త్వరలో లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11 Pro 5G; బీఐఎస్ పై లిస్ట్ అయిన డివైజెస్

Highlights

  • అతి త్వరలో భారత్ లో లాంచ్ కానున్న రియల్మీ 11 సిరీస్
  • బీఐఎస్ పై లిస్ట్ అయిన Realme 11 5G, Realme 11 Pro 5G
  • అంతకు ముందు బీఐఎస్ పై లిస్ట్ అయిన Realme 11 Pro+ 5G

Realme 11 సిరీస్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మన ముందుకు వచ్చింది. తాజాగా ఇండియన్ సర్టిఫికేషన్ సైట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ లో Realme 11 5G, Realme 11 Pro 5G డివైజెస్ లిస్ట్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నాడు.

Realme 11 సిరీస్ ఇండియా లాంచ్

Realme 11 5G, Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ బీఐఎస్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. గతంలో Realme 11 Pro+ 5G డివైజ్ కూడా బీఐఎస్ లిస్టింగ్ కనిపించింది. ఇకపోతే Realme 11 5G ఫోన్ RMX3761 అనే మోడల్ నంబర్, Realme 11 Pro 5G డివైజ్ RMX3771 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యాయి. అయితే కంపెనీ ఇంకా ఈ కొత్త సిరీస్ ఫోన్ల గురించి అఫీషియల్ గా ఏ విషయం వెల్లడించలేదు. కానీ, త్వరలోనే Realme 11 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme 11 Pro 5G స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 6జిబి ర్యామ్
  • 1టిబి స్టోరేజీ

Realme 11 Pro 5G డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుందని అంచనా. ఈ డివైజ్ 4 మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. బేస్ మోడల్ 6జిబి ర్యామ్ తో రానుంది.

  • 100ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme 11 Pro 5G లో ఫోటోగ్రఫీ కోసం 100 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించే అవకాశం ఉంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 4 వేరియంట్స్ లో రానుందని రూమర్లు వినిపిస్తున్నాయి. Realme 11 Pro+ 5G డివైజ్ 200ఎంపి భారీ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ తో రానుందని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే చాన్స్ ఉంది.

Realme 11 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.