Tecno Pova 4 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Dec 2022 06:03:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 4 https://www.91mobiles.com/telugu/tecno-pova-4-launched-india-price-specs-availability/ Wed, 07 Dec 2022 06:03:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=3850 హైలైట్స్ భారత్ లో లాంచైన Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ భారత్ లో Tecno Pova 4 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.11,999 Tecno Pova 4 భారత్ లో లాంచ్ అయ్యింది. గత నెలలో Tecno Pova 4 మరియు Tecno Pova 4 Pro ఫోన్లు […]

The post 8GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 4 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Tecno Pova 4 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో Tecno Pova 4 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.11,999

Tecno Pova 4 భారత్ లో లాంచ్ అయ్యింది. గత నెలలో Tecno Pova 4 మరియు Tecno Pova 4 Pro ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. తాజాగా భారత్ లో ఎంట్రీ ఇచ్చిన Tecno Pova 4 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరాతో వచ్చింది.

Tecno Pova 4 లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి. మరి భారత్ లో Tecno Pova 4 ధర, లాంచ్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? అయితే పదండి.

భారత్ లో Tecno Pova 4 ధర, లభ్యత

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి ఈ ఫోన్ ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Tecno Pova 4 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Pova 4 లో 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1640*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ నాచ్, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ ఉన్నాయి.

Tecno Pova 4 లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి. ఈ డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 5జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. Tecno Pova 4 ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno Pova 4 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Tecno Pova 4 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో డీటీఎస్ ఆడియో, స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి.

Tecno Pova 4 రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: యురనోలిత్ గ్రే మరియు క్రయొలైట్ బ్లూ. భారత మార్కెట్ లో లావా ఆరెంజ్ వేరియంట్ ని లాంచ్ చేయలేదు. Tecno Pova 4 170.59 మిల్లీ మీటర్ల పొడవు, 77.52 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.7 మిల్లీ మీటర్ల మందం, 212 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ తో వస్తోంది. Tecno Pova 4 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 8GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 4 first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Tecno Pova 4 https://www.91mobiles.com/telugu/tecno-pova-4-launch-date-officially-revealed-by-company/ Tue, 06 Dec 2022 13:04:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=3840 హైలైట్స్ ట్విట్టర్ ద్వారా Tecno Pova 4 లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ డిసెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Tecno Pova 4, అమెజాన్ ద్వారా సేల్ డెడికేటెడ్ మైక్రోసైట్ ద్వారా ఖరారైన ప్రాసెసర్, స్టోరేజీ, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, డ్యూయల్ కెమెరాస్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Tecno Pova 4 Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 7 న లాంచ్ అవుతుందని […]

The post డిసెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Tecno Pova 4 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ట్విట్టర్ ద్వారా Tecno Pova 4 లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ
  • డిసెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Tecno Pova 4, అమెజాన్ ద్వారా సేల్
  • డెడికేటెడ్ మైక్రోసైట్ ద్వారా ఖరారైన ప్రాసెసర్, స్టోరేజీ, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, డ్యూయల్ కెమెరాస్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Tecno Pova 4

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 7 న లాంచ్ అవుతుందని కంపెనీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. Tecno Pova 3 కి సక్సెసర్ గా Tecno Pova 4 వస్తోంది. Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే అమెజాన్ లో Tecno Pova 4 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలిసింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమైంది.

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ లిస్టింగ్ ని బట్టి, ఫోన్ బాక్సీ డిజైన్, రౌండెడ్ ఎడ్జెస్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

Tecno Pova 4 డిజైన్

అమెజాన్ లో కనిపించిన Tecno Pova 4 యొక్క రెండర్స్ ఫోన్ డిజైన్ ని చూపించాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఫోన్ వెనకాల, వేర్వేరు సర్క్యులర్ రింగ్స్ లో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై డైమండ్ ప్యాటర్న్ ఉంది. ఫోన్ ముందువైపున, పంచ్-హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే సన్నని బెజెల్స్ ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

అమెజాన్ లిస్టింగ్ ని బట్టి, Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మెమొరీ ఫ్యూజన్ ద్వారా ర్యామ్ ని 5జిబి వరకు పెంచుకోవచ్చు. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ విషయాలు తెలిసాయి.

Tecno Pova 4 స్పెసిఫికేషన్స్

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 6.82-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1640*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 6ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు. కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం.

Tecno Pova 4 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఒక ఆగ్జిలరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ముందువైపున 8 మెగా పిక్సెల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ గేమ్ ఇంజిన్ తో వస్తున్నట్లు సమాచారం. అంటే గేమ్ ఇంజిన్ 2.0 మరియు హైపర్ ఇంజిన్ 2.0 కలిసి పని చేయనున్నాయి. Tecno Pova 4 ఫోన్ 170.59 మిల్లీ మీటర్ల పొడవు, 77.52 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.7 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Tecno Pova 4 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 6.0 పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 7 న లాంచ్ అవుతోన్న Tecno Pova 4 first appeared on 91Mobiles Telugu.

]]>
13GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Tecno Pova 4 https://www.91mobiles.com/telugu/tecno-pova-4-to-launch-with-13gb-ram-6000-mah-battery/ Thu, 01 Dec 2022 15:03:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=3812 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ భారత్ లో డిసెంబర్ 7 న లాంచ్ అవుతుందని సమాచారం 8జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అవుతోన్న Tecno Pova 4 టెక్నో కంపెనీ గత నెలలో Tecno Pova 4 ని బంగ్లాదేశ్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ భారత్ లో డిసెంబర్ 7 న లాంచ్ కానుందని 91 మొబైల్స్ కి […]

The post 13GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Tecno Pova 4 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Pova 4 స్మార్ట్ ఫోన్
  • భారత్ లో డిసెంబర్ 7 న లాంచ్ అవుతుందని సమాచారం
  • 8జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అవుతోన్న Tecno Pova 4

టెక్నో కంపెనీ గత నెలలో Tecno Pova 4 ని బంగ్లాదేశ్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ భారత్ లో డిసెంబర్ 7 న లాంచ్ కానుందని 91 మొబైల్స్ కి సమాచారం అందింది. భారత్ లో Tecno Pova 4 ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వస్తోన్న Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 13జిబి ర్యామ్ (8జిబి + 5జిబి) ని కలిగి ఉంటుంది.

Tecno Pova 4 అమెజాన్ ద్వారా సేల్ కి రానున్నాయి. రానున్న రోజుల్లో అమెజాన్ లో Tecno Pova 4 కి సంబంధించిన మైక్రోసైట్ కనిపించే అవకాశం ఉంది. గతేడాది లాంచైన Tecno Pova 3 కి సక్సెసర్ గా Tecno Pova 4 వస్తోంది.

91మొబైల్స్ కి వచ్చిన సమాచారాన్ని బట్టి, Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 7 సమీపంలో భారత మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. ఇక ఈ ఫోన్ ధర రూ.11,999 గా ఉంటుంది. Tecno Pova 4 యొక్క లాంచ్ తేదీ, ధర తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Pova 4 స్పెసిఫికేషన్స్

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో లాంచ్ అవ్వనుంది. ఈ చిప్సెట్ 6 ఎన్ఎం ప్లాట్ఫామ్ పై తయారైంది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ వల్లన ఈ డివైజ్ 13 జిబి ర్యామ్ తో పెర్ఫామ్ చేయగలదు. భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ 128జిబి స్టోరేజీ తో లాంచ్ అవుతోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Tecno Pova 4 యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే దీనికి తోడు సెకండరీ లెన్స్ ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. టెక్నో పోవా 4 డివైజ్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. త్వరలోనే ఇండియా లాంచ్ తేదీ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 13GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Tecno Pova 4 first appeared on 91Mobiles Telugu.

]]>