ఏప్రిల్ 26 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్, కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights

  • ఏప్రిల్ 26 వ తేదీన భారత్ లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
  • లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ Vivo X90 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత్ లో ఏప్రిల్ 26 న Vivo X90 సిరీస్ లాంచ్ కానుంది. ఎక్స్-సిరీస్ అనేది వివో సంస్థ యొక్క ఫ్లాగ్షిప్ లైనప్. ఈ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ సిరీస్ రానుంది.

Vivo X90 సిరీస్ లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ అనే మూడు మోడల్స్ ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం ప్లస్ వేరియంట్ ని లాంచ్ చేయడం లేదు.

భారత్ లో Vivo X90 సిరీస్ లాంచ్ తేదీ

Vivo X90 సిరీస్ భారత్ లో ఏప్రిల్ 26 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. సిరీస్ లభ్యత, కచ్చితమైన ధర వివరాలు వచ్చే వారం లాంచ్ సందర్భంగా తెలియనున్నాయి.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo X90 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

మరోవైపు Vivo X90 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్

Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఉంటాయి.

ర్యామ్ మరియు స్టోరేజీ

Vivo X90 సిరీస్ లో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉండనున్నాయి.

కెమెరా

Vivo X90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్866 మెయిన్ ఓఐఎస్, ఈఐఎస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 12ఎంపి పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo X90 Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్866 మెయిన్ ఓఐఎష్, ఈఐఎస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ మరియు సాఫ్ట్ వేర్

Vivo X90 డివైజ్ లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కనెక్టివిటీ

Vivo X90 సిరీస్ ఫోన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. ఇంకా రెండు ఫోన్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఆప్ట్ఎక్స్ హెచ్డీ, హై-రెజ్ ఆడియో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.