
ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వివో త్వరలో భారత్ లో Vivo V29 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు నెల మూడో వారంలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఈ లైనప్ లో భాగమైన Vivo V29e డివైజ్ గీక్ బెంచ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఐఎమ్ఈఐ వంటి సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది.
తాజాగా Vivo V29e యొక్క ఫోటో 91మొబైల్స్ కి అందింది. ఈ పిక్ ని ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ పంచుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, Vivo V29e డివైజ్ Vivo V29 సిరీస్ లో మొదటగా భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Vivo V29e స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V29e స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V29e డివైజ్ లో 3డీ కర్వ్డ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్ యూనిక్ డిజైన్ తో వస్తోంది. గ్లాస్ ఫినిషింగ్, కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V29e డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ తో రానుంది. భారత్ లో 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో లభించనుంది.
- చిప్సెట్: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్ ఉండే అవకాశం ఉంది.
- బ్యాటరీ: Vivo V29e లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo V29e స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ ఉండనుంది.
Vivo V29e లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
Vivo V29e స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లో ఈ నెల ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల రెండో వారం లేదా మూడో వారంలో ఫోన్ ప్రమోషన్లు మొదలయ్యే చాన్స్ ఉంది. అలాగే Vivo V29e ఫోన్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా కంపెనీ నుంచి వస్తుందని ఆశించవచ్చు.











