గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Tecno Phantom V Flip 5G ధర, డిజైన్

Highlights

  • ఇంకా అనౌన్స్ కాని ఇండియా లాంచ్ తేదీ
  • అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip సేల్
  • భారత్ లో ధర రూ.50,000 ఉండే అవకాశం

స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Tecno Phantom V Flip ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 న గ్లోబల్ గా ఈ డివైజ్ విడుదల కానుంది. భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, గ్లోబల్ లాంచ్‌కి ముందు Tecno Phantom V Flip ఫోన్ యొక్క డిజైన్ మరియు ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Tecno Phantom V Flip ధర

  • MySmartPrice వెబ్‌సైట్ కథనం ప్రకారం, Tecno Phantom V Flip డివైజ్ 256జిబి స్టోరేజీ వేరియంట్ నైజీరియాలో NGN 5,49,000 (సుమారు రూ.58,773) ధరకి అమ్ముడవుతుందని తెలుస్తోంది.
  • రీసెంట్ రిపోర్ట్ ద్వారా, Tecno Phantom V Flip 5G భారత మార్కెట్ లో రూ.50,000 ఉంటుందని తెలిసింది. దేశంలో ఇదే చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ గా నిలవనుంది.
  • మరోవైపు, Tecno Phantom V Flip డివైజ్ ని NGN 1,00,000 (సుమారు రూ.10,705) చెల్లించి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని Tecno Mobile Nigeria ప్రకటన చేసింది.

Tecno Phantom V Flip డిజైన్ (అంచనా)

  • Tecno Phantom V Flip డివైజ్ డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తున్నట్లు లీకైన వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కనిపిస్తోంది.
  • కెమెరా మాడ్యూల్ కి పక్కన సెకండరీ డిస్ప్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకైతే, ఫోన్ యొక్క ఇతర డిజైన్ వివరాలు తెలియలేదు.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1.32-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉంటాయి.
  • చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేయనుంది.
  • ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో వై-ఫై, బ్లూటూత్ 5.3, 5జీ కనెక్టివిటీ ఉంటాయి.
  • కలర్స్: Tecno Phantom V Flip డివైజ్ మినిమల్ బ్లాక్, ఫిల్మ్ వైట్ మరియు పెరివింకిల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous article7.71-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో లాంచైన Honor V Purse
Next article12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.