
త్వరలో Vivo V27 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం రెండు ఫోన్లు ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro. Vivo V25 మోడల్స్ కి Vivo V27 సిరీస్ సక్సెసర్ గా రానుంది. లాంచ్ అనౌన్స్‌మెంట్ కి ముందు 91మొబైల్స్ కి ఈ ఫోన్స్ కి సంబంధించిన ప్రధాన వివరాలు తెలిసాయి. కెమెరా మరియు పెర్ఫామెన్స్ విభాగాల్లో మేజర్ అప్‌గ్రేడ్స్ తో ఈ ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే, Vivo V25 ఫోన్లు, వివో వీ23 సిరీస్ తో పోల్చితే పెద్దగా మార్పులతో రాలేదు.
Vivo V27 కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు మాకు తెలిసింది. కేవలం ప్రో-మోడల్స్ మాత్రమే ఇప్పటి వరకు కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే, తొలిసారిగా స్టాండర్డ్ వేరియంట్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోందని చెప్పవచ్చు. Vivo V27 సిరీస్ ఫోన్లు హై-ఎండ్ సోని ప్రైమరీ కెమెరాలతో వస్తున్నట్లు సమాచారం. నైట్ ఫోటోగ్రఫీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి భారీ కెమెరా అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.
Vivo V27 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
Vivo V27 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తోంది. అయితే, స్టాండర్డ్ వేరియంట్ కూడా ఇదే చిప్సెట్ తో వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. రెండు ఫోన్లు కూడా కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్స్ తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఫోన్లను మరింత ఆకర్షణీయంగా చేయనుంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ రహస్యంగానే ఉన్నాయి.
గత రిపోర్ట్స్ ప్రకారం, భారత్ లో Vivo V27 సిరీస్ ఫోన్లు ఫిబ్రవరి లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. అంటే త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రానుందన్నమాట. Vivo V27e అనే మరొక మోడల్ కూడా ఇదే ఏడాదిలో లాంచ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే Vivo V27 సిరీస్ ఆఫ్‌లైన్ స్టోర్స్ తో పాటు ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్స్ ద్వారా కూడా అమ్ముడు కానుంది.
త్వరలోనే Vivo V27 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. అలాగే Vivo V27e ఫోన్ కి సంబంధించి కూడా స్పష్టత రానుంది. ఒకేసారి మూడు మోడల్స్ లాంచ్ అవుతాయా? లేదంటే, తొలుత రెండు మోడల్స్ లాంచ్ అయ్యాక, మూడో మోడల్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తారా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











