
మిడ్-రేంజ్ Vivo V27 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు Vivo సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e. ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటివారంలో ఈ ఫోన్ల లాంచ్ ఉంటుంది. అయితే ఈలోపు Vivo V27 Pro భారతీయ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు లీకైయ్యాయి. Vivo V27 Pro రూ.41,999 ధరతో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో రానుందని తెలుస్తోంది.
భారత్ లో వివో వి27 ప్రో ధర, కలర్ మరియు స్టోరేజీ ఆప్షన్స్
PriceBaba వెలువరించిన కథనం ప్రకారం, Vivo V27 Pro రిటైల్ ప్రైస్ ట్యాగ్ రూ.41,999 గా ఉంది. దీన్ని బట్టి అసలు ధర రూ.40,000 గా ఉండనుందని అంచనా వేస్తున్నారు. అలాగే వివో కంపెనీ కూడా ఫోన్ పై పలు ఆఫర్లను అందించే అవకాశం ఉంది. దీంతో Vivo V27 Pro ధర మరింత తగ్గనుంది.
Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ డివైజ్ నోబుల్ బ్లాక్ మరియు మ్యాజిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు Vivo V27 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
వివో వి27 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)
Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











