
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త 5జీ ఫోన్ తో రానుంది. 200ఎంపి కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రియల్మీ వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ టీజర్ కనిపిస్తోంది. అయితే ఈ ఫోన్ Realme 12 Pro Plus డివైజ్ అని అందరూ భావిస్తున్నారు. కంపెనీ నుంచి ఇంకా ఏ ప్రకటన రాలేదు. అయితే త్వరలో రాబోవు Realme 12 Pro సిరీస్ లో Realme 12 Pro Plus మరియు Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాయి.
Realme 12 Pro సిరీస్ టీజర్
- Realme 12 Pro సిరీస్ టీజర్ ఫ్లిప్‌కార్ట్ పైన ఒక మైక్రోసైట్ ద్వారా రివీల్ అయినట్లు ఒక రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ వివరాలను కొంత సమయం తర్వాత తొలగించడం జరిగింది.
- మీరు దానికి సంబంధించిన ఇమేజ్ ని చూడవచ్చు. ‘బియాండ్ 200ఎంపి, పెరిస్కోప్ అవెయిట్స్’ అని ట్యాగ్‌లైన్ ఉంది.
- టీజర్ లో రియల్మీ సంస్థ రెండు కెమెరా శాంపిల్స్ ని కూడా రిలీజ్ చేసింది. వీటిలో లో-లైట్ పొట్రెయిట్స్, ఫోన్ జూమ్ క్వాలిటీ కనిపిస్తున్నాయి.
- ప్రత్యేక ఆఫర్ లో భాగంగా, ఎవరైతే తమ వద్ద ఉన్న 200ఎంపి ఫోన్ ని ఇచ్చేసి Realme 12 Pro సిరీస్ ఫోన్ తీసుకుంటారో.. వారికి Realme Buds Air5 ఇయర్‌బడ్స్ ఉచితంగా లభించనున్నాయి. వీటి ధర రూ.3,699.
Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Realme 12 Pro లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 12 Pro లో ఆక్టాకోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసర్ పేరుని ఇంకా రివీల్ చేయలేదు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Realme 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కెపాసిటీ ఇంకా తెలియదు.
- కెమెరా: Realme 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Realme 12 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 12 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Realme 12 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)
- కెమెరా: Realme 12 Pro Plus లో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ సెన్సర్ ఉంటాయి. ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ప్రాసెసర్: Realme 12 Pro Plus లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
- బ్యాటరీ: Realme 12 Pro Plus లో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro Plus డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Realme 12 Pro Plus డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.












