Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V40 SE 5G

Highlights

  • గ్లోబల్‌గా Vivo V40 SE 5G లాంచ్
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్‌గా V40 SE 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ విదేశాల్లో పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా Vivo V40 SE 5G ధరను ప్రకటించలేదు. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V40 SE 5G లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ కటౌట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఈ4 అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్, 107% కలర్ శాచురేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V40 SE 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • కెమెరా: Vivo V40 SE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo V40 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleVivo Pad 3 Pro: చైనాలో లాంచైన వివో ట్యాబ్లెట్
Next articleSamsung: IP67 రేటింగ్‌తో బ్రెజిల్‌లో లాంచైన Galaxy M55 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.