
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno సెప్టెంబర్ నెలలో Tecno Phantom V Flip ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ గురించి ఇప్పటివరకు కంపెనీ నుంచి అధికార సమాచారం రాలేదు. తాజాగా Tecno Phantom V Flip డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క చిప్సెట్, స్టోరేజీ, డిస్ప్లే వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Tecno Phantom V Flip గూగుల్ ప్లే కన్సోల్ వివరాలు
- Tecno Phantom V Flip డివైజ్ ని గూగుల్ ప్లే కన్సోల్ పై తొలుత Pricebaba గుర్తించింది. కన్సోల్ లిస్టింగ్ పై 1080*2640 ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 480 పీపీఐ స్క్రీన్ డెన్సిటీ కనిపించాయి.
- Tecno Phantom V Flip డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ77 జీపీయూ తో వచ్చే అవకాశం ఉంది.
- Tecno Phantom V Flip డివైజ్ కనీసం 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)
టెక్నో కంపెనీ ఇప్పటివరకు Tecno Phantom V Flip గురించి ఏ వివరాలను వెల్లడించలేదు. అయితే రూమర్ల ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.
- స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.75-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంటుంది.
- రియర్ కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఔటర్ డిస్ప్లే పై 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది.
- సెల్ఫీ కెమెరా: Tecno Phantom V Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇన్నర్ డిస్ప్లే పై అందించారు.
- ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉండవచ్చు.
- బ్యాటరీ: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో బ్లూటూత్ 5.3, వై-ఫై, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.











