8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Tecno Spark Go 2024

Highlights

  • మలేషియా వెబ్‌సైట్‌లో లిస్టైన Tecno Spark Go 2024
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Tecno Spark Go 2024
  • డైనమిక్ ఫీచర్ తో ఎక్విప్ అయిన స్పార్క్ గో 2024

ఎక్కువ శాతం చవక ఫోన్లను తయారు చేసే Tecno సంస్థ బడ్జెట్ కొనుగోలుదారుల కోసం మరొక కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. అదే Tecno Spark Go 2024. ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Tecno Spark Go 2024 డివైజ్ టెక్నో మలేషియా అధికార వెబ్ సైట్ లో స్పెసిఫికేషన్స్ తో సహా లిస్టైంది. Tecno Spark Go 2024 డివైజ్ 8జిబి ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.

Tecno Spark G0 2024 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark Go 2024 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark Go 2024 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark Go 2024 లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Tecno Spark Go 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందువైపు కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark Go 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark Go 2024 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark Go 2024 లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఓటీజీ, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

Tecno Spark Go 2024 ధర

  • కంపెనీ యొక్క మలేషియన్ అధికార వెబ్‌సైట్ లో Tecno Spark Go 2024 ధర లిస్ట్ కాలేదు.
  • Tecno Spark Go 2024 యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.6,999 గా ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
  • Tecno Spark Go 2024 డివైజ్ మిస్టరీ వైట్, ఆల్పెన్‌గ్లో గోల్డ్, మ్యాజిక్ స్కిన్ మరియు గ్రావిటీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.