Xiaomi 13T Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Sep 2023 18:09:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లైకా బ్రాండ్ కెమెరాలు, డైమెన్సిటీ చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13t-13t-pro-launched-globally-price-specs-availability/ Tue, 26 Sep 2023 18:09:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=8162 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా తన కొత్త స్మార్ట్ ఫోన్లు Xiaomi 13T మరియు Xiaomi 13T Pro లను లాంచ్ చేసింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఈవెంట్ లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లతో పాటు Xiaomi Band 8 కూడా లాంచ్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ ఫోన్లకు సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లైకా […]

The post లైకా బ్రాండ్ కెమెరాలు, డైమెన్సిటీ చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro
  • లైకా బ్రాండ్ కెమెరాలతో వచ్చిన డివైజెస్
  • Xiaomi 13T ధర 649 యూరోలు (సుమారు రూ.57,400)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi గ్లోబల్ గా తన కొత్త స్మార్ట్ ఫోన్లు Xiaomi 13T మరియు Xiaomi 13T Pro లను లాంచ్ చేసింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగిన ఈవెంట్ లో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లతో పాటు Xiaomi Band 8 కూడా లాంచ్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ ఫోన్లకు సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్ల తర్వాత Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లైకా బ్రాండ్ కెమెరాలతో ఈ సిరీస్ లాంచైంది.

రీసెంట్ గా చైనాలో లాంచైన Redmi K60 Ultra కి గ్లోబల్ వర్షన్ గా Xiaomi 13T Pro వచ్చినట్లు సమాచారం. అయితే షావోమి Xiaomi 13T Pro డివైజ్ ని మెరుగైన కెమెరాలు, డిజైన్ తో తీసుకొచ్చింది. సరే, ఓసారి Xiaomi 13T Pro, Xiaomi 13T డివైజెస్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13T, Xiaomi 13T Pro ధర, లభ్యత

Xiaomi 13T 649 యూరోలు (సుమారు రూ.57,400) తో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి + 256జిబి వేరియంట్ ధర. ఈ డివైజ్ మీడో గ్రీన్, బ్లాక్, ఆల్పైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దేశాన్ని బట్టి ధర మారుతుంది.

మరోవైపు Xiaomi 13T Pro 12జిబి + 256జిబి మోడల్ ధరను 799 యూరోలు (సుమారు రూ.70,700) గా నిర్ణయించారు. Xiaomi 13T Pro డివైజ్ మీడో గ్రీన్, ఆల్పైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. గ్లోబల్ గా Xiaomi 13T సిరీస్ లభ్యతను గురించి షావోమి నుంచి ఇంకా ప్రకటన రాలేదు.

Xiaomi 13T, Xiaomi 13T Pro డిజైన్

రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఒక తరహా డిజైన్ ని కలిగి ఉన్నాయి. ఈ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇంకా లైకా బ్రాండింగ్ ఉంది. మెరుగైన కెమెరా ఔట్‌పుట్ కోసం ఈ ఫోన్లలో షావోమి ఇమేజింగ్ ఇంజిన్ వాడారు.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 13T లో 6.67-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.
  • చిప్సెట్: Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్, మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Xiaomi 13T లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Xiaomi 13T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్ 707 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 లెన్స్ అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 13T లో 5జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5.0గిగాహెర్ట్జ్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్-బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 13T Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ క్రిస్టల్ రెజ్ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 446పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ వాడారు.
  • మెమొరీ: Xiaomi 13T Pro డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్ 707 ఓఐఎస్ లెన్స్, 50ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ50డీ టెలీఫోటో లెన్స్, 12ఎంపి ఒమ్నీవిజన్ ఓవీ13బి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 20ఎంపి సోని ఐఎంఎక్స్ 596 సెన్సర్ అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 13T Pro లో ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post లైకా బ్రాండ్ కెమెరాలు, డైమెన్సిటీ చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Xiaomi 13T, Xiaomi 13T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro డిజైన్ రెండర్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-13t-pro-renders-leaked-before-launch/ Sat, 19 Aug 2023 18:06:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=7660 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో 13T ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. అయితే ఇంకా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. కానీ, చాలా రోజులుగా Xiaomi 13T Pro సర్టిఫికేషన్ సైట్స్ మరియు లీక్స్ లో కనిపిస్తూనే ఉంది. తాజాగా Xiaomi 13T Pro యొక్క డిజైన్ రెండర్స్ ని MySmartPrice షేర్ చేసింది. […]

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13T Pro
  • లైకా ట్యూన్డ్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానున్న Xiaomi 13T Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో 13T ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. అయితే ఇంకా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. కానీ, చాలా రోజులుగా Xiaomi 13T Pro సర్టిఫికేషన్ సైట్స్ మరియు లీక్స్ లో కనిపిస్తూనే ఉంది. తాజాగా Xiaomi 13T Pro యొక్క డిజైన్ రెండర్స్ ని MySmartPrice షేర్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 13T Pro డిజైన్ రెండర్స్ (లీక్)

  • కొత్త రెండర్స్ ని బట్టి Xiaomi 13T Pro డిజైన్ ని చూస్తే, రీసెంట్ గా లాంచైన Redmi K60 Ultra మాదిరి ఉంది.
  • Xiaomi 13T Pro బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని పిక్స్ ద్వారా తెలుస్తోంది.
  • డిస్ప్లే గురించి మాట్లాడితే, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉంది.
  • బ్యాక్ ప్యానెల్ పై లైకా ట్యూన్డ్ కెమెరా సెటప్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
  • ఫోన్ కి కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ బాటమ్ లో ఉన్నాయి.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Xiaomi 13T Pro లో 6.67-ఇంచ్ క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • చిప్సెట్: Xiaomi 13T Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్ ఉంటుందని సమాచారం.
  • స్టోరేజీ: Xiaomi 13T Pro డివైజ్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి + 256జిబి, 12జిబి + 512జిబి, 16జిబి + 1టిబి.
  • కెమెరా: Xiaomi 13T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో లైకా ట్యూన్డ్ సెన్సర్స్ ఉంటాయి. అయితే ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా లెన్స్ ఉంటాయో ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 1 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 13T Pro (లీక్) https://www.91mobiles.com/telugu/xiaomi-13t-pro-global-launch-date-leaked/ Fri, 04 Aug 2023 04:28:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=7462 స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో 13T ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈలోగా గ్లోబల్ లాంచ్ వివరాలు వచ్చాయి. Xiaomi 13T Pro సెప్టెంబర్ 1 న గ్లోబల్ గా లాంచ్ కానుందని ఓ వార్త బయటకు వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13T Pro లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. లీకైన Xiaomi 13T Pro […]

The post సెప్టెంబర్ 1 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 13T Pro (లీక్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇంకా ఖరారు కాని భారత మార్కెట్ లాంచ్
  • డైమెన్సిటీ 9200+ చిప్‌తో వస్తోన్న డివైజ్
  • 16జిబి ర్యామ్ ని ఆఫర్ చేయనున్న హ్యాండ్సెట్

స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi త్వరలో 13T ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈలోగా గ్లోబల్ లాంచ్ వివరాలు వచ్చాయి. Xiaomi 13T Pro సెప్టెంబర్ 1 న గ్లోబల్ గా లాంచ్ కానుందని ఓ వార్త బయటకు వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13T Pro లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

లీకైన Xiaomi 13T Pro గ్లోబల్ లాంచ్ తేదీ

టెక్ సైట్ 4gnews Xiaomi 13T Pro ఫ్లాగ్షిప్ కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. అవేంటో క్రింద చూడండి.

  • సెప్టెంబర్ 1 న యూరప్ లో Xiaomi 13T Pro డివైజ్ ని షావోమి లాంచ్ చేయనుందని సమాచారం.
  • గ్లోబల్ గా Xiaomi 13T Pro డివైజ్ Redmi K60 Ultra కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోందని తెలుస్తోంది.
  • అయితే ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. దీంతో లీకైన సమాచారం ఎంతవరకు నిజమో చెప్పలేం.

Xiaomi 13T Pro ధర (లీక్)

రీసెంట్ గా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పొరబాటున Xiaomi 13T Pro ధర మరియు లభ్యత వివరాలను షేర్ చేసింది. Xiaomi 13T Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 799 యూరోలు (సుమారు రూ.84,272) ధర ఉంటుందని ఆ పోస్ట్ ద్వారా తెలిసింది. మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ లభించనుంది.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్ ఉంటుంది.
  • స్టోరేజీ: Xiaomi 13T Pro డివైజ్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 12జిబి + 256జిబి, 12జిబి + 512జిబి, 16జిబి + 1టిబి.
  • కెమెరా: Xiaomi 13T Pro డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post సెప్టెంబర్ 1 న గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 13T Pro (లీక్) first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-13t-pro-spotted-imda-certification-website-key-details/ Wed, 05 Jul 2023 08:32:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=7075 షావోమి సంస్థ రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్ లో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ చైనా కంపెనీ, ప్రస్తుతం షావోమి 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లపై పని చేస్తోంది. ఇటీవలె ఒక టిప్‌స్టర్ Xiaomi 13T Pro డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. అలాగే, కంపెనీ Xiaomi 13T సిరీస్ స్మార్ట్ ఫోన్ పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో Xiaomi 13T, […]

The post IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న షావోమి ‘టీ’ సిరీస్ ఫోన్
  • భారత్ లో కూడా లాంచ్ కానున్న డివైజ్
  • తాజాగా లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర

షావోమి సంస్థ రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్ లో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ చైనా కంపెనీ, ప్రస్తుతం షావోమి 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లపై పని చేస్తోంది. ఇటీవలె ఒక టిప్‌స్టర్ Xiaomi 13T Pro డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. అలాగే, కంపెనీ Xiaomi 13T సిరీస్ స్మార్ట్ ఫోన్ పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో Xiaomi 13T, Xiaomi 13T Pro మోడల్స్ మార్కెట్ లోకి ప్రవేశించనున్నాయి.

నెట్టింట్లో వస్తోన్న రూమర్లను బట్టి, Xiaomi 13T సిరీస్ స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ మార్కెట్స్ లో త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రో వేరియంట్ కొన్ని రోజుల క్రితం IMEI డేటాబేస్ పై కనిపించింది. ఒక టిప్‌స్టర్ ప్రకారం, షావోమి సంస్థ Xiaomi 13T సిరీస్ ని 2023 మూడో లేదా నాల్గో త్రైమాసికంలో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. తాజాగా Xiaomi 13T Pro డివైజ్ IMDA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది.

లీకైన Xiaomi 13T Pro ధర

ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. లిస్టింగ్ లో Xiaomi 13T Pro డివైజ్ 23078PND5G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. గతంలో ఇదే మోడల్ నంబర్ తో IMEI డేటాబేస్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ డివైజ్ బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వివరాలు లిస్టింగ్ ద్వారా తెలిసాయి.

Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ 12జిబి + 512జిబి వేరియంట్ ధర అమెజాన్ యూకే వెబ్ సైట్ పై 799 యూరోలు (సుమారు రూ.83,400) గా ఉంది. షావోమి సంస్థ 12జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని కూడా లాంచ్ చేయనుందని సమాచారం. మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో Xiaomi 13T Pro లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే లైకా భాగస్వామ్యం Xiaomi 13T సిరీస్ కి కూడా కొనసాగనుంది.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చిప్సెట్: Xiaomi 13T Pro డివైజ్ 4 నానోమీటర్ ప్రాసెసర్ తో రానుందని అమెజాన్ యూకే లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో రానుందని అంచనా వేస్తున్నారు.
  • డిస్ప్లే: Xiaomi 13T Pro లో క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని సమాచారం.
  • ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
  • చార్జింగ్: Xiaomi 13T Pro లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13T Pro లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.

Xiaomi 13T డివైజ్ స్పెసిఫికేషన్స్

Xiaomi 13T స్మార్ట్ ఫోన్ Xiaomi 13T Pro తో పాటు లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. స్టాండర్డ్ మోడల్ అయిన Xiaomi 13T లో మీడియాటెక్ డైమెన్సిటీ 4 ఎన్ఎం ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. ఇక 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 8జిబి + 256జిబి వేరియంట్ ధర 599 యూరోలు (సుమారు రూ.62,470) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

The post IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro ధర https://www.91mobiles.com/telugu/xiaomi-13t-pro-price-leaked-before-launch/ Sat, 01 Jul 2023 15:27:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7020 షావోమి సంస్థ త్వరలో 13T సిరీస్ ను గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయనుందని సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు Xiaomi 13T, Xiaomi 13T Pro మార్కెట్ లోకి ప్రవేశించనున్నాయి. షావోమి ఇంకా 13T సిరీస్ లాంచ్ తేదీపై స్పష్టతనివ్వలేదు. రిపోర్ట్స్ ప్రకారం, సెప్టెంబర్ 1 న యూరప్ మరియు ఇతర మార్కెట్స్ లో Xiaomi 13T సిరీస్ లాంచ్ కానుంది. అమెజాన్ రిటైలర్ యాక్సిడెంటల్ గా డివైజ్ ధరను రివీల్ చేయడం […]

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Xiaomi 13T Pro
  • మెరుగైన హార్డ్‌వేర్ తో రానున్న డివైజ్
  • ఇండియా లాంచ్ టైమ్‌లైన్ పై రాని క్లారిటీ

షావోమి సంస్థ త్వరలో 13T సిరీస్ ను గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయనుందని సమాచారం. ఈ లైనప్ లో రెండు ఫోన్లు Xiaomi 13T, Xiaomi 13T Pro మార్కెట్ లోకి ప్రవేశించనున్నాయి. షావోమి ఇంకా 13T సిరీస్ లాంచ్ తేదీపై స్పష్టతనివ్వలేదు. రిపోర్ట్స్ ప్రకారం, సెప్టెంబర్ 1 న యూరప్ మరియు ఇతర మార్కెట్స్ లో Xiaomi 13T సిరీస్ లాంచ్ కానుంది. అమెజాన్ రిటైలర్ యాక్సిడెంటల్ గా డివైజ్ ధరను రివీల్ చేయడం జరిగింది.

అంతేకాదు, లిస్టింగ్ ద్వారా Xiaomi 13T సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఓసారి Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

Xiaomi 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ (లీక్)

Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెజాన్ యూకే వెబ్ సైట్ లో లిస్ట్ అయిన ధర ప్రకారం, Xiaomi 13T Pro 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 799 యూరోలు (సుమారు రూ.82,900) గా ఉంటుందని సమాచారం. దీన్ని బట్టి Xiaomi 13T Pro ధర గత మోడల్ Xiaomi 12T Pro కంటే 100 యూరోలు ఎక్కువని తెలుస్తోంది. 12జిబి + 256జిబి వేరియంట్ కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

కలర్ ఆప్షన్స్

Xiaomi 13T Pro డివైజ్ మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభిస్తుందని లిస్టింగ్ పై ఉంది. Xiaomi 13T Pro డివైజ్ లైకా-ట్యూన్డ్ కెమెరాలతో రానుంది. లైకా ట్యూన్డ్ కెమెరాలతో వస్తోన్న తొలి నాన్-ఫ్లాగ్షిప్ ఫోన్ గా Xiaomi 13T Pro నిలనుంది.

  • బ్యాటరీ: Xiaomi 13T Pro లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు తెలిసాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డిస్ప్లే: ఈ ఫోన్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి.
  • చిప్సెట్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ వాడనున్నారు. Xiaomi 13T లో డైమెన్సిటీ చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T Pro ధర first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T, 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-13t-13t-pro-specs-price-leaked-before-launch/ Tue, 27 Jun 2023 12:22:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=6953 Xiaomi 13T, Xiaomi 13T Pro ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. Xiaomi 12T సిరీస్ కి సక్సెసర్ గా Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి రానుంది. Xiaomi 13T సిరీస్ లో వచ్చే రెండు ఫోన్లు కూడా సెప్టెంబర్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. టిప్‌స్టర్ Snoopytech Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ స్పెసిఫికేషన్స్, ధరను షేర్ చేశారు. Xiaomi 13T స్పెసిఫికేషన్స్ (లీక్) డిస్ప్లే: Xiaomi […]

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T, 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 13T సిరీస్
  • తాజాగా లీకైన Xiaomi 13T సిరీస్ స్పెసిఫికేషన్స్
  • లైకా లెన్స్ తో వస్తోన్న Xiaomi 13T సిరీస్ డివైజెస్

Xiaomi 13T, Xiaomi 13T Pro ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే లాంచ్ కానున్నాయి. Xiaomi 12T సిరీస్ కి సక్సెసర్ గా Xiaomi 13T సిరీస్ మార్కెట్ లోకి రానుంది. Xiaomi 13T సిరీస్ లో వచ్చే రెండు ఫోన్లు కూడా సెప్టెంబర్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. టిప్‌స్టర్ Snoopytech Xiaomi 13T, Xiaomi 13T Pro డివైజెస్ స్పెసిఫికేషన్స్, ధరను షేర్ చేశారు.

Xiaomi 13T స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Xiaomi 13T లో క్రిస్టల్‌రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T లో 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13T లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T స్మార్ట్ ఫోన్ లో ప్రముఖమైన లైకా లెన్స్ ని వాడనున్నట్లు తెలుస్తోంది.
  • బ్యాటరీ: Xiaomi 13T లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Xiaomi 13T Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Xiaomi 13T Pro డివైజ్ లో క్రిస్టలర్స్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 13T Pro స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 13T Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Xiaomi 13T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 13T Pro లో అత్యుత్తమమైన లైకా లెన్స్ ని వాడనున్నట్లు సమాచారం. అయితే, ఇతర కెమెరా లెన్సెస్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Xiaomi 13T Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడనున్నట్లు తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు సమాచారం.

లీకైన Xiaomi 13T, Xiaomi 13T Pro ధర

Xiaomi 13T సిరీస్ తొలుత గ్లోబల్ గా లాంచ్ కానుంది. తర్వాత భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. Xiaomi 13T ధర 500 యూరోలు (సుమారు రూ.62,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే Xiaomi 13T Pro డివైజ్ 799 యూరోలు (సుమారు రూ.83,000) ఉంటుందని సమాచారం.

కలర్ ఆప్షన్స్

Xiaomi 13T Pro డివైజ్ మీడో గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. Xiaomi 13T స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Xiaomi 13T, 13T Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>