
గతేడాది చైనాలో Motorola X40 చైనాలో లాంచైంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన ఫోన్లలో ఒకటి. ఇప్పుడు, మోటోరోలా కంపెనీ ఈ ఫోన్ ని గ్లోబల్ మార్కెట్స్ కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గ్లోబల్ గా ఈ ఫోన్ Motorola Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ వేరియంట్ Motorola Edge 40 కూడా లాంచ్ కానుంది. ఇప్పుడు, Motorola Edge 40, Motorola Edge 40 Pro ఫోన్లకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. మైస్మార్ట్‌ప్రైస్ వెబ్ సైట్ వీటిని ప్రచురించింది.
మరొక కథనంలో 91మొబైల్స్ హిందీ Motorola Edge 40 Pro యొక్క హై-క్వాలిటీ రెండర్స్ ని షేర్ చేసింది. టిప్‌స్టర్ సుదాన్శు సౌజన్యంతో ఇది సాధ్యమైంది. ఇవి ఫోన్ యొక్క పూర్తి డిజైన్ ని రివీల్ చేసాయి.
Motorola Edge 40 Pro డిజైన్
Motorola Edge 40 Pro ఫోన్ కర్వ్డ్ స్క్రీన్ తో ప్రీమియమ్ లుక్ తో కనిపిస్తోంది. సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ని ఫోన్ కలిగి ఉంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. టాప్ లో స్పీకర్ గ్రిల్, సెకండరీ మైక్, డాల్బి అట్మాస్ బ్రాండింగ్ ఉన్నాయి. బాటమ్ లో సిమ్ ట్రే సెక్షన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మరొక స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై మూడు కెమెరా సెన్సర్స్ కోసం స్క్వేర్ షేప్డ్ మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే మోటో లోగోని కూడా మనం గమనించవచ్చు.
Motorola Edge 40 Pro స్పెసిఫికేషన్స్
రిపోర్ట్ ప్రకారం, Motorola Edge 40 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, కర్వ్డ్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 10 బిట్ కలర్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Motorola Edge 40 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
Motorola Edge 40 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి 2ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. 60ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ త్రీ-డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తోంది.
రిపోర్ట్ ప్రకారం, Motorola Edge 40 Pro డివైజ్ అల్యూమినియమ్ ఫ్రేమ్, ముందు, వెనకాల కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ తో వస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో అందించారు. అలాగే డాల్బి అట్మాస్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. ఈ హ్యాండ్సెట్ 161.16 మిల్లీ మీటర్ల పొడవు, 74 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.59 మిల్లీ మీటర్ల మందం ఉంటుందని అంచనా.
Motorola Edge 40 స్పెసిఫికేషన్స్
Motorola Edge 40 మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. Motorola Edge 40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. ఇంకా 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.
Motorola Edge 40 లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ తో వస్తోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ వీగన్ లెదర్, పీఎంఎంఏ అక్రిలిక్ తో వస్తున్నట్లు సమాచారం. Motorola Edge 40 డివైజ్ లునార్ బ్లూ, నెబులా గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్ మరియు మజెంటా కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











