Vivo X90 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 11 Nov 2023 11:46:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/vivo-diwali-offers-discount-cashback-on-vivo-x90-v29-y200/ Wed, 08 Nov 2023 14:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8760 ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ […]

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • X90, V29 సిరీస్‌లపై దీపావళి ఆఫర్స్
  • నవంబర్ 15 వరకు అందుబాటులో డీల్స్
  • Vivo Y200 5G పై రూ.2,500 క్యాష్‌బ్యాక్

ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు

  • నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.
  • ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు Vivo X90 పై రూ.10,000 వరకు మరియు Vivo V29 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
  • నివేదికల ప్రకారం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.
  • ఈ పండుగ సీజన్ లో Vivo X మరియు Vivo V సిరీస్ ఫోన్లను ఈఎంఐ ద్వారా కనిష్టంగా రూ.101 తో కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా స్పెషల్ సేల్ లో భాగంగా Vivo వి-షీల్డ్ ప్లాన్స్ పై 40 శాతం డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • Vivo Y200 5G పై కస్టమర్లకు రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y56, Vivo Y27 డివైజెస్ పై కస్టమర్లు రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, వన్‌కార్డ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
  • కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను రిటైల్ స్టోర్స్ మరియు ఆథరైజ్డ్ పార్ట్నర్ స్టోర్స్ వద్ద పొందవచ్చు.

ఈ-కామర్స్ సంస్థ Flipkart బిగ్ దీవాళీ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎన్నో ఆసక్తికరమైన డీల్స్ కస్టమర్ల కోసం వచ్చాయి. Apple iPhone 14, Google Pixel 7a, Nothing Phone (2), Samsung Galaxy S21 FE 5G, Vivo T2 Pro 5G, Motorola Edge 40, OPPO Reno 10 5G, POCO F5 5G, POCO X5 Pro 5G, Redmi Note 12 Pro 5G, Realme 11 Pro 5G, Samsung Galaxy F14 5G తదితర ఫోన్లపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 12GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Vivo X90 5G https://www.91mobiles.com/telugu/vivo-x90-5g-launched-india-price-specs-availability/ Wed, 26 Apr 2023 11:45:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=6046 చైనా కంపెనీ వివో భారత్ లో Vivo X90 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo X90 5G గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, లభ్యత తదితర వివరాలు […]

The post 50MP కెమెరా, 12GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Vivo X90 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Vivo X90, Vivo X90 Pro
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన డివైజెస్
  • 120W ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ 9200 చిప్సెట్ తో వచ్చిన Vivo X90

చైనా కంపెనీ వివో భారత్ లో Vivo X90 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo X90 5G గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X90 5G ధర, సేల్ వివరాలు

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.59,999
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.63,999

హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.8,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా దొరుకుతుంది. ఇంకా 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కలదు. నేటి నుంచి ఫోన్ ని ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. మే 5 నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ మొదలవుతుంది.

Vivo X90 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్

ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇమ్మొర్టాలిస్ జీ715 గ్రాఫిక్స్ ని ఈ చిప్సెట్ తో జోడించారు.

ర్యామ్, స్టోరేజీ

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు.

కెమెరా విభాగం

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్, ఈఐఎస్ తో కూడిన 50ఎంపి ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన 12ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

Vivo X90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఓఎస్, కనెక్టివిటీ

Vivo X90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పన చేస్తుంది. ఈ డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, ఆప్ట్‌ఎక్స్ హెచ్డీ, హై-రెజ్ ఆడియో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50MP కెమెరా, 12GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Vivo X90 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/vivo-x90-series-india-launch-date-official/ Mon, 17 Apr 2023 14:07:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5917 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ Vivo X90 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత్ లో ఏప్రిల్ 26 న Vivo X90 సిరీస్ లాంచ్ కానుంది. ఎక్స్-సిరీస్ అనేది వివో సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ లైనప్. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పొట్రెయిట్ 2ఎక్స్ […]

The post ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 26 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ Vivo X90 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత్ లో ఏప్రిల్ 26 న Vivo X90 సిరీస్ లాంచ్ కానుంది. ఎక్స్-సిరీస్ అనేది వివో సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ లైనప్. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ సిరీస్ రానుంది.

Vivo X90 సిరీస్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ అనే మూడు మోడల్స్ ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం ప్లస్ వేరియంట్ ని లాంచ్ చేయడం లేదు.

భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ తేదీ

Vivo X90 సిరీస్ భారత్ లో ఏప్రిల్ 26 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. సిరీస్ లభ్యత, కచ్చితమైన ధర వివరాలు వచ్చే వారం లాంచ్ సందర్భంగా తెలియనున్నాయి.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo X90 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

మరోవైపు Vivo X90 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్

Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఉంటాయి.

ర్యామ్ మరియు స్టోరేజీ

Vivo X90 సిరీస్ లో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉండనున్నాయి.

కెమెరా

Vivo X90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్866 మెయిన్ ఓఐఎస్, ఈఐఎస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 12ఎంపి పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo X90 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్866 మెయిన్ ఓఐఎష్, ఈఐఎస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ మరియు సాఫ్ట్ వేర్

Vivo X90 డివైజ్ లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కనెక్టివిటీ

Vivo X90 సిరీస్ ఫోన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. ఇంకా రెండు ఫోన్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఆప్ట్ఎక్స్ హెచ్డీ, హై-రెజ్ ఆడియో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్, టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/vivo-x90-series-teased-by-company-india-launch-imminent/ Thu, 13 Apr 2023 11:19:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=5869 గత కొన్ని రోజులుగా Vivo X90 సిరీస్ కి సంబంధించిన లీక్స్ మరియు సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 26 న Vivo X90 Pro, Vivo X90 డివైజ్ లాంచ్ కానున్నాయని తాజాగా ఓ వార్త స్పష్టం చేసింది. అయితే వివో సంస్థ ఇంకా లాంచ్ ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈలోపు వివో తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Vivo X90 సిరీస్ ని టీజ్ చేసింది. దీంతో త్వరలోనే భారతీయ […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్, టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo X90, Vivo X90 Pro
  • భారత్ కంటే ముందే చైనా మరియు మలేషియాలో లాంచైన సిరీస్
  • తన వెబ్‌సైట్ లో Vivo X90 సిరీస్ ని లిస్ట్ చేసిన కంపెనీ

గత కొన్ని రోజులుగా Vivo X90 సిరీస్ కి సంబంధించిన లీక్స్ మరియు సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 26 న Vivo X90 Pro, Vivo X90 డివైజ్ లాంచ్ కానున్నాయని తాజాగా ఓ వార్త స్పష్టం చేసింది. అయితే వివో సంస్థ ఇంకా లాంచ్ ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈలోపు వివో తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Vivo X90 సిరీస్ ని టీజ్ చేసింది. దీంతో త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ కానుందని స్పష్టమైంది.

Vivo X90 సిరీస్ టీజర్ వీడియో చూడండి

Vivo X90 టీజర్ వీడియో లో కనిపిస్తోన్న విధంగా త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. వీడియో చివర్లో కూడా కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు. ఈ టీజర్ లో కొన్ని పిక్స్ తో పాటు, కొన్ని ముఖ్యమైన ఫీచర్లు కూడా రివీల్ అయ్యాయి.

భారత్ కంటే ముందే ఈ దేశాల్లో లాంచైన Vivo X90 సిరీస్

గతేడాది నవంబర్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ డివైజెస్ చైనాలో లాంచ్ అయ్యాయి. తర్వాత Vivo X90, Vivo X90 Pro ఫోన్లు ఫిబ్రవరిలో మలేషియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. Vivo X90, Vivo X90 Pro డివైజెస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు.

Vivo X90, Vivo X90 Pro ధర (అంచనా)

Vivo X90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా MYR 3699 (సుమారు రూ.70,000) ధరతో లాంచ్ అయ్యింది. మరోవైపు Vivo X90 Pro డివైజ్ MYR 4999 (సుమారు రూ.95,000) తో లాంచైంది. భారత్ లో కూడా ఈ ఫోన్ల ధరలు ఇదే విధంగా ఉంటాయని భావిస్తున్నారు.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే, చిప్సెట్

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్

Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఫీచర్ వంటివి ఉంటాయి.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. Vivo X90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. మరోవైపు Vivo X90 Pro ఒరిజిన్ఓఎస్ 3 పై పని చేస్తుంది. రెండు ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ సపోర్ట్ తో వస్తున్నాయి.

కెమెరా, బ్యాటరీ

  • 50ఎంపి ఐఎంఎక్స్989 సెన్సర్
  • 4870 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo X90 లో 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్ ఉంటాయి. మరోవైపు Vivo X90 Pro లో 50ఎంపి ఐఎంఎక్స్989 సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. రెండు ఫోన్లలో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ ఉంటాయి. Vivo X90 లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్లు కూడా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. Vivo X90 Pro లో 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్, టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 9200 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo X90, Vivo X90 Pro https://www.91mobiles.com/telugu/vivo-x90-vivo-x90-pro-globally-launched-price-specs/ Sat, 04 Feb 2023 16:11:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4784 2022 నవంబర్ లో చైనాలో లాంచైన Vivo X90 సిరీస్ తాజాగా గ్లోబల్ గా లాంచైంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు ఉన్నాయి. అవి: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+. అయితే Vivo X90 Pro+ మోడల్ మాత్రం చైనాకు మాత్రమే పరిమితం కానుంది. ఇక Vivo X90, Vivo X90 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్లు హై-గ్రేడ్ కెమెరాలు, ఫ్లాగ్షిప్ చిప్సెట్స్, అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీస్ […]

The post Dimensity 9200 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo X90, Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Vivo X90, Vivo X90 Pro
  • కొన్ని రోజుల పాటు చైనాకే పరిమితం కానున్న Vivo X90 Pro+ డివైజ్
  • Vivo X90 ప్రారంభ ధర MYR 3,699 (సుమారు రూ.70,000)

2022 నవంబర్ లో చైనాలో లాంచైన Vivo X90 సిరీస్ తాజాగా గ్లోబల్ గా లాంచైంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు ఉన్నాయి. అవి: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+. అయితే Vivo X90 Pro+ మోడల్ మాత్రం చైనాకు మాత్రమే పరిమితం కానుంది.

ఇక Vivo X90, Vivo X90 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్లు హై-గ్రేడ్ కెమెరాలు, ఫ్లాగ్షిప్ చిప్సెట్స్, అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీస్ తో వస్తోంది. రెండు డివైజెస్ కూడా వివిధ యూరోపియన్, ఏషియన్ మార్కెట్స్ తో పాటు ఇండియాలో కూడా లాంచ్ కానున్నాయి.

Vivo X90, Vivo X90 Pro ఫోన్లు అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, 50ఎంపి జీస్ ప్రైమరీ కెమెరాలు, డెడికేటెడ్ వీ2 చిప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. సరే, ఓసారి Vivo X90, Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ల యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90, Vivo X90 Pro ధరలు, లభ్యత

Vivo X90, Vivo X90 Pro స్మార్ట్ ఫోన్లు నేడు మలేషియాలో లాంచ్ అయ్యాయి. అయితే 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల సింగిల్ వేరియంట్ లో మాత్రమే వచ్చాయి. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. Vivo X90 ధర MYR 3,699 (సుమారు రూ.70,000) గా ఉంది. Vivo X90 Pro ధర MYR 4,999 (సుమారు రూ.95,000) గా ఉంది. Vivo X90 బ్రీజ్ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుండగా, Vivo X90 Pro డివైజ్ కేవలం లెజెండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుంది.

ముందుగా ఫోన్లను బుక్ చేసుకునే వారికి ఉచితంగా Vivo TWS Air ఇయర్ బడ్స్ తో పాటు, ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ లభించనుంది. ఈ ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా ఒక ఏడాది ఎక్స్‌టెండెడ్ ఫోన్ వ్యారంటీ, ఒక ఏడాది స్క్రీన్ క్రాక్ ప్రొటెక్షన్, ఒక ఏడాది బ్యాటరీ వ్యారంటీ లభించనుంది.

భారతదేశంలో Vivo X90, Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయిన తర్వాత ధరల వివరాలు తెలియనున్నాయి.

Vivo X90 స్పెసిఫికేషన్స్

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, హెచ్డీఆర్10+, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ ని కలిగి ఉంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి 4.0 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo X90 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 50ఎంపి సోని ఐఎంఎక్స్866 మెయిన్ సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ ఓఐఎస్ లెన్స్, 12ఎంపి 2x పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి.

Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ 2.0 పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4810mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ డ్యూయల్ సెల్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Vivo X90 డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.4 మిల్లీ మీటర్ల మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ+ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. వీ2 ఐఎస్పీ చిప్ తో ఈ ఫోన్ వస్తోంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo X90 Pro డివైజ్ లో 1-ఇంచ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్758 పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి కెమెరా ఇచ్చారు.

Vivo X90 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4870mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫ్లాష్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

Vivo X90 Pro డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.5 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.3 మిల్లీ మీటర్ల మందం, 214.85 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 9200 చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన Vivo X90, Vivo X90 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 3 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo X90, X90 Pro; లీకైన రిటైల్ బాక్స్ ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/vivo-x90-series-retail-box-leaked-before-launch/ Fri, 20 Jan 2023 06:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=4578 Vivo X90 సిరీస్ గతేడాది చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడింట్లో X90, X90 Pro ఫోన్లు మాత్రమే గ్లోబల్ గా లాంచ్ అవుతున్నాయి. Vivo X90 Pro సోని ఐఎంఎక్స్989 50ఎంపి 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. అయితే వివో సంస్థ Vivo X90 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఈలోపు […]

The post ఫిబ్రవరి 3 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo X90, X90 Pro; లీకైన రిటైల్ బాక్స్ ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo X90 సిరీస్ లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro డివైజెస్
  • డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90, Vivo X90 Pro
  • 1-inch కెమెరా సెన్సర్ Vivo X90 Pro ప్రత్యేకత

Vivo X90 సిరీస్ గతేడాది చైనాలో లాంచైంది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ మూడింట్లో X90, X90 Pro ఫోన్లు మాత్రమే గ్లోబల్ గా లాంచ్ అవుతున్నాయి. Vivo X90 Pro సోని ఐఎంఎక్స్989 50ఎంపి 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోంది. అయితే వివో సంస్థ Vivo X90 సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఈలోపు గ్లోబల్ లాంచ్ తేదీకి సంబంధించి ఒక కొత్త లీక్ బయటకు వచ్చింది.

ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని తాజాగా Vivo X90 సిరీస్ యొక్క రిటైల్ బాక్స్ ఇమేజెస్ ని షేర్ చేశాడు. దీని ప్రకారం, జనవరి 27 నుంచి ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఇంకా ఫిబ్రవరి 3 నుంచి వివిధ మార్కెట్స్ లో ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత్ లో ఈ ఫోన్ల లాంచ్ తేదీని వివో ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Vivo X90 స్పెసిఫికేషన్స్

Vivo X90 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. పంచ్-హోల్ తో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo X90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇది ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ని కలిగి ఉంది.

గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో Immortalis-G715 GPU వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ LPPDDR5 RAM, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీపై పని చేస్తుంది. Vivo X90 5G లో 50MP Sony IMX866 ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది F/1.75 అపర్చర్ కలిగి ఉంది. ఇంకా 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ (F/2.0), 12MP పొట్రెయిట్ లెన్స్ (F/1.98) తో కలిపి బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32MP (F/2.45) కెమెరా అందించారు.

Vivo X90 5G డ్యూయల్ మోడల్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్టీ సపోర్ట్ కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కొత్త తరం USB Type-C 3.2 Gen1 తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G715 GPU ని వాడారు. Vivo X90 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo X90 Pro లో 4,870 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ మరియు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Vivo X90 Pro లో 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ సెన్సర్ (2x ఆప్టికల్ జూమ్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Vivo X90 Pro లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 3 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Vivo X90, X90 Pro; లీకైన రిటైల్ బాక్స్ ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు https://www.91mobiles.com/telugu/vivo-x90-series-price-specs-launch-timeline/ Wed, 11 Jan 2023 12:15:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4433 హైలైట్స్ జనవరి 31 న మలేషియాలో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్ అదే రోజున Vivo X90 సిరీస్ ఫోన్లు భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90 సిరీస్ ఫోన్లు తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 ని చైనాలో లాంచ్ చేసిన వివో సంస్థ ఇప్పుడు ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందే […]

The post గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 31 న మలేషియాలో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
  • అదే రోజున Vivo X90 సిరీస్ ఫోన్లు భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తోన్న Vivo X90 సిరీస్ ఫోన్లు

తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 ని చైనాలో లాంచ్ చేసిన వివో సంస్థ ఇప్పుడు ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకన్నా ముందే Vivo X90 యొక్క ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

టిప్ స్టార్ పారస్ గుగ్లాని సౌజన్యంతో Newzonly.com వెలువరించిన రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ మలేషియన్ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే Vivo X90 Pro+ మాత్రం గ్లోబల్ గా లాంచ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈసారి కేవలం Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ మాత్రమే గ్లోబల్ గా ఎంట్రీ ఇవ్వనున్నాయట.

సరే ఓసారి, Vivo X90 సిరీస్ యొక్క ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo X90 ధర, కలర్ ఆప్షన్స్, స్టోరేజీ

రిపోర్ట్ ప్రకారం Vivo X90 యొక్క స్టాండర్ వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.69,170) గా ఉంటుందని, Vivo X90 Pro ధర 5,299 యువాన్లు (సుమారు రూ.98,975) ఉంటుందని సమాచారం. స్టాండర్డ్ మోడల్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: బ్రీజ్ బ్లూ మరియు ఆస్టరాయిడ్ బ్లాక్. మరోవైపు, Vivo X90 Pro లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్నాయి.

Vivo X90 లాంచ్ తేదీ, లభ్యత

ఒక రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ 2023 జనవరి 31 న మలేషియన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఇక ఫిబ్రవరి 2 నుంచి సేల్ ప్రారంభం కానుంది. జనవరి 31 వ తేదీనే భారత్ లో కూడా Vivo X90 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50+12+12 కెమెరా సెటప్ (వివో ఎక్స్90)
  • 50+50+12 కెమెరా సెటప్ (వివో ఎక్స్90 ప్రో)
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo X90 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ కెమెరా సెంట్రిక్ ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నాయి. Vivo X90 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉంటాయి. మరోవైపు Vivo X90 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా 32ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్నాయి.

Vivo X90 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో రానున్నాయి. వీటిలో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Vivo X90, Vivo X90 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-january-2023-india-samsung-vivo-iqoo-redmi-tecno/ Sat, 31 Dec 2022 08:31:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4267 హైలైట్స్ 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్ భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2 కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ […]

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 జనవరిలో చోటుచేసుకోనున్న దిగ్గజ కంపెనీల ఫోన్ లాంచెస్
  • భారత్ లో లాంచ్ కానున్న శాంసంగ్, ఐకూ, పోకో, వివో, టెక్నో కంపెనీల ఫోన్లు
  • లాంచ్ కానున్న ఫోన్లలో ప్రధానమైనవి: ఐకూ 11 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్, వివో ఎక్స్90, టెక్నో ఫాంటమ్ ఎక్స్2

కొత్త సంవత్సరం వస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు వెల్కమ్ చెప్పబోతున్నాయి. భారత్ లో 2023 నూతన సంవత్సరం లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చీ రావడంతోనే అంటే జనవరి 2023 లో కొన్ని దిగ్గజ కంపెనీల నుంచి ఫోన్ లాంచెస్ ని మనం చూడబోతున్నాం. iQOO 11, Redmi Note 12 సిరీస్, Samsung Galaxy F04, Poco C50, Vivo X90 సిరీస్, Tecno Phantom X2 ఫోన్లు జనవరిలో భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.

2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్

  • iQOO 11
  • Redmi Note 12 సిరీస్
  • Samsung Galaxy F04
  • Poco C50
  • Vivo X90 సిరీస్
  • Tecno Phantom X2

2023 జనవరి 10 న ఐకూ 11 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 11 తో పాటు ఐకూ 11 ప్రో ఉంటాయి. అయితే తొలుత ఐకూ 11 మాత్రమే వస్తోంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. విషయమేంటంటే ఐకూ 11 సిరీస్ చైనాలో 2022 డిసెంబర్ 8 న లాంచ్ అయ్యింది.

Redmi Note 12 సిరీస్

2023 జనవరి 5 న రెడ్మీ నోట్ 12 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో రెడ్మీ నోట్ 12 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. రెడ్మీ అభిమానులు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Samsung Galaxy F04

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి లో-బడ్జెట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 04 కొత్త సంవత్సరం మొదటి నెలలో భారత్ లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం ఉంది.

POCO C50

పోకో బ్రాండ్ భారత్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ సీ-సిరీస్ ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 జనవరి 3 న లాంచ్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.7,000 గా ఉండే అవకాశం ఉంది.

Moto Edge 40

మోటో ఎడ్జ్ 40 సిరీస్ 2023 జనవరిలో భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. భారత్ లో ఏ తేదీన లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Vivo X90 సిరీస్

వివో నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన వివో ఎక్స్90 చైనాలో ఈ ఏడాది లాంచ్ అయ్యింది. గ్లోబల్ ఈవెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే లీకైన పోస్టర్స్ ని బట్టి ఈ ఫోన్ 2023 జనవరి 31 న లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Tecno Phantom X2

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ భారత్ లో 2023 జనవరి నెలలో లాంచ్ కానుంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. జనవరి 2 నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవ్వనుండగా, జనవరి 9 నుంచి సేల్ ప్రారంభమవ్వనుంది.

OnePlus 11 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. అదే చైనాలో అయితే జనవరి 4 న లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన Vivo X90 5G: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x90-5g-launched-china-price-specs/ Wed, 23 Nov 2022 04:54:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=3596 హైలైట్స్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Vivo X90 సిరీస్ లైనప్ లో ఉన్న మోడల్స్: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన Vivo X90 సిరీస్ ఫోన్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ అనే […]

The post లాంచ్ అయిన Vivo X90 5G: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Vivo X90 సిరీస్
  • లైనప్ లో ఉన్న మోడల్స్: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+
  • హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన Vivo X90 సిరీస్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఈ మూడు వివో ఫోన్లు హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. పవర్ఫుల్ కెమెరా, పవర్ఫుల్ ర్యామ్, ఫాస్ట్ ప్రాసెసర్ ఈ ఫోన్లలో ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన Vivo X90 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Vivo X90 5G స్పెసిఫికేషన్స్

Vivo X90 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. పంచ్-హోల్ తో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ స్క్రీన్ 1200 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 115% కలర్ గేముత్ ని కలిగి ఉంది. భద్రత కోసం Vivo X90 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo X90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఇది ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇది 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన, 4ఎన్ఎం ఫాబ్రికేషన్స్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో Immortalis-G715 GPU వాడారు. ఈ స్మార్ట్ ఫోన్ LPPDDR5 RAM, UFS 4.0 స్టోరేజీ టెక్నాలజీపై పని చేస్తుంది.

Vivo X90 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo X90 5G లో 50MP Sony IMX866 ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది F/1.75 అపర్చర్ కలిగి ఉంది. ఇంకా 12MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ (F/2.0), 12MP పొట్రెయిట్ లెన్స్ (F/1.98) తో కలిపి బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32MP (F/2.45) కెమెరా అందించారు.

Vivo X90 5G డ్యూయల్ మోడల్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్టీ సపోర్ట్ కలిగి ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కొత్త తరం USB Type-C 3.2 Gen1 తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

Vivo X90 5G ధర

Vivo X90 5G స్మార్ట్ ఫోన్ యొక్క 4 వేరియంట్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. రెండోది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, మూడోది 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, నాల్గోది 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ కలిగి ఉంటాయి. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 8జిబి + 128జిబి మోడల్ ధర RMB 3699 (సుమారు రూ.42,400), 8జిబి + 256జిబి యూనిట్ ధర RMB 3,999 (సుమారు రూ.45,800), 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 4,999 (సుమారు రూ.57,200).

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ అయిన Vivo X90 5G: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo X90, X90 Pro, X90 Pro+ స్టోరేజీ, కలర్స్, ఇమేజెస్ https://www.91mobiles.com/telugu/vivo-x90-series-renders-colors-storage-details-leaked-before-launch/ Mon, 14 Nov 2022 05:39:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=3402 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్ ఈ లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ మోడల్స్ లాంచ్ కి ముందు లీకైన Vivo X90 సిరీస్ స్టోరేజీ ఆప్షన్స్, కలర్స్, రెండర్స్ Vivo త్వరలోనే చైనాలో Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ నవంబర్ 22 న ఎంట్రీ ఇవ్వనుంది. దీని తర్వాత గ్లోబల్ లాంచ్ ఉంటుంది. […]

The post లీకైన Vivo X90, X90 Pro, X90 Pro+ స్టోరేజీ, కలర్స్, ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్
  • ఈ లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ మోడల్స్
  • లాంచ్ కి ముందు లీకైన Vivo X90 సిరీస్ స్టోరేజీ ఆప్షన్స్, కలర్స్, రెండర్స్

Vivo త్వరలోనే చైనాలో Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ నవంబర్ 22 న ఎంట్రీ ఇవ్వనుంది. దీని తర్వాత గ్లోబల్ లాంచ్ ఉంటుంది. లాంచ్ కి ముందు Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ స్మార్ట్ ఫోన్స్ యొక్క ఇమేజెస్, మెమొరీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ లీక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే Vivo X90 Pro+ గీక్ బెంచ్ పై కనిపించడంతో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. తాజా లీక్ తో మరిన్ని విషయాలు తెలిసాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం పదండి.

Vivo X90 రెండర్స్, స్టోరేజీ ఆప్షన్స్

 

Vivo X90 లైనప్ యొక్క మెమొరీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ ని ఎక్స్‌క్లూజివ్ గా Pricebaba లీక్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం, స్టాండర్డ్ మోడల్ Vivo X90 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. ఈ డివైజ్ బ్లాక్, ఐస్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్స్ లో దొరుకుతుంది.

ఇక Vivo X90 Pro విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. ఈ డివైజ్ బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని సమాచారం.

చివరగా, Vivo X90 Pro+ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X90 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X90 Pro+ 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు సమాచారం. కెమెరా విషయానికి వస్తే, Vivo X90 Pro+ లో ఓఐఎస్ కలిగిన 50ఎంపి 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్, 48ఎంపి సోని ఐఎంఎక్స్598 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్578 పొట్రెయిట్ కెమెరా (ఓఐఎస్), 64ఎంపి ఒమ్నివిజన్ ఏవీ64ఏ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఇక బ్యాటరీ విభాగం చూస్తే, Vivo X90 Pro+ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X90 Pro+ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Vivo X90, X90 Pro, X90 Pro+ స్టోరేజీ, కలర్స్, ఇమేజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>