
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో వస్తోన్న Tecno Spark 30 5G తాజాగా ఎఫ్‌సీసీ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క మోడల్ నంబర్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Tecno Spark 30 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు
Tecno Spark 30 5G డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై KL8 అనే మోడల్ నంబర్ మరియు 2ADYY-KL8 FCC ఐడీతో లిస్ట్ అయ్యింది.
Tecno Spark 30 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, 5జీ కనెక్టివిటీతో ఎఫ్‌సీసీ పై కనిపించింది.
ఎఫ్‌సీసీ ద్వారా ఫోన్ కి సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. రానున్న కొన్ని రోజుల్లో ఇతర సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
Tecno Spark 30 5G డిజైన్
ఎఫ్‌సీసీ ప్లాట్‌ఫామ్ పై Tecno Spark 30 5G యొక్క రెండర్ కనిపించింది. ఇమేజ్ను గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై స్క్విరికల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. స్క్వేర్ అయినప్పటికీ కర్వ్డ్ కార్నర్స్ ఉన్నాయి.
ఫోన్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 165 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 8 మి.మీ మందం ఉంటుంది.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Tecno Spark 20 లో 6.6-ఇంచ్ స్క్రీన్, హెచ్డీ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
చిప్సెట్: Tecno Spark 20 మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Tecno Spark 20 డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
కనెక్టివిటీ: Tecno Spark 20 డివైజ్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











