
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo X100 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఇండియాలో లాంచ్ అవుతోన్న మొదటి సిరీస్ Vivo X100 అని కంపెనీ చెబుతోంది. ఇక ఈ లైనప్ లో Vivo X100, Vivo X100 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. జనవరి ఆరంభంలో Vivo X100 సిరీస్ లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన తేదీని కంపెనీ ప్రకటించలేదు. సరే, ఓసారి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ అంటుటు స్కోర్స్, Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
MediaTek Dimensity 9300 AnTuTu స్కోర్
Vivo ఫ్లాగ్షిప్ Vivo X100 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో ఈ సిరీస్ వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ తో పాటు, భారత్ లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. కాగా, ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 2,212,302 పాయింట్లుగా ఉంది. అంటే మునుపటి తరం చిప్ కంటే ఇది 33 శాతం ఎక్కువ శక్తివంతమైనదని నిరూపితమైంది.
Vivo X100, X100 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo X100 మరియు Vivo X100 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ వాడారు.
- కెమెరా: Vivo X100 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో 3X ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Vivo X100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1-ఇంచ్ మెయిన్ కెమెరా, 50ఎంపి 4.3X పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో 100X డిజిటల్ జూమ్ ఫీచర్ ఉంది. ఇక ప్రో-మోడల్ లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
- బ్యాటరీ: Vivo X100 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X100 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది.
- ఓఎస్: Vivo X100, Vivo X100 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo X100, Vivo X100 Pro ఫోన్లలో 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్లు బ్లాక్, ఆరెంజ్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.











