
చైనా కంపెనీ వివో భారత్ లో Vivo X90 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo X90 5G గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo X90 5G ధర, సేల్ వివరాలు
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.59,999
- 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.63,999
హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.8,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా దొరుకుతుంది. ఇంకా 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కలదు. నేటి నుంచి ఫోన్ ని ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. మే 5 నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ మొదలవుతుంది.
Vivo X90 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి.
ప్రాసెసర్
ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇమ్మొర్టాలిస్ జీ715 గ్రాఫిక్స్ ని ఈ చిప్సెట్ తో జోడించారు.
ర్యామ్, స్టోరేజీ
Vivo X90 స్మార్ట్ ఫోన్ లో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు.
కెమెరా విభాగం
Vivo X90 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్, ఈఐఎస్ తో కూడిన 50ఎంపి ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగిన 12ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్
Vivo X90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4810 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
ఓఎస్, కనెక్టివిటీ
Vivo X90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పన చేస్తుంది. ఈ డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, ఆప్ట్‌ఎక్స్ హెచ్డీ, హై-రెజ్ ఆడియో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











