
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y03 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. చైనాతో పాటు భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించి వివో నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా Vivo Y03 డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ మరియు సర్టిఫికేషన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y03 ఎన్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు
- Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఎన్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2332 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Vivo Y03 డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Vivo Y03 ఫోన్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎన్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.
- Vivo Y03 డివైజ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 1టిబి ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌టర్నల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Vivo Y03 డివైజ్ ఎన్‌సీసీ లిస్టింగ్ పై మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
- ఇటీవలె బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y03 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 392 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 1304 పాయింట్లు నమోదు చేసింది.
Vivo Y02 ధర
Vivo Y02 డివైజ్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. Vivo Y02 ధర భారతీయ మార్కెట్ లో రూ.6,999 గా ఉంది.
Vivo Y02 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y02 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 2.5డీ యూనిబాడీ డిజైన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y02 లో మీడియాటెక్ హీలియో పీ22 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు.
- ఓఎస్: Vivo Y02 డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo Y02 లో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Vivo Y02 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.












