నుంచి ప్రారంభవుతాయి. Tecno Phantom X2 5G యొక్క స్పెసిఫికేషన్స్ మరియు అంచనా ధర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno Phantom X2 5G ధర

Tecno Phantom X2 5G ఫోన్ SAR 2699 (సుమారు రూ.59,100) ధరతో దుబాయ్ లో లాంచైంది. భారత్ లో రూ.50,000 పైనే ఈ ఫోన్ ధర ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ టెక్నో ఫ్లాగ్షిప్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: స్టార్‌డస్ట్ గ్రే మరియు మూన్‌లైట్ సిల్వర్.

Tecno Phantom X2 5G స్పెసిఫికేషన్స్

Tecno Phantom X2 5G స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో వస్తోంది. Tecno Phantom X2 5G మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno Phantom X2 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి కెమెరా ఉండనుంది.

Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అమెజాన్ ద్వారా ఖరారైన Tecno Phantom X2 5G ఇండియా లాంచ్: ప్రీ-బుకింగ్ తేదీ 2023 జనవరి 2 first appeared on 91Mobiles Telugu.

]]>
17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్ https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-series-globally-launched-with-17gb-ram-45w-charging/ Wed, 07 Dec 2022 13:00:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=3860 హైలైట్స్ నేడు గ్లోబల్ గా లాంచైన Tecno Phantom X2, Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్స్ 6.8-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్ స్మార్ట్ ఫోన్ల తయారీదారు టెక్నో మెల్లగా తన ప్రభావాన్ని చూపుతోంది. వరుస లాంచ్ […]

The post 17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు గ్లోబల్ గా లాంచైన Tecno Phantom X2, Tecno Phantom X2 Pro స్మార్ట్ ఫోన్స్
  • 6.8-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ తో వచ్చిన Tecno Phantom X2 సిరీస్

స్మార్ట్ ఫోన్ల తయారీదారు టెక్నో మెల్లగా తన ప్రభావాన్ని చూపుతోంది. వరుస లాంచ్ లతో మార్కెట్ లో తన పట్టుని నిలుపుకుంటోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను దించుతూ జనాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ కంపెనీ నేడు దుబాయ్ లో Tecno Phantom X2 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లాంచ్ అయ్యాయి.

Tecno Phantom X2 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ని వినియోగించారు. ఇంకా ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 64ఎంపి ఓఐఎస్ కెమెరా, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5 ర్యామ్, మెమొరీ ఫ్యూజన్, 11 5జీ బ్యాండ్స్ సపోర్ట్ వంటి మరెన్నో స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్స్ లో ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Phantom X2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Phantom X2 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, యూనిబాడీ డబుల్-కర్వడ్ డిజైన్, 3.5డి మూన్ క్రేటర్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సీఎన్‌సీ మెటల్ మిడిల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది F/2.45 అపర్చర్, 80.6 వ్యూయింగ్ యాంగిల్, అడ్జస్టబుల్ ఫ్లాష్ లైట్, 1/2.8″ ఇమేజ్ సెన్సర్ ని కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ చూస్తే, ఏఐ పొట్రెయిట్, సూపర్ నైట్ మోడ్, కలర్ ఎన్హాన్స్మెంట్, ఫిల్టర్స్, కస్టమ్ మేకప్, వైడ్ సెల్ఫీ, హెచ్డీఆర్, బర్‌స్ట్ షాట్, పర్సనలైజ్డ్ వాటర్‌మార్క్, ఏఐ సీన్ డిటెక్షన్, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, వీడియో బొకే, వీడియో బ్యూటీ, టైమ్ ల్యాప్స్, ఏఆర్ షాట్, ఫిల్మ్ మోడ్, క్వాడ్ ఫ్లాష్ లైట్ ఉన్నాయి.

Tecno Phantom X2 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ లెన్స్ F/1.65 అపర్చర్ కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు.

సూపర్ నైట్ మోడ్, సూపర్ నైట్ ఫిల్టర్స్, ట్రైపాడ్ మోడ్, డాక్యుమెంట్స్, హెచ్డీఆర్, స్కైషాప్, ఏఐ సీన్ డిటెక్షన్, ఫిల్టర్స్, వైడ్ యాంగిల్, 10X జూమ్, పర్సనలైజ్డ్ వాటర్ మార్క్స్, పనొరమా, గూగుల్ లెన్స్, బర్‌స్ట్ షాట్, 4కే వీడియో, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, డ్యూయల్ వీడియో, వీడియో బొకే, వీడియో బ్యూటీ, 4కే టైమ్-ల్యాప్స్, 960ఎఫ్‌పీఎస్ స్లో మోషన్, ఏఆర్ షాట్, నైట్ వీడియో, కస్టమ్ మేకప్, ఫిల్మ్ మోడల్ వంటి ఫీచర్లు రియర్ కెమెరాలో ఉన్నాయి.

Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

Tecno Phantom X2 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. Tecno Phantom X2 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. ఇది 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, ఎన్ఎఫ్‌సీ, ఏఐ సబ్‌టైటిల్స్, ఎంఓఎల్ 1.5, ఐడీఏ ఇంజిన్ 3.0, లైట్నింగ్ మల్టీ విండో 3.0, ఎల్లా 2.0, వీలైఫ్, మై హెల్త్, అరోరా ఇంజిన్, మాగెలన్ ఇంజిన్, రికార్డ్ ట్రాన్స్‌లేటర్, పీసీ కనెక్షన్, స్మార్ట్ 5జీ తదితర ఫీచర్లు Tecno Phantom X2 లో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.

Tecno Phantom X2 Pro స్పెసిఫికేషన్స్

Tecno Phantom X2 Pro మరియు Tecno Phantom X2 మోడల్స్ మధ్య పెద్దగా తేడాలు ఏమీ లేవు. ఒక్క కెమెరా విభాగంలో మాత్రమే ఈ తేడాను గమనించవచ్చు. ఇది కాకుండా మిగతా ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఓసారి Tecno Phantom X2 Pro కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం.

Tecno Phantom X2 Pro లో 50MP+50MP+13MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో ప్రపంచపు మొట్టమొదటి రిట్రాక్టబుల్ 50ఎంపి పొట్రెయిట్ లెన్స్ వాడారు. 7th జనరేషన్ IMAGIQ 790 ISP, 5th Gen AI Processor APU 590 ఈ కెమెరా సిస్టమ్ లో వాడారు. ఇంకా ఇందులో Quad Flashlight ని అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno Phantom X2, Tecno Phantom X2 Pro ధరలు

Tecno Phantom X2 8జిబి+256జిబి మోడల్ ధర SAR 2699 (సుమారు రూ.59,200), Tecno Phantom X2 Pro 12జిబి+256జిబి యూనిట్ ధర SAR 3,499 (సుమారు రూ.76,700) గా నిర్ణయించారు. ఈ ధరలు సౌదీ అరేబియాకి సంబంధించినవి. భారత్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాక ధరలు వేరుగా ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
గింబల్ కెమెరా, డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో వస్తోన్న Tecno Phantom X2 https://www.91mobiles.com/telugu/tecno-phantom-x2-specs-desing-leaked-before-launch/ Tue, 29 Nov 2022 05:10:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=3721 హైలైట్స్ లాంచ్ కి ముందు లీకైన Tecno Phantom X2 డిజైన్, స్పెసిఫికేషన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000, గింబల్ కెమెరా తో వస్తోన్న Tecno Phantom X2 Tecno Phantom X2 లైనప్ లో లాంచ్ కానున్న స్టాండర్డ్ వేరియంట్ Phantom X2, Phantom X2 Pro డిసెంబర్ 7 న దుబాయ్ లో లాంచ్ అవుతోన్న Tecno Phantom X2   Phantom X కి సక్సెసర్ గా Tecno Phantom X2 ఫోన్ లాంచ్ […]

The post గింబల్ కెమెరా, డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో వస్తోన్న Tecno Phantom X2 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లాంచ్ కి ముందు లీకైన Tecno Phantom X2 డిజైన్, స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000, గింబల్ కెమెరా తో వస్తోన్న Tecno Phantom X2
  • Tecno Phantom X2 లైనప్ లో లాంచ్ కానున్న స్టాండర్డ్ వేరియంట్ Phantom X2, Phantom X2 Pro
  • డిసెంబర్ 7 న దుబాయ్ లో లాంచ్ అవుతోన్న Tecno Phantom X2
Image Courtesy: @TechArena24

Phantom X కి సక్సెసర్ గా Tecno Phantom X2 ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ డిసెంబర్ 7 న దుబాయ్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్ కి ముందు టెక్నో సంస్థ ఈ డివైజ్ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, ఈగల్ ఐ లెన్స్ కెమెరా టెక్నాలజీ తదితర ఫీచర్లతో Tecno Phantom X2 వస్తున్నట్లు టెక్నో కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, TechArena24 తాజాగా Tecno Phantom X2 యొక్క డిజైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది.

Tecno Phantom X2 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ Phantom X2 మరియు టాప్ వేరియంట్ Phantom X2 Pro ఉంటాయి. ఈ ఫోన్లు భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన సమయం ఇంకా తెలియదు. ఓసారి Tecno Phantom X2 స్పెసిఫికేషన్స్, డిజైన్, తదితర వివరాల గురించి తెలుసుకుందాం పదండి.

Tecno Phantom X2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇక కెమెరా విభాగం వైపు చూస్తే, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. వీడియో స్టెబిలిటీ కోసం ఇందులో గింబల్ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ గింబల్ కెమెరా అల్ట్రావైడ్ మరియు మ్యాక్రో లెన్స్ గా కూడా పని చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Tecno Phantom X2 లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడినట్లు సమాచారం. లీక్స్ ద్వారా తెలిసిన సమాచారాన్ని బట్టి, ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5100 ఎంఏహెచ్ బ్యారటీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఉంటుంది. అయితే 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉండదు. ఈ డివైజ్ లో అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

గత మోడల్ అయిన Tecno Phantom X రూ.25,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, మీడియాటెక్ హీలియో జీ95 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది.