
చవకైన ఫోన్లను అందించడంలో Tecno సంస్థ ముందుంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగిన ఫోన్లను అందిస్తూ తక్కువ సమయంలోనే జనాల్లో మంచి పేరుని సంపాదించింది టెక్నో బ్రాండ్. ఇటీవలె ఈ సంస్థ గ్లోబల్ గా Tecno Spark 20C ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 Pro+ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20 Pro+ బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్
- KJ7 మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Tecno Spark 20 Pro+ లిస్ట్ అయ్యింది.
- బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో Tecno Spark 20 Pro+ వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- ఇప్పటి వరకు టెక్నో నుంచి Spark సిరీస్ లో ప్రో మోడల్ మాత్రమే వచ్చింది. దీంతో Tecno Spark 20 Pro+ పై అంచనాలు పెరిగాయి.
Tecno Spark 20C స్పెసిఫికేషన్స్
టెక్నో సంస్థ రీసెంట్ గా Tecno Spark 20C ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. దాని స్పెసిఫికేషన్స్ ని ఈ క్రింద చెక్ చేయండి.
- డిస్ప్లే: Tecno Spark 20C లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20C లో ఎంట్రీ లెవెల్ ఆక్టా-కోర్ చిప్ వాడారు.
- స్టోరేజీ: Tecno Spark 20C లో 128జిబి స్టోరేజీ ఇచ్చారు.
- కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.












