హైలైట్స్
- సెప్టెంబర్ 23 – 28 మధ్య భారత్ లో లాంచ్ అవుతోన్న Tecno POP 6 Pro, 91మొబైల్స్ కి అందిన ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్
- రూ.6,499 ధరతో సేల్ కి రానున్న Tecno POP 6 Pro
- ఇటీవలె టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఫోన్ ని లాంచ్ చేసిన టెక్నో కంపెనీ

నిన్న భారత మార్కెట్ లో టెక్నో కంపెనీ TECNO Camon 19 Pro Mondrian ఫోన్ ని రూ.17,000 ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ, లో-బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా ఓ ఫోన్ ని లాంచ్ చేయాలని భావిస్తోంది. Tecno POP 6 Pro అనే పేరుతో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు టెక్నో రెడీ అవుతోంది. Tecno POP 6 Pro లాంచ్ కి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందింది. Tecno POP 6 Pro భారత్ లో సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 28 మధ్య లాంచ్ అవ్వనుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.6,499 గా ఉండనుంది. ఇది ఆఫర్ ప్రైస్ అని అనుకోవచ్చు. కాబట్టి, లాంచ్ ప్రైస్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
Tecno POP 6 Pro ధర, లభ్యత
ఇప్పటి వరకు Tecno POP 6 Pro ఫోన్ లాంచ్ తేదీ, ధర కి సంబంధించి కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ శ్రేణిదని, ధర రూ.6,499 గా ఉంటుందని తెలుస్తోంది. టెక్నో ఇన్‌సైడర్ ద్వారా మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆఫర్ ధరలో ఈ ఫోన్ సేల్ కి వస్తుందని సమాచారం. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుంది. త్వరలో ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో Tecno POP 6 Pro సేల్ మొదలయ్యే అవకాశం ఉంది.
Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్
Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డాట్ నాచ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2.5డీ కవర్ గ్లాస్ ఇందులో ఉంటాయి. ఫోన్ డిస్ప్లే పై క్రింద భాగంలో వెడల్పాటి చిన్ ఉంటుంది. పోలార్ బ్లాక్, పీస్ఫుల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Tecno POP 6 Pro డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిలో 8ఎంపి ప్రైమరీ లెన్స్, మరొక సెకండరీ లెన్స్ ఉంటాయి. అలాగే డ్యూయల్ ఫ్లాష్ లైట్ ఇందులో అందిస్తున్నారు. ఇదే సెకండరీ ఏఐ లెన్స్ తో కలిసి పని చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అమర్చారు. ఇందులో ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఇవ్వడం విశేషం.
Tecno POP 6 Pro డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ తో వస్తోంది. ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. బాటమ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.












