హైలైట్స్
- Tecno Pova 3 ధరను తగ్గించిన టెక్నో కంపెనీ
- Tecno Pova 4 లాంచ్ తర్వాత పోవా 3 పై డిస్కౌంట్ ప్రకటన
- Tecno Pova 3 4జిబి + 64జిబి వేరియంట్ యొక్క డిస్కౌంట్ తర్వాత ధర రూ.9,999

భారత్ లో టెక్నో సంస్థ ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించింది. వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కోసం కొనాలని భావించే కస్టమర్లు టెక్నో ఫోన్ల వైపు చూస్తున్నారు. తాజాగా Tecno Pova 3 ఫోన్ పై సదరు కంపెనీ రూ.2,000 డిస్కౌంట్ ప్రకటించింది. పోవా 4 లాంచ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తాజా తగ్గింపుతో Tecno Pova 3 రూ.10,000 లోపు ధర ఉన్న ఉత్తమ ఫోన్ల జాబితాలో చేరిపోయింది.
Tecno Pova 3 ఒక బడ్జెట్ గేమింగ్ ఫోన్. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఓసారి Tecno Pova 3 యొక్క ప్రస్తుత ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
భారత్ లో Tecno Pova 3 ధర, లభ్యత
Tecno Pova 3 స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి వేరియంట్ రూ.11,999 ధరతో భారత్ లో లాంచైంది. అయితే తాజాగా తగ్గింపు నిర్ణయంతో ఈ ఫోన్ యొక్క 4జిబి+64జిబి మోడల్ ధర రూ.9,999 కి చేరింది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర కూడా రూ.2,000 తగ్గి ప్రస్తుతం రూ.10,999 కి చేరింది.
అమెజాన్ ద్వారా Tecno Pova 3 ని కొనుగోలు చేయవచ్చు.
Tecno Pova 3 స్పెసిఫికేషన్స్
Tecno Pova 3 స్మార్ట్‌ఫోన్ లో 6.9-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ నాచ్ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, మాలి జీ52 జీపీయూ ఈ ఫోన్ లో వాడారు. 6జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ లభిస్తుంది. Tecno Pova 3 డివైజ్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత హైఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Tecno Pova 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్ ఈ ఫోన్లో ఉన్నాయి.
Tecno Pova 3 మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: ఇకో బ్లాక్, టెక్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ. ఈ స్మార్ట్ ఫోన్ 173.1 మిల్లీ మీటర్ల పొడవు, 78.46 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.44 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











