Xiaomi నుంచి 7500mAh బ్యాటరీ ఫోన్‌ లాంచ్ అయ్యే అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి

అధిక బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో ముఖ్యమైనవి. యూజర్లు తాము ఫోన్ కొనేటప్పుడు ఈ విషయాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తారు. అందుకే, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వీటిపై దృష్టిపెడతాయి. తాజాగా, Xiaomi కూడా అధిక కెపాసిటీ గల బ్యాటరీని పరీక్షించినట్లు సమాచారం. త్వరలో ఈ సంస్థ నుంచి 7500 ఎంఏహెచ్ బ్యాటరీ గల స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

7500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ త్వరలో విడుదల

షావోమి నుంచి త్వరలో 7500 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఫోన్ లాంచ్ కానుందని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టిప్‌స్టర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, షావోమి 5,500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500 ఎంఏహెచ్, 7000 ఎంఏహెచ్ మరియు 7500 ఎంఏహెచ్ బ్యాటరీలను, 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలతో పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ, షావోమి తాను జరుపుతోన్న టెస్టుల్లో విజయం సాధిస్తే, త్వరలోనే 7500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ గల స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న Redmi K70 Ultra, 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

ఇండియన్ మోడల్ Redmi Note 13 Pro Plus 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వచ్చింది.

ఎన్ని నిమిషాల్లో 7500 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జ్ అవుతుంది?

రిపోర్ట్ ప్రకారం, 7500 ఎంఏహెచ్ బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ చార్జర్ తో పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 63 నిమిషాల సమయం పడుతుందని తెలుస్తోంది.

7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు 40 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు 49 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు 30 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Source