Home News Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్‌ని టీజ్ చేసిన వివో, ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం!

Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్‌ని టీజ్ చేసిన వివో, ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • తన సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ని టీజ్ చేసిన వివో
  • ఏప్రిల్ లో చైనాలో Vivo X Fold 2 లాంచ్ అయ్యే అవకాశం
  • Vivo X Fold 2 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోందని టాక్

వివో నుంచి రానున్న Vivo X Fold 2 గురించి గత కొన్ని నెలలుగా రూమర్లు వింటున్నాం. వివో సంస్థ ఎట్టకేలకు Vivo X Fold 2 ని టీజ్ చేయడం మొదలు పెట్టింది. చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై వివో Vivo X Fold 2 కి సంబంధించిన పోస్ట్ ని పెట్టింది. అయితే Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఫైనల్ మానికర్, లాంచ్ టైమ్ లైన్ వివరాలు తెలిసాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 2 కి సంబంధించిన తాజా సమాచారాన్ని 91మొబైల్స్ ప్రచురించింది.

Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్

 

వివో సంస్థ తన నుంచి రాబోవు Vivo X Fold 2 గురించి లాంచ్ టైమ్ లైన్ ని, మానికర్ ని టీజ్ చేసింది. చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై న వివో ఈ ఫోన్ కి సంబంధించిన పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఫోన్ గురించి వివో అధికారికంగా సోషల్ మీడియాలో స్పందించినట్లైంది. ఏప్రిల్ నెలలో Vivo X Fold 2 లాంచ్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేదంటే ఏమైనా ముఖ్యమైన ప్రకటనలు ఏప్రిల్ లో వచ్చే అవకాశం ఉంది.

Vivo X Fold 2 ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ తో రానుంది. క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో Vivo X Fold 2 రానుందని సమాచారం. Vivo X Fold 2 డివైజ్ లో ఉండే రెండు స్క్రీన్స్ కూడా అమోలెడ్ ప్యానెల్‌వేనని సమాచారం. అలాగే ఇవి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Vivo X Fold 2 అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ స్క్రీన్ ని కలగి ఉండనుందని సమాచారం. పవర్ఫుల్ స్క్రీన్ ని ఈ ఫోన్ కోసం వివో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, Vivo X Fold 2 ఫోన్ సన్నని, తేలికైన సౌష్టవం కలిగి ఉండనుంది.

Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X Fold 2 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ కస్టమ్ స్కిన్ చైనాకి మాత్రమే పరిమితం అవ్వనుంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ ఉంటుంది.

Vivo X Fold 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. Vivo X Fold 2 లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.