120W ఫాస్ట్ చార్జింగ్, 50MP ఐఎంఎక్స్989 సెన్సర్ తో లాంచైన Vivo X90 Pro

Highlights

  • భారత్ లో లాంచైన Vivo X90 Pro మరియు Vivo X90
  • Carl Zeiss కెమెరా లెన్స్ తో వచ్చిన Vivo X90 Pro
  • 120W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో నేడు భారత్ లో Vivo X90 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X90 మరియు Vivo X90 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. రెండు డివైజెస్ కూడా 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ లెన్స్ తో Vivo X90 Pro డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం Vivo X90 Pro డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత గురించి తెలుసుకుందాం.

Vivo X90 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Vivo X90 Pro లో 6.78-ఇంచ్ క్యూ9 అల్ట్రా-విజన్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

చిప్సెట్, ఓఎస్, ర్యామ్

Vivo X90 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. 3.05 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా విభాగం

Vivo X90 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ సెన్సర్, 12ఎంపి ఐఎంఎక్స్663 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్758 పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Vivo X90 Pro లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

Vivo X90 Pro ధర

Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.84,999 గా ఉంది. లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్ లో ఈ ఫోన్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ తో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో రూ.8,000 డిస్కౌంట్ ని పొందవచ్చు. ఈ డివైజ్ ని మే 5 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article50MP కెమెరా, 12GB ర్యామ్ తో భారత్‌లో లాంచైన Vivo X90 5G
Next articleWhatsApp ద్వారా హై క్వాలిటీ ఫోటోలను పంపడం ఎలాగో తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.