హైలైట్స్:
- ఆగస్టు 17 న లాంచ్ అవుతోన్న వివో వీ25 ప్రో
- ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్, వివో స్టోర్స్ ద్వారా అమ్ముడవ్వనున్న హ్యాండ్సెట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 1300, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వివో వీ25 ప్రో ప్రధాన ఫీచర్లు
‘వి’ సిరీస్ ఫోన్ వివో వీ25 ప్రో లాంచ్ తేదీని వివో ప్రకటించింది. చాలా రోజుల పాటు కొనసాగిన ఊహాగానాల తర్వాత వివో వీ25 ప్రో భారత గడ్డపై అడుగు పెడుతోంది. ఆగస్టు 17 న మధ్యాహ్నం 12 గంటలకు వివో వీ25 ప్రో లాంచ్ అవుతోంది. ఇదే నెలలో ఈ ఫోన్ ని సేల్ కి తీసుకొచ్చే అవకాశముంది. వివో వీ25 ప్రో కి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ని ట్విట్టర్ లో వివో పోస్ట్ చేసింది. రియర్ ప్యానెల్ యొక్క కలర్ చేంజింగ్ ఫీచర్ ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆన్‌లైన్ లభ్యతకు సంబంధించిన డెడికేటెడ్ వెబ్ పేజీ ఒకటి ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోంది.
భారత్ లో Vivo V25 Pro ధర (అంచనా)
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ తో పాటు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా లభించనుంది. గతంలో కూడా వివో స్మార్ట్ ఫోన్స్ ఈ విధంగా సేల్ కి వచ్చాయి. ఈసారి వివో ఫ్లిప్ కార్ట్ ని తన ఆన్ లైన్ పార్ట్‌నర్ గా ఎంచుకుంది. లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, వీ23 ప్రో కంటే కాస్త మెరుగైన ఫీచర్లను వీ25 ప్రో కలిగి ఉందని తెలుస్తోంది. ఇక ఫోన్ రెండు మెమొరీ చాయిసెస్ ను కలిగి ఉంటుందని సమాచారం. ఫోన్ ధర భారత్ లో రూ.40,000 లోపు నుంచి ప్రారంభమవుతుందని అంచనా.
Vivo V25 Pro స్పెసిఫికేషన్స్ (రూమర్ల ప్రకారం)
రూమర్లను బట్టి వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించిన లిస్టింగ్ ప్రకారం, వివో వీ25 ప్రో లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ను వినియోగించినట్లు సమాచారం. వీ23 ప్రో లో ఉపయోగించిన డైమెన్సిటీ 1200 తో పోలిస్తే కాస్త మెరుగైన చిప్సెట్ ను ఇందులో వాడారు. 8జిబి+128జిబి, 12జిబి+256జిబి వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుందని తెలుస్తోంది.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వివో వీ25 ప్రో ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా (ఓఐఎస్, ఈఐఎస్), ఆగ్జిలరీ సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు వైపున 32ఎంపి కెమెరాను అమర్చారు.
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. దాంతో పాటు ఏఐ సెల్ఫీలు, సూపర్ నైట్ మోడ్, కలర్-చేంజింగ్ ఏజీ గ్లాస్ బ్యాక్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్‌సైట్ ని విజిట్ చేయండి.