
స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే 91mobiles టెస్టింగ్ టీమ్ Vivo V40, Motorola Edge 50 Pro ల యొక్క బ్యాటరీ లైఫ్ ను పరీక్షించింది. ఓసారి ఆ టెస్టుల ఫలితాలను తెలుసుకుందాం.
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయేదాకా, వివిధ టాస్కులను రన్ చేస్తూ వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఈ టెస్టు సమయంలో, Vivo V40 80 శాతం బ్రైట్నెస్ + 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ పై 13 గంటల స్కోరు చేసింది. మరోవైపు, Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ 12 గంటల 30 నిమిషాల స్కోరు నమోదు చేసింది.
విజేత: Vivo V40
వీడియో స్ట్రీమింగ్ టెస్ట్
మేం జరిపిన వీడియో స్ట్రీమింగ్ టెస్టులో, 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్‌పై Motorola Edge 50 Pro ఫోన్ అరగంట తర్వాత, వివో వీ40 కంటే 60mAh ఎక్కువ బ్యాటరీని వాడుకుంది. బ్యాటరీ పర్సెంటేజీ విషయానికి వస్తే, ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ 5 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, వివో వీ40 బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. వివో వీ40 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
విజేత: Vivo V40
గేమింగ్ టెస్ట్
వివో వీ40 లో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను 30 నిమిషాల పాటు ప్రతీ గేమ్‌ను ఆడాక, 16 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం ఉన్నాయి. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ 26 శాతం డ్రాప్ అయ్యింది.
విజేత: Vivo V40
చార్జింగ్ టెస్ట్
80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో.. వివో వీ40 ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజ్‌లో ఉన్న చార్జ్ బూస్ట్ ఫీచర్ వల్లన 128 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు.. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 16 నిమిషాల సమయం పట్టింది. 12జిబి ర్యామ్ వేరియంట్ 128 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కలిగి ఉంది. 8జిబి ర్యామ్ వేరియంట్ 68 వాట్ చార్జర్ తో వస్తుంది.
విజేత: Motorola Edge 50 pro
ఏది బెటర్?
వివో వీ40 మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజెస్ లో అన్ని టెస్టుల ఫలితాలను పరిశీలించాక, Vivo V40 విజేత అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం ప్లస్ పాయింట్. ఇక, Motorola Edge 50 Pro ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ఈ ఫోన్ 128 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం ప్లస్ పాయింట్. ఈ ఫీచర్ 12జిబి ర్యామ్ వేరియంట్ లో మాత్రమే ఉంది.