రూ.12,999 ధరతో భారత్‌లో లాంచైన TECNO SPARK 10 5G

Highlights

  • స్పార్క్ సిరీస్ లో వచ్చిన 5జీ ఫోన్ TECNO SPARK 10
  • 10 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న TECNO SPARK 10
  • మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే అవకాశం

నేడు భారత్ లో TECNO SPARK 10 లాంచ్ అయ్యింది. మార్కెట్ లో ఈ ఫోన్ 50ఎంపి కెమెరా, 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్ (8జిబి ర్యామ్), మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచైంది. ఈ ఫోన్ భారత మార్కెట్ ధర రూ.12,999. స్పార్క్ సిరీస్ లో గత వారం TECNO SPARK 10 Pro రూ.12,499 తో లాంచైంది. సరే, ఓసారి TECNO SPARK 10 5జీ ఫోన్ యొక్క ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

TECNO SPARK 10 5G ధర

TECNO SPARK 10 5G ఫోన్ ప్రస్తుతం కేవలం ఒకే మెమొరీ వేరియంట్ లో లాంచైంది. ఈ స్మార్ట్ ఫోన్ 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ తో వచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లో 4జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఇచ్చారు. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది. ఏప్రిల్ 7 నుంచి TECNO SPARK 10 5G డివైజ్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ మెటా బ్లూ, మెటా వైట్, మెటా బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

TECNO SPARK 10 5G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

TECNO SPARK 10 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. డిస్ప్లే మూడు వైపులా బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

TECNO SPARK 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ వాడారు. ఇది 7-నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. 10 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. TECNO SPARK 10 5G లో మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా 4జిబి ఇంటర్నల్ ర్యామ్ కాకుండా, అదనంగా 4జిబి ర్యామ్ ని వాడుకోవచ్చు. అంటే యూజర్ కి మొత్తం 8జిబి ర్యామ్ లభిస్తుంది.

TECNO SPARK 10 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.