Home News Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30e

Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30e

Highlights
  • త్వరలో Vivo V30e లాంచ్
  • మోడల్ నంబర్ V2339
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్ తో సహా వివిధ మార్కెట్లలో V30 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో వచ్చిన Vivo V30, V30 Pro స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వివో నుంచి ఇదే సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. Vivo V30e పేరుతో రానున్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30e బీఐఎస్ లిస్టింగ్

Vivo V30e డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2339 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. MySmartPrice తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.

గతంలో Vivo V30e డివైజ్ ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ-5, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై కనిపించింది.

ఇటీవలె బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా Vivo V30e పేరు ఖరారైంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్ (అంచనా)