
మీరు గనుక సన్నని డిజైన్ మరియు వేగవంతమైన పెర్ఫామెన్స్ కోరుకుంటే మీకు Vivo T3 Ultra బాగా సరిపోతుంది. అయితే రూ.33,999 ధరతో ఈ ఫోన్‌కి iQOO Neo 9 Pro నుంచి గట్టి పోటీ ఉంది. ఈ ఫోన్ లో కూడా క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది. గతేడాది లాంచైన ఫ్లాగ్షిప్స్ లో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ను ఐకూ లో వాడారు.
ఐకూ నియో 9 ప్రో 5జీ యొక్క 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.36,998 గా ఉంది. అంటే వివో టీ3 అల్ట్రా కంటే రూ.3,000 ఎక్కువ. రాబోవు సేల్స్ లో ఈ ధర మరింత తగ్గవచ్చు. అప్పుడు వివో టీ3 అల్ట్రాకి సమానంగా ఐకూ నియో 9 ప్రో 5జీ ధర కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండు ఫోన్లను పోల్చి, ఏ ఫోన్ శక్తివంతమైనదో తెలుసుకుందాం.
గీక్‌బెంచ్
గీక్‌బెంచ్ టెస్టులో వివో టీ3 అల్ట్రాపై, ఐకూ నియో 9 ప్రో 5జీ పైచేయి సాధించింది. అయితే స్కోర్ల మధ్య తేడా చాలా తక్కువగానే ఉంది. ఓసారి ఆ వివరాలను చూద్దాం.
గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్టులో ఐకూ నియో 9 ప్రో 5జీ 2023 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 5564 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, వివో టీ3 అల్ట్రా సింగిల్-కోర్ టెస్టులో 1854 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 5066 పాయింట్లు స్కోర్ చేసింది. ఫలితాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి పెర్ఫామెన్స్ లో తేడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ టెస్టు కోసం మేం రెండు ఫోన్ల యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ఉపయోగించాం.
విజేత: iQOO Neo 9 Pro
అంటుటు
అంటుటు టెస్టులో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కల్గిన ఐకూ నియో 9 ప్రో, డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ గల వివో టీ3 అల్ట్రా కంటే మంచి స్కోర్ చేసింది. అంటుటు అనేది జీపీయూ, మెమొరీ మరియు సీపీయూ పెర్ఫామెన్స్‌ను లోతైన పరీక్షలు జరిపి తెలుసుకుంటుంది.
అంటుటు టెస్టులో, స్కోర్లలో తేడాను గమనించవచ్చు. ఐకూ నియో 9 ప్రో బెటర్ పెర్ఫామెన్స్ అందిస్తుంది. అయితే వివో టీ3 అల్ట్రా (45డిగ్రీలు) తో పోల్చితే, ఐకూ నియో 9 ప్రో టెంపరేచర్ (46.2 డిగ్రీలు) కాస్త ఎక్కువగా ఉంది.
విజేత: iQOO Neo 9 Pro
సీపీయూ థ్రాటిల్
సీపీయూ థ్రాటిల్ టెస్టు కోసం మేం బర్నవుట్ యాప్ ను వినియోగించాం. ఈ టెస్టులో వివో టీ3 అల్ట్రా ఫోన్ బెటర్ పెర్ఫామెన్స్ చేసింది. పీక్ పెర్ఫామెన్స్ సమయంలో, వివో టీ3 అల్ట్రా బెటర్ స్టెబిలిటీ కలిగి ఉంటుందని ఈ టెస్టు ద్వారా రుజువైంది. అయితే ఇది రియల్ లైఫ్ కండీషన్స్ లో వేరుగా ఉంటుందని గమనించాలి.
| స్మార్ట్‌ఫోన్ | వివో టీ3 అల్ట్రా | ఐకూ నియో 9 ప్రో |
| సీపీయూ థ్రాటిల్ | 54.2% | 53.70% |
ఏదేమైనా ఈ టెస్టులో ఐకూ నియో 9 ప్రో పై, వివో టీ3 అల్ట్రా పైచేయి సాధించింది. థ్రాట్లింగ్ టెస్టులో వివో టీ3 అల్ట్రా స్కోర్ 54.2 శాతం ఉండగా, ఐకూ నియో 9 ప్రో 53.70 శాతం స్కోర్ చేసింది.
విజేత: Vivo T3 Ultra
గేమింగ్
గేమింగ్ టెస్టు కోసం మేం ఐకూ నియో 9 ప్రో మరియు వివో టీ3 అల్ట్రా ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టాం. ఈ రెండు ఫోన్లో మేం బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లను ఒక్కో దానిలో 30 నిమిషాల పాటు గేమ్ ఆడాం.
బీజీఎంఐ గేమ్‌ని 30 నిమిషాల ఆడిన తర్వాత, వివో టీ3 అల్ట్రా టెంపరేచర్ 6.7 శాతం పెరిగింది. మరోవైపు, ఐకూ నియో 9 ప్రో యొక్క టెంపరేచర్ 6.5 డిగ్రీలు పెరిగింది. రెండింటి మధ్య పెద్దగా తేడా లేదనిపిస్తోంది.
30 నిమిషాల పాటు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాక, వివో టీ3 అల్ట్రా టెంపరేచర్ 5.6 డిగ్రీలు పెరగగా, ఐకూ నియో 9 ప్రో టెంపరేచర్ 6.2 డిగ్రీలు పెరిగింది. టీ3 అల్ట్రా లో నిజజీవిత పరిస్థితుల్లో హీట్ మేనేజ్మెంట్ బాగుందని దీని ద్వారా రుజువైంది.
| గేమింగ్ | వివో టీ3 అల్ట్రా | ఐకూ నియో 9 ప్రో |
| బీజీఎంఐ | 6.7 డిగ్రీల సెల్సియస్ | 6.5 డిగ్రీల సెల్సియస్ |
| కాల్ ఆఫ్ డ్యూటీ | 5.6 డిగ్రీల సెల్సియస్ | 6.2 డిగ్రీల సెల్సియస్ |
ఇతర రియల్-లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది రెండు ఫోన్లలో ఒకే విధంగా ఉంది. అయితే టీ3 అల్ట్రాలో కర్వ్డ్ డిస్ప్లే ఉండగా, నియో 9 ప్రో లో ఫ్లాట్ స్క్రీన్ ఉంది. టీ3 అల్ట్రా లోని కర్వ్డ్ డిస్ప్లే వల్లన గేమింగ్ టెస్టు సమయంలో కొన్ని మిస్‌టచెస్‌ను మేం గమనించాం.
హై-ఇంటెన్సిటీ పెర్ఫామెన్స్ విషయంలో రెండు ఫోన్లు సమానంగా ఉన్నాయి. అయితే హీట్ మేనేజ్మెంట్ పరంగా వివో టీ3 అల్ట్రాదే పైచేయి.
విజేత: Vivo T3 Ultra
ఏది బెటర్?
మేం జరిపిన టెస్టుల ప్రకారం, Vivo T3 Ultra మరియు iQOO Neo 9 Pro ఫోన్లు సమానంగా నిలిచాయి. కాబట్టి, గేమింగ్ కోసమే ఫోన్ కావాలంటే రెండూ కూడా బాగుంటాయి.
గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐకూ నియో 9 ప్రో ఎక్కువ సంఖ్యలో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ (57) తో వస్తుంది. అదే, వివో టీ3 అల్ట్రా (47) ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ తో వస్తుంది. ఇక్కడ వివో టీ3 అల్ట్రా తక్కువ బ్లోట్‌వేర్ కలిగి ఉందని తెలుస్తోంది. అయితే, వివో టీ3 అల్ట్రాకి రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభించనుండగా, ఐకూ నియో 9 ప్రో కి 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి. ఇక్కడ ఐకూ నియో 9 ప్రో పైచేయి సాధించింది.