హైలైట్స్:
- అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Xiaomi 12T సిరీస్
- జర్మనీలోని మ్యునిచ్ నగరంలో జరగనున్న లాంచ్ ఈవెంట్; సమయం – రాత్రి 7.30
- 200ఎంపి కెమెరాతో వస్తోన్న Xiaomi 12T Pro

ఎంఐ ఫ్యాన్స్ కి శుభవార్త. అక్టోబర్ 4 వ తారీఖున Xiaomi కంపెనీ షావోమీ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ లో Xiaomi 12T, 12T Pro ఫోన్లు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. Xiaomi 12T Pro 200 ఎంపి భారీ కెమెరాతో వస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Xiaomi 12T, 12T Pro ఫోన్ల లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇస్తున్నాం.
Xiaomi లాంచ్ ఈవెంట్
Xiaomi 12T, 12T Pro స్మార్ట్ ఫోన్స్ అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. మ్యూనిచ్ నగరంలో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈవెంట్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున రెడ్మీ బ్రాండ్ యొక్క మొదటి ట్యాబ్లెట్ Redmi Pad, Xiaomi Smart Band 7 Pro లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
Xiaomi 12T, 12T Pro స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Xiaomi 12T, 12T Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. Xiaomi 12T Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన చిప్సెట్ ఇదే. ఇకపోతే Xiaomi 12T స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో వస్తోంది.
Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్ 200ఎంపి కెమెరాతో లాంచ్ కానుందని అంచనా. రిపోర్ట్స్ ని బట్టి, ఇందులో శాంసంగ్ హెచ్పీ1 సెన్సర్ ని వాడినట్లు సమాచారం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉండనుంది. అలాగే రెండు డివైజెస్ లోనూ 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండనున్నాయి.
Xiaomi 12T లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉండనుంది. రెండు ఫోన్ల స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. షావోమీ 12టీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుండగా, షావోమీ 12టీ ప్రో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.
Xiaomi 12T స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో వస్తోంది. Xiaomi 12T Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. లాంచ్ రోజున ఈ రెండు ఫోన్ల యొక్క ధరల వివరాలు తెలుస్తాయి. కాంపిటీటివ్ ప్రైస్ తోనే షావోమీ ఈ ఫోన్లను తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











