Vivo V27 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Apr 2023 17:30:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 8200 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V27 Pro https://www.91mobiles.com/telugu/vivo-v27-pro-launched-india-price-specs-offers-availability/ Wed, 01 Mar 2023 08:15:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=5161 Vivo V27 సిరీస్ నేడు భారత్ లో లాంచైంది. ఈ లైనప్ లో Vivo V27 Pro మరియు Vivo V27 మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. భారత్ లో V-సిరీస్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వి-సిరీస్ లాంచ్ కోసం ఎంతోమంది వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ ఆర్టికల్ లో మనం Vivo V27 Pro విశేషాలను తెలుసుకుందాం. Vivo V27 సిరీస్ Vivo S16 సిరీస్ కి రీబ్రాండ్ వర్షన్ […]

The post 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 8200 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V27 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Vivo V27 Pro స్మార్ట్ ఫోన్
  • 6.78-ఇంచ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Vivo V27 Pro
  • నోబుల్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Vivo V27 Pro స్మార్ట్ ఫోన్

Vivo V27 సిరీస్ నేడు భారత్ లో లాంచైంది. ఈ లైనప్ లో Vivo V27 Pro మరియు Vivo V27 మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. భారత్ లో V-సిరీస్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వి-సిరీస్ లాంచ్ కోసం ఎంతోమంది వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ ఆర్టికల్ లో మనం Vivo V27 Pro విశేషాలను తెలుసుకుందాం.

Vivo V27 సిరీస్ Vivo S16 సిరీస్ కి రీబ్రాండ్ వర్షన్ గా వచ్చినట్లు సమాచారం. Vivo V27 Pro విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చింది.

భారత్ లో Vivo V27 Pro ధర, సేల్ వివరాలు

Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి+128జిబి యూనిట్ ధర రూ.37,999, 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.39,999, 12జిబి+256జిబి మోడల్ ధర రూ.42,999 గా నిర్ణయించారు. నేటి నుంచి ఈ డివైజ్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చి 6 నుంచి సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Vivo సంస్థ ఐసీఐసీఐ, కొటక్, హెచ్డీబీ బ్యాంక్ కార్డ్స్ పై రూ.3,500 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇంకా Vivo V27 Pro తో పాటు Vivo TWS Air కొంటే ఇయర్ బడ్స్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే వీ-షీల్డ్ ప్రొటెక్షన్ పై 40 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవి ఆఫ్-లైన్ స్టోర్స్ ద్వారా లభించే ఆఫర్లు.

ఇక ఆన్‌లైన్ ద్వారా హెచ్డీఎఫ్‌సీ, కొటక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,500 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. Vivo V27 Pro డివైజ్ ని ఫ్లిప్ కార్ట్ తో పాటు వివో స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Vivo V27 Pro స్పెసిఫికేషన్స్

Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు.

Vivo V27 Pro లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, కర్వ్డ్ ఎడ్జెస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 66W ఫాస్ట్ చార్జింగ్, Dimensity 8200 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V27 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 1 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-launching-march-1-globally-price-specs/ Mon, 20 Feb 2023 05:30:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=4996 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే Vivo V27 సిరీస్ ని భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయబోతోంది. Vivo V27 సిరీస్ మార్చి 1 న లాంచ్ అవుతున్నట్లు ఖరారైంది. Vivo V27 సిరీస్ లాంచ్ కోసం వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. Vivo V-సిరీస్ కి ప్రత్యేకించి భారత్ లో ఆదరణ ఎక్కువే. Vivo V27 సిరీస్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, కలర్ చేంజింగ్ […]

The post మార్చి 1 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా మార్చి 1 న లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ తో వస్తోన్న Vivo V27 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న ఫోన్లు: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే Vivo V27 సిరీస్ ని భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయబోతోంది. Vivo V27 సిరీస్ మార్చి 1 న లాంచ్ అవుతున్నట్లు ఖరారైంది. Vivo V27 సిరీస్ లాంచ్ కోసం వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. Vivo V-సిరీస్ కి ప్రత్యేకించి భారత్ లో ఆదరణ ఎక్కువే.

Vivo V27 సిరీస్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ డిజైన్, సోని ఐఎంఎక్స్766వి సెన్సర్ తో వస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e. ఫ్లిప్ కార్ట్ అనుకోకుండా Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని రివీల్ చేసింది. దీంతో మార్చి 1 న ఈ సిరీస్ లాంచ్ కానుందని స్పష్టత వచ్చింది.

వివో వి27 సిరీస్ కలర్ ఆప్షన్స్

Vivo V27 సిరీస్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. అతినీలలోహిత కాంతి పడిన వెంటనే ఫోన్ బ్యాక్ ప్యానెల్ డార్క్ షేడ్ లోకి మారిపోతుంది. ఈ కలర్ చేంజింగ్ ఫీచర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ తరహా ఫోన్లకు గిరాకీ బాగానే ఉంది. గత సిరీసుల్లో కూడా వివో ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీని వాడింది.

Vivo V27 సిరీస్ స్మార్ట్ ఫోన్ సోని ఐఎంఎక్స్ 776వి సెన్సర్, ఆరా లైటింగ్ తో వస్తున్నట్లు సమాచారం. అంటే ఈ ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరాను కలిగి ఉండనుంది. ఇంకా ఈ ఫోన్ పొట్రెయిట్ కేపబులిటీస్ ని వివో బాగా హైలైట్ చేస్తోంది.

రీసెంట్ లీక్ ద్వారా Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ తో వస్తున్నట్లు తెలిసింది. Vivo V27 Pro ధర రూ.41,999 గా ఉండనుందని సమాచారం. భారత్ లో దీని ధర రూ.40,000 గా ఉండనుంది. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం, Vivo V27 Pro ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తోంది.

Vivo V27 Pro డివైజ్ ఇటీవలె గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ ప్రకారం, Vivo V27 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 1 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 Pro ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v27-pro-india-price-color-storage-options/ Fri, 17 Feb 2023 05:14:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=4971 మిడ్-రేంజ్ Vivo V27 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు Vivo సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e. ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటివారంలో ఈ ఫోన్ల లాంచ్ ఉంటుంది. అయితే ఈలోపు Vivo V27 Pro భారతీయ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు లీకైయ్యాయి. Vivo V27 Pro రూ.41,999 ధరతో రానున్నట్లు సమాచారం. […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 Pro ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచైన Vivo V27 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo V27, Vivo V27 Pro, Vivo V27e
  • తాజాగా లీకైన Vivo V27 Pro ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

మిడ్-రేంజ్ Vivo V27 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు Vivo సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e. ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటివారంలో ఈ ఫోన్ల లాంచ్ ఉంటుంది. అయితే ఈలోపు Vivo V27 Pro భారతీయ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు లీకైయ్యాయి. Vivo V27 Pro రూ.41,999 ధరతో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో రానుందని తెలుస్తోంది.

భారత్ లో వివో వి27 ప్రో ధర, కలర్ మరియు స్టోరేజీ ఆప్షన్స్

PriceBaba వెలువరించిన కథనం ప్రకారం, Vivo V27 Pro రిటైల్ ప్రైస్ ట్యాగ్ రూ.41,999 గా ఉంది. దీన్ని బట్టి అసలు ధర రూ.40,000 గా ఉండనుందని అంచనా వేస్తున్నారు. అలాగే వివో కంపెనీ కూడా ఫోన్ పై పలు ఆఫర్లను అందించే అవకాశం ఉంది. దీంతో Vivo V27 Pro ధర మరింత తగ్గనుంది.

Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ డివైజ్ నోబుల్ బ్లాక్ మరియు మ్యాజిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు Vivo V27 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

వివో వి27 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 Pro ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ; రివీలైన డిజైన్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-flipkart-landing-page-official-look/ Tue, 14 Feb 2023 15:11:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4926 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. వరుసబెట్టి లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేసిన తర్వాత, ఎట్టకేలకు వివో నుంచి Vivo V27 అఫీషియల్ డిజైన్ బయటకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో Vivo V27 సేల్ కి రానుంది. తాజాగా ఇదే ఈ-కామర్స్ సైట్ లో Vivo V27 ల్యాండింగ్ పేజీ ప్రత్యక్షమైంది. దీంతో Vivo V27 యొక్క అఫీషియల్ అవతార్ […]

The post ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ
  • ల్యాండింగ్ పేజీ ద్వారా రివీల్ అయిన Vivo V27 అఫీషియల్ లుక్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. వరుసబెట్టి లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేసిన తర్వాత, ఎట్టకేలకు వివో నుంచి Vivo V27 అఫీషియల్ డిజైన్ బయటకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో Vivo V27 సేల్ కి రానుంది. తాజాగా ఇదే ఈ-కామర్స్ సైట్ లో Vivo V27 ల్యాండింగ్ పేజీ ప్రత్యక్షమైంది. దీంతో Vivo V27 యొక్క అఫీషియల్ అవతార్ బయటకు వచ్చినట్లైంది. సరే, పదండి, Vivo V27 విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

ఫ్లిప్ కార్ట్ లో కనిపిస్తోన్న పోస్టర్స్ ని బట్టి Vivo V27 Pro డివైజ్ గోల్డ్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. డెడికేటెడ్ రింగ్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై గమనించవచ్చు. ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, Vivo V27, Vivo V27 Pro డివైజెస్ కర్వ్డ్ డిస్ప్లేస్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. పోస్టర్స్ లో రియర్ పార్ట్ కర్వ్డ్ గా కనిపిస్తోంది.

Vivo V27 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 5G, V27 Pro 5G ధరలు https://www.91mobiles.com/telugu/vivo-v27-vivo-v27-pro-india-prices-leaked-before-launch/ Fri, 10 Feb 2023 13:43:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=4878 త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ లాంచ్ కానుంది. వివో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్లను భారత్ లో వచ్చే నెల ఆరంభంలో లాంచ్ చేయనుంది. అయితే వివో ఇంకా అధికారికంగా లాంచ్ వివరాలను వెల్లడించలేదు. Vivo V27 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో రానుందని సమాచారం. మరోవైపు Vivo V27 Pro 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చూస్తుంటే గత […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 5G, V27 Pro 5G ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 మార్చిలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో లాంచ్ కానున్న Vivo V27 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్న Vivo V27 Pro 5G

త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ లాంచ్ కానుంది. వివో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్లను భారత్ లో వచ్చే నెల ఆరంభంలో లాంచ్ చేయనుంది. అయితే వివో ఇంకా అధికారికంగా లాంచ్ వివరాలను వెల్లడించలేదు. Vivo V27 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో రానుందని సమాచారం. మరోవైపు Vivo V27 Pro 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

చూస్తుంటే గత మోడల్ అయిన వివో వీ25 తో పోల్చితే భారత్ లో Vivo V27 5G ధర పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు Vivo V27 Pro 5G కాస్త అధిక ధరతో లాంచ్ కానుందని సమాచారం. ఓసారి Vivo V27 సిరీస్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo V27 సిరీస్ ధరలు (లీక్డ్)

Vivo V27 సిరీస్ భారత్ లో మార్చి ఆరంభంలో లాంచ్ కానుంది. లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం.

Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం. రీసెంట్ గా Vivo V27 5G హ్యాండ్సెట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో ఇది మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు తెలుస్తోంది.

Vivo V27 సిరీస్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ప్రైమరీ కెమెరా సోని ఐఎంఎక్స్766 సెన్సర్ ని కలిగి ఉండనుంది. ఓఐఎస్ + ఈఐఎస్ స్టెబిలైజేషన్ కూడా ఉండనుందని సమాచారం. వీ-సిరీస్ లైనప్ లో ప్రపంచ వ్యాప్తంగా Vivo V27 4G, Vivo V27 5G, Vivo V27e 5G, Vivo V27 Pro 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి.

Vivo V27e 5G, Vivo V27 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించాయి. దీంతో ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. గ్లోబల్ వేరియంట్స్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానున్నాయి. ఇకపోతే Vivo V27 Pro 5G 8జిబి ర్యామ్ తో లిస్టింగ్ పై కనిపించింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 5G, V27 Pro 5G ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ చిప్సెట్స్, సోని కెమెరా సెన్సర్స్‌తో లాంచ్ కానున్న Vivo V27, Vivo V27 Pro (లీక్డ్) https://www.91mobiles.com/telugu/vivo-v27-series-specs-and-launch-timeline-tipped/ Thu, 02 Feb 2023 15:58:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=4769 త్వరలో Vivo V27 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం రెండు ఫోన్లు ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro. Vivo V25 మోడల్స్ కి Vivo V27 సిరీస్ సక్సెసర్ గా రానుంది. లాంచ్ అనౌన్స్‌మెంట్ కి ముందు 91మొబైల్స్ కి ఈ ఫోన్స్ కి సంబంధించిన ప్రధాన వివరాలు తెలిసాయి. కెమెరా మరియు పెర్ఫామెన్స్ విభాగాల్లో మేజర్ అప్‌గ్రేడ్స్ తో ఈ ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. […]

The post మీడియాటెక్ చిప్సెట్స్, సోని కెమెరా సెన్సర్స్‌తో లాంచ్ కానున్న Vivo V27, Vivo V27 Pro (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన Vivo V27 సిరీస్ స్పెసిఫికేషన్స్, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజెస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోన్న Vivo V27 Pro
  • లైనప్ లో వస్తోన్న Vivo V27, Vivo V27 Pro డివైజెస్. Vivo V27e కూడా లాంచ్ అయ్యే అవకాశం

త్వరలో Vivo V27 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం రెండు ఫోన్లు ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro. Vivo V25 మోడల్స్ కి Vivo V27 సిరీస్ సక్సెసర్ గా రానుంది. లాంచ్ అనౌన్స్‌మెంట్ కి ముందు 91మొబైల్స్ కి ఈ ఫోన్స్ కి సంబంధించిన ప్రధాన వివరాలు తెలిసాయి. కెమెరా మరియు పెర్ఫామెన్స్ విభాగాల్లో మేజర్ అప్‌గ్రేడ్స్ తో ఈ ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే, Vivo V25 ఫోన్లు, వివో వీ23 సిరీస్ తో పోల్చితే పెద్దగా మార్పులతో రాలేదు.

Vivo V27 కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు మాకు తెలిసింది. కేవలం ప్రో-మోడల్స్ మాత్రమే ఇప్పటి వరకు కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే, తొలిసారిగా స్టాండర్డ్ వేరియంట్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోందని చెప్పవచ్చు. Vivo V27 సిరీస్ ఫోన్లు హై-ఎండ్ సోని ప్రైమరీ కెమెరాలతో వస్తున్నట్లు సమాచారం. నైట్ ఫోటోగ్రఫీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి భారీ కెమెరా అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Vivo V27 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తోంది. అయితే, స్టాండర్డ్ వేరియంట్ కూడా ఇదే చిప్సెట్ తో వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. రెండు ఫోన్లు కూడా కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్స్ తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఫోన్లను మరింత ఆకర్షణీయంగా చేయనుంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ రహస్యంగానే ఉన్నాయి.

గత రిపోర్ట్స్ ప్రకారం, భారత్ లో Vivo V27 సిరీస్ ఫోన్లు ఫిబ్రవరి లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. అంటే త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రానుందన్నమాట. Vivo V27e అనే మరొక మోడల్ కూడా ఇదే ఏడాదిలో లాంచ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే Vivo V27 సిరీస్ ఆఫ్‌లైన్ స్టోర్స్ తో పాటు ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్స్ ద్వారా కూడా అమ్ముడు కానుంది.

త్వరలోనే Vivo V27 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. అలాగే Vivo V27e ఫోన్ కి సంబంధించి కూడా స్పష్టత రానుంది. ఒకేసారి మూడు మోడల్స్ లాంచ్ అవుతాయా? లేదంటే, తొలుత రెండు మోడల్స్ లాంచ్ అయ్యాక, మూడో మోడల్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తారా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ చిప్సెట్స్, సోని కెమెరా సెన్సర్స్‌తో లాంచ్ కానున్న Vivo V27, Vivo V27 Pro (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>