90Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో లాంచైన Tecno SPARK GO 2024; ధర రూ.6,699

Highlights

  • భారత్‌లో లాంచైన Tecno SPARK GO 2024
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Tecno SPARK GO 2024 ధర రూ.6,699

Tecno సంస్థ Tecno SPARK GO 2024 స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ‘భారత్ కా అప్నా స్పార్క్’ అనే ట్యాగ్‌లైన్ తో కేవలం రూ.6,699 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Tecno SPARK GO 2024 డివైజ్ 90 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6జిబి వరకు ర్యామ్, 13ఎంపి మెగాపిక్సెల్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno SPARK GO 2024 ధర, లభ్యత వివరాలతో పాటు.. పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno SPARK GO 2024 ధర, లభ్యత

  • Tecno SPARK GO 2024 స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో లిస్ట్ అయ్యింది.
  • Tecno SPARK GO 2024 డివైజ్ 3జిబి ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్ (6జిబి ర్యామ్), 64జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • Tecno SPARK GO 2024 ప్రారంభ ధరను రూ.6,699 గా నిర్ణయించారు.
  • డిసెంబర్ 7 వ తేదీ నుంచి అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Tecno SPARK GO 2024 సేల్ ప్రారంభమవుతుంది.
  • Tecno SPARK GO 2024 డివైజ్ గ్రావిటీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • డిసెంబర్ 7 వ తేదీన Tecno SPARK GO 2024 యొక్క ఇతర మెమొరీ వేరియంట్స్ గురించి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Tecno SPARK GO 2024 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno SPARK GO 2024 లో 6.56-ఇంచ్ డాట్-ఇన్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పాండా స్క్రీన్ ప్రొటెక్షన్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno SPARK GO 2024 లో యూనిఎస్ఓసీ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno SPARK GO 2024 లో 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్లు 6జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno SPARK GO 2024 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Tecno SPARK GO 2024 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: Tecno SPARK GO 2024 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.