
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y28 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తక్కువ బడ్జెట్ లో వివో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి Vivo Y28 5G సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo Y28 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo Y28 5G ధర, లభ్యత
- Vivo Y28 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Vivo Y28 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు.
- Vivo Y28 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,499 గా ఉంది.
- Vivo Y28 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.
- Vivo Y28 5G డివైజ్ ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- ఎస్బీఐ, డీబీఎస్ మరియు ఐడీఎఫ్ఎస్ ఫస్ట్ బ్యాంక్ యూజర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1500 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
Vivo Y28 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ని ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
- బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ అందించారు.
- కనెక్టివిటీ: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.











