హైలైట్స్
- చైనాలో లాంచ్ అయిన వివో ఎక్స్-90 సిరీస్ ఫోన్లు
- టాప్-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన Vivo X90 సిరీస్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, 2కే అమోలెడ్ డిస్ప్లే, 452 పీపీఐ, హెచ్డీఆర్10+ తో వచ్చిన Vivo X90 Pro
Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ Vivo X90 సిరీస్ Vivo X80 సిరీస్ కి సక్సెసర్ గా వచ్చింది. Vivo X90, Vivo X90 Pro డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ తో వచ్చాయి. Vivo X90 Pro+ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్లు మూడు కూడా అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వచ్చాయి.
Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నాయి. ఈ అన్ని మోడల్స్ లో కూడా 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా అమర్చబడి ఉన్నాయి. 3 స్మార్ట్ ఫోన్స్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి. Vivo X90 సిరీస్ Zeiss ఆప్టిక్స్ తో వస్తోంది. ప్రో-మోడల్స్ లో లెదర్ ఫినిష్ బ్యాక్ ఉండనుంది. అలాగే ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఏఐ టాస్క్స్ కోసం వివో వీ2 చిప్ ఉంది.
Vivo X90 Pro స్పెసిఫికేషన్స్
Vivo X90 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ తో వస్తోంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G715 GPU ని వాడారు. Vivo X90 Pro 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Vivo X90 Pro లో 4,870 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ మరియు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. Vivo X90 Pro డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.5 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.3 మిల్లీ మీటర్ల మందం, 215 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా హై-రెజుల్యూషన్ ఆడియో, aptX-HD వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
Vivo X90 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo X90 Pro లో 50 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్866 ప్రైమరీ సెన్సర్, ఓఐఎస్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 50ఎంపి పొట్రెయిట్ సెన్సర్ (2x ఆప్టికల్ జూమ్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Vivo X90 Pro లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Vivo X90 Pro ధర
Vivo X90 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర RMB 4999 (సుమారు రూ.57,200) గా ఉంది. ఇక 12జిబి + 256జిబి యూనిట్ ధర RMB 5499 (సుమారు రూ.63,000), 12జిబి + 512జిబి వేరియంట్ ధర RMB 5999 (సుమారు రూ.68,700) గా ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












