
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ నెలలో ఈ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Vivo X100 Pro+, Vivo X100 Pro, Vivo X100. టాప్ వేరియంట్ Vivo X100 Pro+ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇతర రెండు మోడల్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్.. Vivo X100 సిరీస్ ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్ తో వస్తున్నట్లు తెలిపింది.
Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Vivo X100 Pro+
- వివో సంస్థ తన కొత్త ఫ్లాగ్షిప్ ని స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు ప్రకటించింది.
- అయితే వివో కంపెనీ ఫోన్ మోడల్ పేరుని తెలపలేదు. అయితే ఈ ఫోన్ Vivo X100 Pro+ అయ్యేందుకు ఎక్కువ చాన్సెస్ ఉన్నాయని భావిస్తున్నారు.
- అయితే Vivo X100 Pro+ డివైజ్ Vivo X100, Vivo X100 Pro ఫోన్లతో పాటు లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఈ టాప్ మోడల్ 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.
Vivo X100 Pro+ స్పెసిఫికేషన్స్ (రూమర్స్)
- డిస్ప్లే: Vivo X100 Pro+ లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ ఓఎల్ఈడీ క్వాడ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo X100 Pro+ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Vivo X100 Pro+ లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Vivo X100 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Vivo X100 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
- కెమెరా: Vivo X100 Pro+ లో 50ఎంపి ఐఎంఎక్స్989 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి ఐఎంఎక్స్598 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 టెలీఫోటో లెన్స్, 200ఎంపి 10x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Vivo X100 Pro+ లో ఐపీ68 వాటర్, డస్ట్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుంది.













