Home News లాంచ్ కి ముందు లీకైన Vivo T1x ధర, స్పెసిఫికేషన్స్

లాంచ్ కి ముందు లీకైన Vivo T1x ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

జులై 20 న భారత్ లో వీవో టీ1ఎక్స్ ను లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇక కంపెనీ ఈ ఫోన్ కి సంబంధించిన పలు ఫీచర్లను టీజ్ చేస్తూ వస్తోంది. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ 4-లేయర్ కూలింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఇక టీ-సిరీస్ లో టీ1ఎక్స్ కొత్త ఫోన్ గా జతచేరనుంది. ఇతర టీ-సిరీస్ ఫోన్స్ మాదిరిగానే టీ1ఎక్స్ డిజైన్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు లాంచ్ కు ముందు, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. 91మొబైల్స్ హిందీ, లీక్ స్టర్ యోగేశ్ బ్రార్ టీ1ఎక్స్ డిటైల్స్ ను వెలుగులోకి తీసుకు వచ్చారు.

వివో టీ1ఎక్స్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ టెండబుల్ ర్యామ్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ బడ్జెట్ శ్రేణి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినది. వివో తన వెబ్ సైట్ లో పెట్టిన టీజర్ ను బట్టి, ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుందని తెలుస్తోంది.

Vivo T1x ధర (అంచనా)

వివో టీ1ఎక్స్ 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,499 గా ఉండనుందని సమాచారం. స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే, ఈ ధర సరైనదేనని అనిపిస్తోంది. టిప్ స్టర్ ప్యాషనేట్ గీక్జ్ ట్వీట్ ని బట్టి, ఈ ఫోన్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో లభ్యం కానుందని తెలుస్తోంది.

మలేషియాలో వివో టీ1ఎక్స్ 4జిబి+64జిబి వేరియంట్ ధర MYR 649 (దాదాపు రూ.11,700) గా ఉంది. ఇక 8జిబి+128జిబి ధర MYR 799 (రూ.14,400) గా ఉంది. ఇక జులై 20 న 8జిబి+128జిబి వేరియంట్ కూడా భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Vivo T1x స్పెసిఫికేషన్స్

వివో టీ1ఎక్స్ లో 6.58-అంగుళాల ఫుల్ హెచ్డీ+ 2.5డీ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 రెజుల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి లేదా 128జిబి స్టోరేజీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ బరువు 200 గ్రాములు.

ఈ ఫోన్లో ఉన్న స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అన్ టు టు బెంచ్ మార్క్ అప్లికేషన్ పై 2,76000 స్కోర్ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఫోన్లో 4 లేయర్ కూలింగ్ సిస్టమ్ అందించారు. దీని ద్వారా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ కాకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది. మరి ఫోన్ లాంచ్ అయ్యాక ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుందో తెలిసే అవకాశముంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ కెమెరా విత్ నైట్ మోడ్, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి థర్డ్ సెన్సర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వివో ఎనర్జీ గార్డియన్ టెక్నాలజీ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఫోన్ యొక్క ఫీచర్లను బట్టి ఇది బడ్జెట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ఎల్సీడీ డిస్ప్లే ఉందన్న విషయం గమనించాలి. అయితే ధర, ఇతర ఫీచర్లను బట్టి చూస్తే, వివో టీ1ఎక్స్ వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ అని స్పష్టంగా తెలుస్తోంది.