Vivo V29, V29 Pro ఇండియా లాంచ్ ఖరారు, కొత్త టీజర్‌ని విడుదల చేసిన కంపెనీ!

Highlights

  • అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Vivo V29 సిరీస్
  • 3డీ పార్టికల్ డిజైన్ తో వస్తోన్న డివైజెస్
  • ఆరాలైట్, ఓఐఎస్ టెక్నాలజీతో ఎక్విప్ ఐన సిరీస్

Vivo ఎట్టకేలకు Vivo V29 సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికార సమాచారం అందించింది. ఈ లైనప్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ ఫోన్లు అక్టోబర్ 4 న లాంచ్ అవుతాయని సమాచారం. లాంచ్ తేదీ ఇంకా ధృవీకరించబడనప్పటికీ, కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించిన టీజర్‌లో, 4వ తేదీ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ రోజునే ఈ మొబైల్ ఫోన్‌లను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. డిజైన్‌తో సహా అంచనా స్పెసిఫికేషన్‌లను మీకు ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నాం. పూర్తిగా చదివి తెలుసుకోండి.

Vivo V29 సిరీస్ లాంచ్ టీజర్

  • Vivo V29 సిరీస్ టీజర్‌ను Vivo అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
    ఈ లైనప్ లో వచ్చే డివైజెస్ అక్టోబర్ 4న అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
  • అక్టోబరు 4న కలుద్దామని కంపెనీ తన టీజర్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీంతో అదే రోజున లాంచ్ ఉంటుందని తెలుస్తోంది.
  • మైక్రోసైట్‌లో డిజైన్, కొలతలు, కలర్ ఆప్షన్స్ మరియు కెమెరా వివరాలను కూడా కంపెనీ పేర్కొంది.

Vivo V29 సిరీస్ డిజైన్

  • Vivo యొక్క కొత్త V29 సిరీస్ ఫోన్‌లు 3D పార్టికల్ డిజైన్‌తో వస్తుండటం విశేషం. డివైజ్ యొక్క ఛాసిస్ కొలతలు 7.46 మిమీ మరియు బరువు 186 గ్రాములుగా చెప్పబడింది.
  • ఇప్పుడు కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు Vivo ఫోన్‌లు హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్ మరియు స్పేస్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • ఆరా లైట్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బ్రాండింగ్ ఉన్న ఫోన్ వెనుక ప్యానెల్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది.
  • డివైజ్ లో వెనుక కెమెరా మరియు ఆరా లైట్‌తో కూడిన LED ఫ్లాష్ కూడా ఉన్నాయి. Vivo బ్రాండింగ్ దిగువన కనిపిస్తుంది.
  • ఫోన్ ముందు వైపు గురించి మాట్లాడితే, డివైజ్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
  • మొత్తంమీద ఫోన్‌లు చాలా ప్రీమియం మరియు కూల్ లుక్‌ను అందిస్తాయి.

Vivo V29 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Vivo V29 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 642ఎల్ జీపీయూ వాడారు. ఇంకా వీసీ బయోనిక్ కూలింగ్ సిస్టమ్ ని గ్రాఫిక్స్ కోసం వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo V29 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous article12GB ర్యామ్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Motorola Edge 40 Neo
Next articleలీకైన రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy A15 డిజైన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.