హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
- సోని తయారు చేసిన 1-ఇంచ్ సెన్సర్ తో వస్తోన్న Vivo X90, ఇదివరకు షావోమి 12ఎస్ అల్ట్రా లో వాడబడిన సోని 1-ఇంచ్ సెన్సర్
- 120 హెర్ట్జ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండే అవకాశం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Vivo త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X90 ని లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ క్వాల్కమ్ మరియు మీడియాటెక్ చిప్స్ ని కలిగి ఉండనుంది. Vivo X90 సిరీస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తాజాగా బయటకు వచ్చిన లీక్ ద్వారా తెలిసింది. సోని తయారు చేసిన 1-ఇంచ్ సెన్సర్ ని Vivo X90 సిరీస్ లో వాడనున్నట్లు సమాచారం. GSMArena ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఇకపోతే 1-ఇంచ్ సోని సెన్సర్ ని ఇదివరకు Xiaomi 12S Ultra లో కూడా వాడటం జరిగింది.
Vivo X90 విశేషాలు
GSMArena రిపోర్ట్ ప్రకారం, Vivo X90 సిరీస్ 50 మెగా పిక్సెల్ 1-ఇంచ్ ఇమేజ్ సెన్సర్ ని వాడనున్నట్లు తెలుస్తోంది. ఇదే సెన్సర్ ప్రస్తుతం షావోమి 12ఎస్ అల్ట్రాలో అందుబాటులో ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ లో 1-ఇంచ్ సెన్సర్ ని వాడటం క్లిష్టతరమైన పని. ఎందుకంటే భారీ సెన్సర్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ఇతర కంపొనెంట్స్ కుదురుకునేందుకు సరిపడా చోటు దొరకడం కష్టం. దీంతో ఫోన్ మేకర్లు తమ ఇన్నేవేటివ్ ఐడియాస్ తో మెరుగైన కెమెరా సెన్సర్స్ ని అందించేందుకు కృషి చేస్తున్నారు.
అయితే 1-ఇంచ్ సెన్సర్ Vivo X90 సిరీస్ యొక్క టాప్ వేరియంట్ అయిన Vivo X90 Pro Plus 5G లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగతా వేరియంట్స్ లో వేరే కెమెరాలు ఉండనున్నాయి.
Vivo X90 సిరీస్ టాప్ వేరియంట్ లో 64ఎంపి ఒమ్నివిజన్ టెలిఫోటో కెమెరా ఉండనుంది. ఇది 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ట్రీ-స్టేజీ ఎక్స్‌పోజర్ హెచ్డీఆర్ ఫోటోగ్రఫీ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే ఇందులో 50ఎంపి పొట్రెయిట్ యూనిట్ కూడా ఉండనుంది. గత మోడల్స్ తో పోల్చితే Vivo X90 సిరీస్ కెమెరా విభాగంలో ఇంప్రూవ్మెంట్స్ తో వస్తోంది.
Vivo X90 టాప్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో ఓసారి చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇకపోతే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానుంది. ఈ ఏడాది డిసెంబర్ లో Vivo X90 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












