హైలైట్స్:
- నెట్టింట్లో ప్రత్యక్షమైన వివో వీ25 సిరీస్ మార్కెటింగ్ ఇమేజెస్
- రివీల్ అయిన వివో వీ25 ప్రో 5జీ, వీ25 5జీ, వీ25ఈ ఫోన్ల యొక్క డిజైన్స్
- ఆగస్టు 17 న భారత్ లో లాంచ్ అవుతోన్న వివో వీ25 సిరీస్
గత కొన్ని వారాలుగా వివో వీ25 సిరీస్ గురించి చాలా వింటూ వస్తున్నాం. ఎందుకంటే, వివో కంపెనీ తన వీ-సిరీస్ ఫోన్లను భారత్ తో పాటు, థాయిలాండ్ మార్కెట్స్ లో లాంచ్ చేస్తోంది. భారత్ లో వివో వీ25 ప్రో 5జీ ఆగస్టు 17 న బుధవారం నాడు లాంచ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ లైనప్ లో వీ25 5జీ, వీ25ఈ 4జీ ఫోన్స్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలి రోజుల్లో ఈ ఫోన్స్ కి సంబంధించిన లైవ్ ఇమేజెస్, ఇతర ఎన్నో లీక్స్ ని మనం చూశాం. ఇప్పుడు 91మొబైల్స్ ఈ మూడు ఫోన్స్ యొక్క మార్కెటింగ్ ఇమేజెస్ ని లాంచ్ కన్నా ముందే మీ ముందుకు తీసుకువచ్చింది.
ప్రముఖ టిప్ స్టర్ పారస్ గుగ్లాని, వీ25 సిరీస్ ఫోన్ల మార్కెటింగ్ ఇమేజెస్ ని రివీల్ చేశాడు. ఇందులో ప్రతి ఫోన్ యొక్క డిజైన్స్, కొన్నింటి స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు కూడా బయటకు వచ్చాయి.
Vivo V25 సిరీస్ మార్కెటింగ్ ఇమేజెస్
రాబోవు ఫిఫా వరల్డ్ కప్ ఖతర్ 2022 కు గాను వివో వీ25 సిరీస్ అధికార స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఈ పార్ట్‌నర్షిప్ వివరాలు మార్కెటింగ్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. ఇదివరకు అనుకున్నట్లుగా, వీ25 ప్రో 5జీ, వీ25 5జీ, వీ25ఈ 4జీ స్మార్ట్ ఫోన్స్ ఈ లైనప్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశిస్తోంది. కానీ, మిగతా రెండు మోడల్స్ భారత్ కి వస్తాయా లేదా అన్నది ఇంకా తెలియదు.
మొదటి మార్కెటింగ్ ఇమేజ్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, మూడు ఫోన్స్ కూడా రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్స్ కలిగి వెనకాల నుంచి ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ప్రో మోడల్ కర్వ్డ్ ఎడ్జెస్ కలిగి ఉండగా, వీ25 5జీ, వీ25ఈ ఫోన్స్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
వివో వీ25 5జీ, వీ25 ప్రో 5జీ ల యొక్క ప్రధాన ఫీచర్లను రెండో మార్కెటింగ్ ఇమేజ్ రివీల్ చేస్తోంది. వీ25 5జీ ఫోన్ లో 64ఎంపి ఓఐఎస్ అల్ట్రా సెన్సింగ్ ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్, 50ఎంపి ఐ-ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
వివో వీ25 ప్రో 5జీ కూడా 64ఎంపి ఓఐఎస్ అల్ట్రా-సెన్సింగ్ ప్రైమరీ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 8జిబి వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4830 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.
భారత్ లో వివో వీ25 ప్రో 5జీ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, అమ్మకానికి వచ్చే తేదీ ఆగస్టు 17 న లాంచ్ ఈవెంట్ లో వెల్లడి కానున్నాయి. అలాగే మిగతా రెండు మోడల్స్ కి సంబంధించిన వివరాలు కూడా రేపు తెలిసే అవకాశముంది.